News October 11, 2024

Stock Market: ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు

image

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఫలితాల సీజన్ ఆరంభమవ్వడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రస్తుతం BSE సెన్సెక్స్ 23 పాయింట్లు పెరిగి 81,637 వద్ద ట్రేడవుతోంది. NSE నిఫ్టీ 18 పాయింట్లు ఎగిసి 25,015 వద్ద చలిస్తోంది. హిందాల్కో, టాటా స్టీల్, ఐచర్, JSW స్టీల్, ONGC టాప్ గెయినర్స్. సిప్లా, TCS, ASIAN PAINTS, ICICI బ్యాంక్, ITC టాప్ లూజర్స్.

Similar News

News July 8, 2025

ఛార్జీల తగ్గింపును వినియోగించుకోవాలి: RTC

image

AP: విశాఖ నుంచి BHEL, MGBS, విజయవాడ, అమలాపురం వెళ్లే బస్సు ఛార్జీలు తగ్గగా, ఇటీవల అమల్లోకి వచ్చాయి. అమరావతి, నైట్ రైడర్ సీట్, బెర్త్, ఇంద్ర బస్సుల్లో 10% ఛార్జీలు తగ్గగా, ప్రయాణికులు వినియోగించుకోవాలని RTC యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. బస్సుల ఆక్యుపెన్సీ పెంచేలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి బస్సుకు విశాఖ-BHEL ఛార్జీ రూ.1870 నుంచి రూ.1690కి, విజయవాడ ఛార్జీ రూ.1070 నుంచి రూ.970కి తగ్గింది.

News July 8, 2025

హై బడ్జెట్.. MEGA157 నాన్ థియేట్రికల్ రైట్స్‌కే రూ.100 కోట్లు?

image

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సైతం శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ మూవీ బడ్జెట్ భారీగా పెరిగినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో నాన్ థియేట్రికల్ రైట్స్‌ నుంచే రూ.100 కోట్ల వరకూ వసూలు చేయాలని, అలా చేస్తేనే గిట్టుబాటు అవుతుందని పేర్కొన్నాయి. కాగా, MEGA157 చిత్రీకరణకు రూ.180 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

News July 8, 2025

శ్రీరాముడు మా దేశంలోనే జన్మించాడు: నేపాల్ ప్రధాని

image

నేపాల్ PM కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగా శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించారని అన్నారు. శివుడు, విశ్వామిత్రుడు తమ ప్రాంతానికే చెందినవారన్నారు. ఈ విషయాన్ని చెప్పేందుకు దేశ ప్రజలు సంకోచించవద్దని పిలుపునిచ్చారు. అటు భారతదేశం ‘నకిలీ అయోధ్య’ని ప్రచారం చేస్తోందని కూడా ఆయన విమర్శించారు. కాగా మన పురాణాల ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించారని ప్రసిద్ధి.