India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే నియమితులయ్యారు. MI హెడ్ కోచ్ జయవర్దనే నేతృత్వంలో మలింగతో పాటు ఈయన బౌలింగ్ బాధ్యతలు చూసుకుంటారు. ముంబైకి చెందిన ఈ మాజీ పేస్ బౌలర్ 2024 టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమ్ ఇండియా కోచింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఈయన భారత్ తరఫున 2 టెస్టులు, 3 వన్డేలు ఆడారు.

బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా దానిని ఢిల్లీకి మళ్లించారు. గత 48 గంటల్లో ఇలా నకిలీ బెదిరింపు కాల్స్ రావడం ఇది 11వ సారి. మంగళవారం 8, సోమవారం 2 వచ్చాయి. ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, DGCA అధికారులు వేర్వేరుగా సమావేశమయ్యారు. డార్క్‌వెబ్ ద్వారా ఈ కాల్స్ వస్తున్నాయని, కొందరు దోషుల్ని గుర్తించారని తెలిసింది.

AP: అన్నక్యాంటీన్లకు TDP రంగులు వేస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. గతంలో సచివాలయాలకు బ్లూ కలర్ వేయడంతో వాటిని తొలగించాలని ఇచ్చిన తీర్పును పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకి తెలిపారు. రంగులు తొలగించడానికి సమయం పట్టడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ సైతం దాఖలైందన్నారు. గతంలో క్యాంటీన్లకు ఏ కలర్ వేశారని కోర్టు ప్రశ్నించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణను 6వారాలకు వాయిదా వేసింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టులో తొలిరోజు ఆట రద్దయింది. అక్కడ భారీ వర్షం కురుస్తుండడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. వర్షం మళ్లీ రాకపోతే రేపు ఉ.8.45కి టాస్ వేసి 9.15గంటలకు మ్యాచ్ ప్రారంభిస్తారు.

‘మేడిన్ ఇండియా’ తొలి బుల్లెట్ ట్రైన్లను రూపొందించే అవకాశం బెంగళూరులోని BEMLకు దక్కింది. డిజైనింగ్, తయారీ, 2 హైస్పీడ్ ట్రైన్ సెట్స్ కోసం కంపెనీకి ICF రూ.867 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో కోచ్ ధర రూ.27.86 కోట్లు. ‘భారత హైస్పీడ్ రైల్ జర్నీలో ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయి. 280 KMPH స్పీడ్‌తో ట్రైన్ సెట్లను దేశీయంగా డిజైన్ చేయబోతున్నాం’ అని BEML తెలిపింది. 2026 ఆఖర్లో వీటిని డెలివరీ చేస్తుందని సమాచారం.

నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌కు అనిల్ కుంబ్లే కీలక సూచన చేశారు. రోహిత్ స్థానంలో గిల్‌తో ఓపెనింగ్ చేయించవద్దని, అతడిని మూడో స్థానంలోనే కొనసాగించాలని అన్నారు. జైస్వాల్‌కు ఓపెనింగ్ జోడీగా KL రాహుల్‌ను పంపిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. రాహుల్ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడగలరని, గిల్ పొజిషన్‌ను ఛేంజ్ చేయడం అవసరం లేదన్నారు.

తనకు చిన్నతనం నుంచి రేసింగ్ అంటే చాలా ఇష్టమని హీరో నాగచైతన్య చెప్పారు. కొత్త రకం బైక్, కారు ఏది కనిపించినా వెంటనే డ్రైవ్ చేసేవాడినని తెలిపారు. సినిమాలతో బిజీగా మారడంతో ఆ అలవాటును తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వేగంగా వెళ్లొద్దని సన్నిహితులు సూచించడంతో రేసింగ్‌కు దూరమైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నారు.

జమ్మూకశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, అందుకు ఒమర్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NC, కాంగ్రెస్ కూటమి మెజార్టీ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

AP: జగన్ అధికారంలో ఉన్న సమయంలో సొంత అవసరాలకు ప్రజా ధనాన్ని ఉపయోగించారని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఇనుప కంచె వేసేందుకు రూ.12.85 కోట్లు వినియోగించారని పేర్కొన్నారు. పేదల ఇళ్ల కోసం ఉపయోగించాల్సిన డబ్బును అత్యవసర భద్రతా కారణాలు చెప్పి వాడుకున్నారని దుయ్యబట్టారు. తన ఆనందాల కోసం ప్రజాధనాన్ని వినియోగించిన జగన్ సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండని అబ్దుల్ కలాం చెప్పిన మాటలను నిజం చేసుకున్నాడో 64 ఏళ్ల వృద్ధుడు. ఒడిశాకు చెందిన జే కిషోర్ కొన్నేళ్ల క్రితం SBIలో డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. వైద్యుడవ్వాలనే తన చిరకాల వాంఛను ఎలాగైనా నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కష్టపడి చదివి NEET UG-2020లో ప్రవేశం పొందారు. ప్రస్తుతం బుర్లాలో ఉన్న VIMSARలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.