India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హమాస్ మిత్ర సంస్థ ‘ఇస్లామిక్ జిహాద్’ అగ్రకమాండర్ మహ్మద్ అబ్దుల్లా హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. వెస్ట్ బ్యాంక్‌లోని శరణార్థుల శిబిరంలో దాక్కున్న అబ్దుల్లాను మరో ఉగ్రవాదితో కలిపి తమ బలగాలు మట్టుబెట్టాయని తెలిపింది. వారి దగ్గర M-16 రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇటీవల హతమైన ముహమ్మద్ జబ్బెర్ స్థానంలో అబ్దుల్లా చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నాడని వివరించింది.

భారత్‌తో ఆడినప్పుడు భయపడొద్దంటూ న్యూజిలాండ్ టెస్టు జట్టు నూతన సారథి టామ్ లాథమ్ తన టీమ్‌కు పిలుపునిచ్చారు. ‘టీమ్ ఇండియాను వారి స్వదేశంలో ఎదుర్కోవడం పెను సవాలే. అందుకు సిద్ధంగా ఉన్నాం. భయం లేకుండా ఆడి ఎదురుదాడి చేయాలి. గతంలో అక్కడ గెలిచిన జట్లు అదే చేశాయి. దూకుడుతోనే గెలిచే ఛాన్స్ ఉంటుంది. మా ప్లాన్స్ మాకున్నాయి’ అని వెల్లడించారు. వచ్చే మూడు వారాల్లో ఆ జట్టు భారత్‌లో 3 టెస్టులాడనుంది.

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఫలితాల సీజన్ ఆరంభమవ్వడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రస్తుతం BSE సెన్సెక్స్ 23 పాయింట్లు పెరిగి 81,637 వద్ద ట్రేడవుతోంది. NSE నిఫ్టీ 18 పాయింట్లు ఎగిసి 25,015 వద్ద చలిస్తోంది. హిందాల్కో, టాటా స్టీల్, ఐచర్, JSW స్టీల్, ONGC టాప్ గెయినర్స్. సిప్లా, TCS, ASIAN PAINTS, ICICI బ్యాంక్, ITC టాప్ లూజర్స్.

ఇది కన్నతండ్రి(సాయిచంద్), పెంచిన తండ్రి(సాయాజీ షిండే), ఓ కొడుకు(సుధీర్‌బాబు) మధ్య ముక్కోణపు ఎమోషనల్ కథ. డైరెక్టర్ అభిలాష్ కొత్త తరహా కథాంశాన్ని ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారు. పెంచిన తండ్రి అప్పు తీర్చేందుకు హీరో కష్టాలు, కొడుకు ప్రేమకై తపించే కన్నతండ్రి యాంగిల్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సన్నివేశాలు బాగున్నా పాత్రల మధ్య కొరవడిన భావోద్వేగాలు, స్లో నరేషన్, చివరి 20 నిమిషాలు మైనస్.
రేటింగ్: 2.5/5

AP: ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఉ.9 నుంచి సా.4 వరకు టైమింగ్స్ ఉండగా, ఈ నెల 16 నుంచి సా.5 వరకు సమయాన్ని పొడిగించింది. గత ఏడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించకపోవడంతో సా.4-5 గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్ల ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు.

శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రితీశ్ రాణా దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెల 13న విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. కాలభైరవ సంగీతం అందించగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిశోర్, సునీల్, రోహిణి, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు.

తెలంగాణ నుంచి ఏపీకి 15వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు రానున్నాయి. ప్రస్తుత ఏపీ అవసరాల దృష్ట్యా మంత్రి అచ్చెన్నాయుడి విజ్ఞప్తితో కిలో రూ.90 చొప్పున అమ్మేందుకు TG మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, హమాలీ సహా అన్ని ఖర్చులు కలిపి రూ.86 చొప్పున గిట్టుబాటు అవుతుండగా, ఏపీకి ఎగుమతి చేయడంతో కిలో రూ.4 లాభం తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌కు లభించనుంది.

AP: దసరా కానుకగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ DAలు, PRC, IR ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నా దసరా కానుకగా IR ప్రకటించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది. నూతన వేతన సవరణ కోసం కమిటీకి వెంటనే ఛైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. గత ప్రభుత్వం వేసిన కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు పేర్కొంది.

Internet Archive వెబ్‌సైట్‌పై ప్రో పాలస్తీనా హ్యాకర్లు దాడిచేశారు. 3.1 కోట్ల మంది పర్సనల్ డేటా, ఈ-మెయిల్ అడ్రస్‌లు, స్క్రీన్ నేమ్స్, ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్స్‌ను చోరీచేశారు. అక్టోబర్ 9న జావాస్క్రిప్ట్ లైబ్రరీ ఆధారంగా హ్యాకర్లు డేటాబ్రీచ్‌కు పాల్పడ్డారు. వారి నుంచి 6.4GB డేటాబేస్ అందినట్టు Have I Been Pwned? ఫౌండర్ ట్రాయ్ హంట్ తెలిపారు. తామే హ్యాకింగ్ అటాక్స్ చేశామని SN_BlackMeta తెలిపింది.

AP: రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఇవాళ మహిషాసురమర్దనిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో సింహ వాహనంపై కొలువుదీరారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని, ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.
Sorry, no posts matched your criteria.