News October 24, 2024

తీవ్ర తుఫాన్.. అర్ధరాత్రి లేదా ఉదయం తీరం దాటే అవకాశం!

image

బంగాళాఖాతంలోని తీవ్రతుఫాన్ ‘దానా’ పారాదీప్ (ఒడిశా)కు 100 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఏపీలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

Similar News

News November 6, 2024

గ్రూప్-4 అభ్యర్థుల ‘పోస్ట్ కార్డు’ నిరసన

image

TG: గ్రూప్-4 పరీక్ష తుది ఫలితాల కోసం అభ్యర్థులు వినూత్న నిరసనకు దిగారు. పరీక్ష జరిగి దాదాపు 500 రోజులు కావస్తున్నా నియామకాలు జరగకపోవడంతో TGPSCకి భారీ సంఖ్యలో పోస్ట్ కార్డుల ద్వారా వినతిపత్రాలు పంపించారు. ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెలక్షన్ లిస్ట్ విడుదల చేసి 8 వేల మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.

News November 6, 2024

ట్రంప్ సంచలన నిర్ణయం

image

అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన కాసేపటికే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా దేశం నుంచి అక్రమ వలసదారులను పంపించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రచార ప్రతినిధి కరోలిన్ వెల్లడించారు. తక్షణమే ఈ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. కాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల మందిని వెనక్కి పంపుతామని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News November 6, 2024

అమిత్ షాతో ముగిసిన పవన్ సమావేశం

image

AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. దాదాపు 15 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా అమిత్ షాకు శ్రీవారి విగ్రహాన్ని పవన్ బహుకరించారు. ఏపీలో పరిస్థితులు, రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన ఏపీకి తిరిగి పయనమవుతారు.