India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేదీ: మార్చి 26, మంగళవారం
బహుళ పాడ్యమి: మధ్యాహ్నం 02:55 గంటలకు
హస్త: మధ్యాహ్నం 01:33 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:35-09:23 గంటల వరకు
రాత్రి 11:01-11:48 గంటల వరకు
వర్జ్యం: రాత్రి 10:27
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
* AP: వాలంటీర్లకు టీడీపీ క్షమాపణ చెప్పాలి: వైసీపీ
* తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తాం: చంద్రబాబు
* పిఠాపురంలో పవన్‌దే గెలుపు: ఉదయ్
* TG: ఎన్నికలయ్యాక ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
* రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: హరీశ్
* హిందువులు ప్రమాదంలో ఉన్నారు: బండి
* IPL: బోణీ కొట్టిన RCB, పంజాబ్‌పై గెలుపు
సోషల్ మీడియాలో రీల్స్ మోజులో కొందరు చేసే చేష్టలు చిరాకు తెప్పిస్తుంటాయి. తాజాగా స్కూటీపై ఇద్దరు యువతులు చేసిన హంగామాపై పోలీసులు సీరియస్ అయ్యారు. రంగులు పూసుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో వాహనంపై ఉన్న ముగ్గురికీ రూ.33 వేల జరిమానా విధించారు. ఈ విషయాన్ని పోలీసులు ఎక్స్ వేదికగా వెల్లడించారు. పోలీసుల చర్యకు నెటిజన్ల నుంచి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో RCB 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన PBKS 20 ఓవర్లలో 176/6 రన్స్ చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన RCBలో విరాట్ కోహ్లీ(77) ఒంటరి పోరాటం చేశారు. చివర్లో లామ్రర్(17*), కార్తీక్(10 బంతుల్లో 28*) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించారు. PBKS బౌలర్లలో రబడ, బ్రార్ చెరో 2 వికెట్లు తీయగా.. కర్రన్, హర్షల్ తలో వికెట్ తీశారు.
కంగనా రనౌత్‌ని BJP MP అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె పొలిటికల్ కెరీర్ మొదలైనట్లయింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కంగనా.. 15ఏళ్లప్పుడు ఇంటి నుంచి పారిపోయి, డ్రగ్స్‌కి బానిసయ్యారట. 2006లో ‘గ్యాంగ్‌స్టార్’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోనూ నటించారు. ఆమెకు 4 నేషనల్, 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 ఇంటర్నేషనల్ అవార్డులు, 2021లో పద్మశ్రీ వచ్చాయి.
TG: వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డీఎంఈ సహా డీపీఏ, డీసీహెచ్, కమిషనర్, టీవీవీపీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆ పోస్టులను ఇన్‌ఛార్జ్‌లతోనే ప్రభుత్వం భర్తీ చేస్తోంది. తాజాగా ఎన్నికల కోడ్ రావడంతో ఎలక్షన్స్ తర్వాత నియామకాలు చేపట్టనుంది.
గాజాలో తక్షణ కాల్పుల విరమణ తీర్మానానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వెల్లడించారు. ‘సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. ఈ తీర్మానాన్ని తప్పకుండా అమలు పరచాలి’ అని పేర్కొన్నారు. ఈ తీర్మానానికి 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉంది.
టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సాధించారు. టీ20ల్లో 100సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశారు. దీంతో పాటు ఇదే మ్యాచ్‌లో అత్యధిక క్యాచులు(173) పట్టిన భారత ప్లేయర్‌గానూ అవతరించారు. బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో ఈ ఫీట్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో రైనా(172), రోహిత్(167) ఉన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారింది. ఈ నిర్మాణ సంస్థ చేతిలో బడా హీరోల చిత్రాలు లాక్ అయ్యాయి. అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రీకరణ కొనసాగుతోండగా.. చెర్రీ-సుకుమార్, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, ప్రభాస్-హను రాఘవపూడి, గుడ్ బ్యాడ్ అగ్లీ(అజిత్), రాబిన్ హుడ్(నితిన్), విజయ్ దేవరకొండ-రాహుల్ సాంకృత్యాయన్ మూవీలతో పాటు పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.