India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పోలాండ్‌లోని క్రాకౌ నగరంలోని OFF Radio స్టేషన్ పలువురు జర్నలిస్టుల్ని ఉద్యోగాల నుంచి తొలగించి వారికి బదులు కృత్రిమ మేథ(AI) ప్రజెంటర్లను ఏర్పాటు చేసింది. మూడు ఏఐ వాయిస్‌లు పెట్టామని, ఆడియన్స్‌ను అవి ఆకట్టుకుంటాయని తెలిపింది. ఈ నిర్ణయంపై స్థానిక జర్నలిస్టులు మండిపడ్డారు. మున్ముందు ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తూ యాజమాన్యానికి వారు లేఖ రాశారు.

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌటైన ఆరో భారత ప్లేయర్‌గా ఆయన నిలిచారు. ఇప్పటివరకు హిట్‌మ్యాన్ 34 సార్లు డకౌటయ్యారు. కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఆయన ఈ ఫీట్ నెలకొల్పారు. ఈ క్రమంలో సచిన్ (34) రికార్డును సమం చేశారు. ఈ జాబితాలో జహీర్ ఖాన్ (43), ఇషాంత్ శర్మ (40), విరాట్ కోహ్లీ (38), హర్భజన్ (37), అనిల్ కుంబ్లే (35) ఉన్నారు.

విడాకుల ప్రకటన తర్వాత సింగర్‌తో రిలేషన్‌లో ఉన్నారని జరిగిన ప్రచారంపై తమిళ నటుడు జయం రవి స్పందించారు. పబ్లిక్‌లో ఉన్న సమయంలో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని, వాటన్నింటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కొందరు ప్రైవసీకి భంగం కలిగిస్తారన్నారు. అయితే అంతా ఆలోచించే తాను విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నానని జయం రవి SEPలో ప్రకటించారు.

మహిళల భద్రత, స్వయం ఉపాధి కోసం తమిళనాడు ప్రభుత్వం ‘పింక్ ఆటోరిక్షాల’ స్కీం తీసుకొచ్చింది. CNG లేదా హైబ్రిడ్ ఆటోలు కొనుగోలు చేసేందుకు 250 మంది ఒంటరి, నిరుపేద మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంది. మిగతా మొత్తం తక్కువ వడ్డీకి లోన్ రూపంలో అందిస్తుంది. అందులో జీపీఎస్ ఉండటం వల్ల డ్రైవర్లకు, ప్రయాణికులకు భద్రత ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకం తీసుకొస్తే బాగుంటుంది కదూ..!

పుష్ప-2 కు అల్లు అర్జున్ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.100 కోట్లు తీసుకున్నారని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే మూడేళ్ల కాలాన్ని ఈ సినిమాకే వెచ్చించడంతో రూ.200 కోట్లకుపైగా తీసుకుంటారని మరికొన్ని తెలిపాయి. లేదంటే సినిమా కలెక్షన్లలో 27శాతం ప్రాఫిట్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. కాగా ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు అధికమవ్వడంతో వీటి కట్టడిలో సహకరించాలని X, Meta సంస్థలను కేంద్రం కోరింది. ఈ వేదికల మీద వస్తున్న బెదిరింపు కాల్స్, సందేశాల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు అవసరమైన డేటాను తమతో పంచుకోవాలని కోరింది. దేశ ప్రజల శ్రేయస్సుతో ముడిపడిన అంశం కారణంగా 2 సంస్థలు సహకరించాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. 9 రోజుల్లో 170 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.

KKR కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెగా వేలంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ నుంచి ఆయనకు భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. కాగా అయ్యర్‌తోపాటు ఢిల్లీ, లక్నో కెప్టెన్లు రిషభ్ పంత్, KL రాహుల్ కూడా ఆక్షన్‌లోకి వస్తున్నట్లు టాక్. మరోవైపు ఈ నెల 31తో రిటెన్షన్లకు గడువు ముగియనుంది. కానీ ఇంతవరకూ ఒక్క ఫ్రాంచైజీ కూడా తమ రిటెన్షన్ల లిస్టును సమర్పించలేదు. చివరిరోజున సమర్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

బంగాళాఖాతంలోని తీవ్రతుఫాన్ ‘దానా’ పారాదీప్ (ఒడిశా)కు 100 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఏపీలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14, 1960లో జన్మించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2005లో ఢిల్లీ HCలో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తదుపరి CJIగా ఆయన 183 రోజులపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

AP: తిరుమలలోని గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని టీటీడీకి దేవదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 26న శారదా పీఠానికి అప్పటి టీటీడీ బోర్డు గోగర్భం వద్ద భూమి కేటాయించింది. ఆ భూ కేటాయింపుపై నివేదిక ఇవ్వాలని టీటీడీని కోరింది.
Sorry, no posts matched your criteria.