News October 9, 2024

మూసీ నిర్వాసితులకు నది దగ్గర్లోనే ఇళ్లు: భట్టి

image

TG: హైదరాబాద్ మూసీ నిర్వాసితుల పునరావాసంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష చేశారు. మూసీ గర్భంలో నివసిస్తున్న వారిని పరివాహాకానికి దూరంగా పంపించబోమని, నది దగ్గరలోనే ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టాలు లేని వారిని కూడా ఆదుకుంటామన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు మేలు కలిగే సూచనలు ఇవ్వాలన్నారు.

News October 9, 2024

బాబుకు చింత చచ్చినా పులుపు చావలేదు: రోజా

image

AP: CM చంద్రబాబు తీరు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుందని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి హిందువుల మనోభావాలు గాయపరిచారని మండిపడ్డారు. ‘CBI సిట్‌ వేసిన సుప్రీం రాజకీయ విమర్శలు చేయొద్దని ఆదేశించింది. కానీ దానిపై తాను మాట్లాడకుండా తన అనుకూల మీడియాలో కల్తీ వార్తలు ప్రచారం చేయిస్తున్నారు. కల్తీ రాజకీయాలు చేసేవారే కల్తీ ప్రచారాన్ని నమ్ముతారు’ అని ఆమె ట్వీట్ చేశారు.

News October 9, 2024

రాష్ట్రంలో 30 జిల్లాలు అని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన CM

image

AP: రాష్ట్రంలో 30 జిల్లాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మార్కాపురం, మదనపల్లె, ఇతర కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామనే హామీలున్నాయని, కానీ ఆ ప్రక్రియ ఇప్పట్లో ఉండదని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉండగా వాటిని 30కి పెంచినట్లు ఓ ఫేక్ జీవో వైరల్ అవుతోంది.

News October 9, 2024

రింకూ, నితీశ్ ఫిఫ్టీ: బంగ్లాదేశ్‌కు భారీ టార్గెట్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమ్ ఇండియా భారీ స్కోర్ సాధించింది. తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయినా నితీశ్ కుమార్ రెడ్డి (74), రింకూ సింగ్ (53) ఫిఫ్టీలతో మెరుపులు మెరిపించారు. ఇద్దరూ చెలరేగి ఆడగా, భారత్ ఓవర్లన్నీ ఆడి 221/9 రన్స్ చేసింది. చివర్లో హార్దిక్ పాండ్య (32) దూకుడుగా ఆడారు. బంగ్లా బౌలర్లలో హోస్సేన్ 3, తస్కిన్ అహ్మద్, హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు తీశారు.

News October 9, 2024

జో రూట్ ది గోట్ అనాల్సిందే!

image

నేటి తరం క్రికెట్‌లో విరాట్, రూట్, విలియమ్సన్, స్మిత్ అద్భుతమైన ఆటగాళ్లని క్రీడా నిపుణులు చెబుతుంటారు. అయితే రూట్ మిగిలినవారిని దాటి చాలా ముందుకెళ్లిపోయారు. గడచిన నాలుగేళ్ల రికార్డు చూస్తే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) అనాల్సిందే. 45 నెలల్లో 50 టెస్టు మ్యాచులాడిన రూట్, దాదాపు 60 సగటుతో 5వేలకు పైగా రన్స్ చేశారు. వీటిలో 18 శతకాలున్నాయి. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ రన్స్ జాబితాలో ఆయనదే అగ్రస్థానం.

News October 9, 2024

పాకిస్థాన్‌కు ఐసీసీ బిగ్ షాక్?

image

పాకిస్థాన్‌ టీమ్‌కు ICC బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్‌లో కాకుండా ఇతర దేశాల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. UAE, శ్రీలంక, సౌతాఫ్రికాల్లో ఎక్కడో ఓ చోట టోర్నీ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. లేదంటే హైబ్రిడ్ మోడల్‌లో భారత్ మ్యాచులు పాక్ ఆవల నిర్వహించాలని భావిస్తున్నట్లు టాక్. BCCI అంగీకరిస్తే పాక్‌లోనే టోర్నీ ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం.

News October 9, 2024

ఏపీ ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం

image

AP: లిక్కర్ షాపుల టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 50వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 11 వరకు అప్లికేషన్లు సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు. వాటిని వెరిఫై చేసి 14న డ్రా తీసి సెలక్ట్ చేస్తామని చెప్పారు. 16 నుంచి కొత్త లైసెన్స్ పీరియడ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

News October 9, 2024

టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు

image

AP: మాజీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి వీరిద్దరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

News October 9, 2024

ఉమెన్స్ WC: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

image

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

IND: షఫాలీ, మంధాన, జెమిమా, హర్మన్‌(C), రిచా, దీప్తి, సాజన, అరుంధతి, శ్రేయాంక, శోభన, రేణుక.

SL: విష్మీ గుణరత్నే, చమరి ఆటపట్టు(C), హర్షిత, కవిష, నీలాక్షి, అనుష్క, కాంచన, సుగంధిక, ఇనోషి, ఉదేషికా, ఇనోక.

News October 9, 2024

రతన్ టాటా ఆరోగ్యం విషమం?

image

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా(86) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నారని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. తన ఆరోగ్యం బాగుందంటూ టాటా 2 రోజుల క్రితమే స్పష్టతనిచ్చారు. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నానని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అవే వార్తలు రావడం గమనార్హం.