India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TS: భూగర్భజలాలు అడుగంటిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. రెండు మూడు బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తడి లేక పంట ఎండిపోతోందని వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో 500 అడుగుల మేర తవ్వినా నీటి జాడ లభించకపోవడం గమనార్హం. దీంతో ఆరుతడులతో ఎలాగో నెట్టుకొస్తున్నామని రైతన్నలు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో మున్ముందు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా హోలీ జరుపుకొనేవారందరికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హోలీ వేడుకలను చేసుకుంటారు. వసంత రుతువు ఆగమనాన్ని వివిధ రంగులతో గుర్తుచేసుకుంటారు. వారందరికీ మా ఇద్దరి తరఫున శుభాకాంక్షలు’ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య చెన్నైలో మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం రెండు జట్లూ చెరో మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్నాయి. కాగా.. ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ హోం టీమ్‌లే గెలిచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుందా లేక రుతురాజ్ సేనపై గుజరాత్ పైచేయి సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అనుమానాస్పద మరణం తర్వాత దేశంలో పుతిన్ ప్రత్యర్థులందరూ వణికిపోతున్నారని అక్కడి ‘ఫ్రీ రష్యా ఫౌండేషన్’ సలహాదారు ఇవ్జీనియా కారా-ముర్జా వెల్లడించారు. అధ్యక్షుడి తీరును తన భర్త వ్లాదిమిర్ సహా పలువురు ఎండగట్టారని, దీంతో కోర్టు 25ఏళ్ల జైలు శిక్ష విధించిందని తెలిపారు. గతంలో తన భర్తను చంపేందుకు చూసినవారే ఇప్పుడు ఆయన్ను అరెస్టు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారణ జరపనుంది. కవితకు కోర్టు విధించిన కస్టడీ సైతం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సీబీఐ కోర్టులో ఆమెను ఈడీ హాజరుపరచనుంది. కస్టడీని మరో 4రోజులపాటు పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది.
AP: నారా లోకేశ్ రెడ్‌బుక్‌పై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన రెడ్‌బుక్ దేనికో అర్థం కావడం లేదు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా ఈ బుక్ ఏంటి? ముందు ఆయన మంగళగిరిలో గెలవాలి కదా?’ అని ఎద్దేవా చేశారు. కాగా తమ పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, పోలీసులు, చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లను ఈ బుక్‌లో రాస్తున్నట్లు లోకేశ్ గతంలో వెల్లడించారు.
రంజాన్ నెల సందర్భంగా ఇజ్రాయెల్ వెంటనే గాజాపై కాల్పుల్ని ఆపాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ బందీలందర్నీ విడిచిపెట్టాలని హమాస్‌కు తేల్చిచెప్పింది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత UNSC స్పందించడం ఇదే ప్రథమం. మండలిలో 15 సభ్యదేశాల్లో అమెరికా తప్ప మిగిలిన అన్ని దేశాలూ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. వీటో అధికారంతో తీర్మానాన్ని అడ్డుకునే ఛాన్స్ ఉన్నా అమెరికా దూరం పాటించింది.
ఇప్పుడు మంచి స్థాయికి చేరుకున్నప్పటికీ జీవితంలో అడ్జస్ట్ అవుతూనే ఉంటానని విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా స్కూల్ డేస్‌లో నాన్నను సైకిల్ అడిగాను. బర్త్ డేకి కొంటానని, సెలవుల్లో కొంటానని సాగదీసి ఎప్పటికో కొన్నారు. వీడియో గేమ్, కంప్యూటర్, టీవీ.. ఇలా అన్నింటిలోనూ చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సర్దుకుపోతుంటాం. అడ్జస్ట్‌మెంట్ అనేది తప్పదు. అది జీవితంలో ఓ పాఠం’ అని పేర్కొన్నారు.
న్యూయార్క్‌కు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్లు అంజలి చక్ర (IND), సూఫీ మాలిక్ (PAK) అనే మహిళలు ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా వీరిద్దరు విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా అంజలిని మోసం చేశా. ఆమెను విపరీతంగా బాధపెట్టా. నేను నా తప్పిదానికి కట్టుబడి ఉన్నా. ఆమెను క్షమాపణలు కోరుతున్నా’ అని మాలిక్ ఓ ప్రకటనలో పేర్కొంది.
పంజాబ్ కింగ్స్‌పై 49 బంతుల్లో 77 రన్స్ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు విరాట్ కోహ్లీ. వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో తాను కచ్చితంగా ఆడాలనుకుంటున్న విషయాన్ని ఆయన మ్యాచ్ అనంతరం పరోక్షంగా వెల్లడించారు. ‘ఆటను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలి. నా పేరును ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు మాత్రమే వాడుతున్నారని తెలుసు. కానీ టీ20 క్రికెట్ ఆట నాలో ఇంకా మిగిలే ఉందనుకుంటున్నా’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.