News March 26, 2024

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రపతి కుమార్తె?

image

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుమార్తె ఇతిశ్రీ ముర్ము పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆమెను బరిలో దింపాలని బీజేపీ భావిస్తోందట. గిరిజనులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇతిశ్రీని పోటీకి నిలబెడితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరపతి కలిసివస్తుందని భావిస్తోందట. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే బీజేపీ అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

News March 26, 2024

షర్మిల పట్ల జగన్ ప్రేమ తగ్గలేదు: సజ్జల

image

AP: వైఎస్ జగన్, షర్మిల మధ్య రాజకీయంగానే కాక వ్యక్తిగతంగానూ విభేదాలున్నాయంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో వాటిని ఖండించారు. ‘రాజకీయ లక్ష్యాలే తప్ప వైఎస్ కుటుంబంలో ఏ గొడవలూ లేవు. షర్మిల పట్ల అన్నగా జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. షర్మిలే రాజకీయంగా తప్పటడుగు వేశారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రభావం ఏమాత్రం ఉండదు’ అని ఆయన స్పష్టం చేశారు.

News March 26, 2024

ధోనీలా చేయాలనుకోకు.. హార్దిక్‌‌కు షమీ చురకలు

image

గుజరాత్‌తో మ్యాచులో హార్దిక్ కెప్టెన్సీపై షమీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ధోనీలా 7వ ప్లేస్‌లో వచ్చి మ్యాచును ముగించడం అందరికీ సాధ్యంకాదు. ధోనీ ఎప్పటికీ ధోనీనే. అతడిలా ఎవరూ సరితూగరు. గతంలో హార్దిక్ 4,5 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ చేశారు. కానీ MI తరఫున 7వ ప్లేస్‌లో వచ్చారు. అలా వస్తే తనపై తానే ఒత్తిడి పెంచుకున్నట్లవుతుంది. పాండ్య ముందుగా వచ్చి ఉంటే మ్యాచ్ అంతవరకు వచ్చేది కాదు’ అని షమీ చురకలు అంటించారు.

News March 26, 2024

సుక్కు, చరణ్ సినిమా ఆల్రెడీ బ్లాక్‌బస్టరే: కార్తికేయ

image

రామ్‌ చరణ్-సుకుమార్ కాంబోలో మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందే బ్లాక్‌బస్టర్ అని రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ పేర్కొన్నారు. ‘RRR క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు చరణ్ నాకు సుకుమార్‌గారి సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్‌ గురించి చెప్పారు. వినగానే నా మైండ్ పోయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని చూస్తున్నా’ అని ట్విటర్‌లో తెలిపారు.

News March 26, 2024

దాడి చేసింది ఐస్లామిక్ స్టేటే: మాక్రాన్

image

రష్యాపై ఉగ్రదాడి ఇస్లామిక్ స్టేట్ పనేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తాజాగా తేల్చిచెప్పారు. అందుకు తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. ‘దాడులు చేసింది తామేనని ఐసిస్ స్వయంగా ప్రకటించింది. మా నిఘా వర్గాలు కూడా అదే తేల్చాయి. ఈ దాడిని ఉక్రెయిన్‌పైకి నెట్టాలని రష్యా భావిస్తే అది మూర్ఖత్వమే కాదు, ఆ దేశ భద్రతకు ప్రమాదం కూడా. ఐసిస్ గతంలో మాపైనా దాడికి యత్నించింది’ అని మాక్రాన్ వెల్లడించారు.

News March 26, 2024

రెండేళ్లుగా విద్యార్థిని భుజాలపై మోసుకెళ్తూ..

image

క్లాసులు పూర్తయ్యాక టీచర్లు స్కూల్ నుంచి వెళ్లిపోవడం కామన్. చైనాలోని చాంగ్‌కింగ్ డియాన్‌జియాంగ్ సెకండరీ స్కూల్‌లో టీచర్‌ జులాంగ్‌జున్ మాత్రం అలా కాదు. నార్కోలెప్సీతో బాధపడుతున్న తన విద్యార్థిని 2ఏళ్ల నుంచి రోజూ భుజాల మీద మోసుకుంటూ ఇంటికి తీసుకెళుతున్నారు. నార్కోలెప్సీ అంటే అకస్మాత్తుగా నిద్రపోవడం. ఇటీవల ఆ టీచర్ తన విద్యార్థిని భుజాలపై మోసుకెళుతుండగా CCTVలో రికార్డయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

News March 26, 2024

ఏపీలో అన్ని చోట్లా పోటీ చేస్తాం: బీఎస్పీ

image

AP: రాష్ట్రంలో అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ సీట్లు అన్నింటిలోనూ బరిలోకి దిగనున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ సమన్వయకర్త, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు విలేకరులకు తెలిపారు. బీఎస్పీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సందర్భంగా రాయలసీమలో ఆధిపత్య కులాల రాజకీయాలను ఎండగడతామని హెచ్చరించారు. నెల్లూరుతో పాటు రాయలసీమ వ్యాప్తంగా 40స్థానాల్లో ఒకే సామాజికవర్గం పోటీలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

News March 26, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 26, 2024

మార్చి 26: చరిత్రలో ఈరోజు

image

1872: తెలుగు గ్రంథకర్త దివాకర్ల తిరుపతి శాస్త్రి జననం
1965: నటుడు ప్రకాశ్ రాజ్ జననం
1971: భారత్ సాయంతో పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి
1972: నటి మధుబాల జననం
1977: లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవ రెడ్డి పదవీస్వీకారం
2000: రష్యా అధ్యక్షుడిగా పుతిన్ తొలిసారి ఎన్నిక
2006: తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు కన్నుమూత
2016: మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతి రాజు ‌మ‌ృతి

News March 26, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: మార్చి 26, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:03
సూర్యోదయం: ఉదయం గం.6:15
జొహర్: మధ్యాహ్నం గం.12:22
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:28
ఇష: రాత్రి గం.07.41
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!