News October 22, 2024

రాష్ట్రంలో కొత్త వ్యవసాయ కాలేజీలు

image

TG: ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కొత్తగా అగ్రికల్చర్ కాలేజీలను ప్రారంభించాలని వ్యవసాయ శాఖ ఆలోచిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ కోర్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కాలేజీల ఏర్పాటుకై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలోనూ అగ్రికల్చర్ కోర్సులు ప్రవేశపెట్టాలని వ్యవసాయ శాఖ కోరింది.

News October 22, 2024

12 మంది హెడ్ మాస్టర్ల సస్పెండ్

image

TG: రాష్ట్రంలో 12 మంది హెడ్ మాస్టర్‌లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ట్రాన్స్‌ఫర్స్‌లో భర్త లేదా భార్య తన స్పౌజ్ పని చేసే పాఠశాలలకు దగ్గరగా ఆప్షన్ ఎంచుకోవాలనే నిబంధన ఉంది. గతేడాది బదిలీల సందర్భంగా ఈ స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారనే అభియోగాలపై విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించింది. మహబూబ్ నగర్(D)లో 10 మంది, వనపర్తి, జనగామ(D)ల్లో ఒక్కో హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

News October 22, 2024

టెట్ పరీక్షకు 86 శాతం మంది హాజరు

image

AP: రాష్ట్రంలో 17 రోజులుగా కొనసాగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సోమవారంతో ముగిసింది. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661(86.38శాతం) మంది పరీక్షలు రాశారు. పేపర్-2ఏ సాంఘిక శాస్త్రం, పేపర్-2బీ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ‘కీ’ ఈ నెల 23 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.

News October 22, 2024

టీడీఆర్ బాండ్ల ఆన్‌లైన్ పోర్టల్ పున:ప్రారంభం

image

AP: టీడీఆర్ బాండ్ల వినియోగానికి ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం పున:ప్రారంభించింది. ఇకపై ఆన్‌లైన్‌ దరఖాస్తులను అధికారులు పరిశీలనకు తీసుకోనున్నారు. అపార్ట్‌మెంట్లలో అదనపు ఫ్లోర్లు వేసుకోవడానికి ఉద్దేశించిన ఈ బాండ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ప్రభుత్వం వీటిని నిలిపివేసింది. సర్వే నంబర్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని మార్కెట్ విలువ ఆధారంగా కొత్త TDR బాండ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.

News October 22, 2024

లగ్జరీ ఇళ్ల విక్రయాలు భేష్!

image

దేశ వ్యాప్తంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. SEPతో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.4 కోట్లకు పైగా విలువైన 12,630 యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ CBRE వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 9,165 యూనిట్లు కాగా 38% వృద్ధి నమోదైంది. అయితే HYD, బెంగళూరులో మాత్రం అమ్మకాలు తగ్గాయి. ఆదాయం పెరగడం, సులభతర రుణ సదుపాయాలతో లగ్జరీ ఇళ్లపై పెట్టుబడులు పెడుతున్నారని CBRE తెలిపింది.

News October 22, 2024

స్కూల్ టీచర్ వేధించాడు.. ఎవరికీ చెప్పుకోలేకపోయా: సాక్షి మాలిక్

image

చిన్నతనంలో తాను ఎదుర్కొన్న కష్టాలను ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్, మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్ తన బుక్ ‘విట్‌నెస్’లో వెల్లడించారు. ‘ట్యూషన్ టీచర్ వేధించేవాడు. కొన్నిసార్లు నన్ను తాకేందుకు ప్రయత్నించేవాడు. దీంతో క్లాస్‌లకు వెళ్లేందుకు భయపడేదాన్ని. ఇది నా తప్పుగా భావించి పేరెంట్స్‌కు చెప్పలేకపోయా’ అని పేర్కొన్నారు. రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టాక కూడా ఎప్పుడు పారిపోవాలనే ఆలోచించేదాన్నని రాసుకొచ్చారు.

News October 22, 2024

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి: కిషన్ రెడ్డి

image

TG: దేశంలో పవర్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిగుమతులు తగ్గించుకుంటూ దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచే దిశగా మరింత కృషి జరగాలన్నారు. అవసరమైన చోట నిబంధనలు మార్చడానికి సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్మికులు, గనుల కోసం భూములు వదిలి వెళ్తున్న వారి సంక్షేమం కోసం MDOలు ఆలోచించాలని సూచించారు. ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యమివ్వాలన్నారు.

News October 22, 2024

ఈ సింగర్ ఆస్తి రూ.లక్ష కోట్లు!

image

సింగర్, పాటల రచయితగా సంగీత ప్రియులకు దగ్గరైన అనన్య శ్రీ బిర్లా అత్యంత ధనవంతురాలని చాలా మందికి తెలియదు. బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా పెద్ద కుమార్తెనే ఈ అనన్య బిర్లా. ఆమె 2016లో సంగీతరంగ ప్రవేశం చేసి అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. 28 ఏళ్ల వయసులోనే ఆమె ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ABFRL) డైరెక్టర్‌‌గా పనిచేస్తున్నారు. ఆమె నెట్‌వర్త్ $13 బిలియన్లు (రూ.లక్ష కోట్ల పైనే).

News October 22, 2024

మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టడం హర్షనీయం: పవన్

image

AP: మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాలకు ఆ మహనీయుడి పేరు పెట్టడం ద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందుతుందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేలా ఆయన జాతీయ జెండాను రూపొందించి జాతికి అందించారని కొనియాడారు.

News October 22, 2024

బీటెక్ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ప్రభుత్వం

image

TG: నాలుగు ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల పెంపునకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సీట్లు కావాలని ఆయా కాలేజీలు JNTUని కోరాయి. అందుకు జేఎన్‌టీయూ అంగీకరించకపోవడంతో కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన హైకోర్టు నాలుగు కళాశాలలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేయనుంది.