News October 15, 2024
మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలతో మనోభావాలు దెబ్బతినవు: హైకోర్టు
మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన ఇద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఓ మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారన్న ఆరోపణలపై దక్షిణ కన్నడ పోలీసులు గత ఏడాది ఇద్దర్ని అరెస్టు చేశారు. మసీదు బహిరంగ ప్రదేశం కావడం, స్థానికంగా మతసామరస్యంతో ఉంటున్నామని ఫిర్యాదుదారే చెప్పిన నేపథ్యంలో నిందితులు చేసింది క్రిమినల్ నేరం కిందికి రాదని కోర్టు అభిప్రాయపడింది.
Similar News
News November 10, 2024
సౌదీ అరేబియాలో మెట్రో లోకో పైలట్‌గా తెలుగు మహిళ
HYD మెట్రో రైలు లోకో పైలట్ ఇందిర(33) అరుదైన ఘనత అందుకోనున్నారు. వచ్చే ఏడాది సౌదీలోని రియాద్‌లో ప్రారంభమయ్యే ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌లో సేవలు అందించనున్నారు. రైళ్లను నడపడం, స్టేషన్ల ఆపరేటింగ్‌లో ఆమె నైపుణ్యాన్ని గుర్తించి మెట్రో ప్రాజెక్టుకు ఎంపిక చేసి ఐదేళ్ల పాటు శిక్షణ అందించారు. ఇప్పటికే ఆమె ట్రయల్ రైళ్లను నడుపుతున్నారు. తెలుగు బిడ్డగా ఈ ప్రాజెక్టులో భాగమవ్వడం గర్వంగా ఉందని ఇందిర చెప్పారు.
News November 10, 2024
సౌతాఫ్రికా టార్గెట్ 125
SAతో జరుగుతోన్న రెండో టీ20లో భారత బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్లు శాంసన్ (0), అభిషేక్ శర్మ (4)తో పాటు సూర్య (4), రింకూ సింగ్ (9) ఫెయిల్ అయ్యారు. తిలక్ 20, అక్షర్ 27, హార్దిక్ 39* రన్స్ చేశారు.
News November 10, 2024
రాజస్థాన్‌లో కాలేజీలకు కాషాయ రంగులు.. కాంగ్రెస్ విమర్శలు
కాలేజీలకు కాషాయ రంగులు వేయాలన్న రాజస్థాన్ ప్రభుత్వ ఆదేశాలు ప్రతిపక్షాల ఆగ్రహానికి దారితీశాయి. కాయకల్ప్ పథకం ద్వారా శాంతియుత వాతావరణం సృష్టించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా 20 కాలేజీలకు కాషాయ రంగులు వేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే విద్యను కాషాయీకరణ చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. విద్యా వ్యవస్థల్లో ఉన్న సమస్యలు వదిలేసి రాజకీయాల కోసం ప్రజల డబ్బులు వెచ్చిస్తారా అని విమర్శించింది.