India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలోనూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలంటూ రేవంత్ ప్రభుత్వం చేసిన వినతికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ఈ పథకం రైతులకు అనుకూలంగా లేదని BRS ప్రభుత్వం వ్యతిరేకించగా, కాంగ్రెస్ సర్కారు అమలు చేయడానికి సిద్ధమైంది. ఆహార ధాన్యాల పంటలకు 2%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియం చెల్లిస్తే.. ఏదైనా నష్టం వచ్చినప్పుడు పరిహారం అందనుంది.
AP: నరసాపురం MP రఘురామ కృష్ణరాజు BJP నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా నరసాపురం టికెట్‌ను శ్రీనివాస వర్మకు BJP కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇవ్వాలని TDP నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజయనగరం MP సీటు ఆలోచించగా అక్కడి నాయకులు అంగీకరించలేదట. దీంతో ప.గో జిల్లాలోని ఏదైనా అసెంబ్లీ సీట్లో ఎవరినైనా పోటీకి ఆపి రఘురామను బరిలో నిలిపే అంశంపై యోచిస్తున్నట్లు సమాచారం.
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78371 మంది భక్తులు దర్శించుకోగా 25156 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు లభించింది.
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విపరీతమైన ట్రోల్స్ రావడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. అతడిని కెప్టెన్ చేయాలన్న నిర్ణయం ఫ్రాంచైజీది అని.. ఇందుకు అతడిని ఎందుకు తిట్టడం అని ప్రశ్నిస్తున్నారు. చెన్నై కెప్టెన్సీ ధోనీ నుంచి రుతురాజ్‌కు మార్చడంలో CSK ఫ్రాంచైజీ పద్ధతిగా వ్యవహరించిందని, రోహిత్ విషయంలోనూ ముంబై అలా చేసి ఉంటే బాగుండేదంటున్నారు. అలాగే రోహిత్ పట్ల హార్దిక్ గౌరవంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రైవేటు రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ ఫ్లాష్ పే పేరుతో స్మార్ట్ కీ చైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల తరహాలోనే ఇది పనిచేస్తుంది. పిన్ ఎంటర్ చేయకుండానే రోజుకు 5 లావాదేవీలు, గరిష్ఠంగా రూ.5వేల వరకు చెల్లింపులు చేయొచ్చు. POS మెషీన్ల వద్ద రోజుకు రూ.లక్ష పేమెంట్‌కు అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ కీ చైన్ ధర రూ.499. సేవలకుగాను ఏడాదికి రూ.199 ఛార్జ్ చేస్తారు.
హర్ష డైరెక్షన్‌లో గోపీచంద్ నటించిన భీమా సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మార్చి 8న విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు.
హోలీ పండుగ వేళ అయోధ్యలోని బాల రాముడి ఫొటోలను మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫొటో వచ్చేసింది. మీ ఒక్క ఓటు కారణంగా రామ్‌లల్లా తన ఇంట్లో హోలీని ఘనంగా చేసుకుంటున్నారు. ఈ అలంకరణ, ఈ అందం ఈ ఆకర్షణీయమైన రూపం ప్రజల్లో వికసిస్తోంది. ఈ చారిత్రక బహుమతి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి థ్యాంక్స్’ అని ఆయన పేర్కొన్నారు.
‘ఇనిమేల్’ మ్యూజిక్ వీడియోతో అభిమానుల ముందుకు వచ్చిన హీరోయిన్ శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నాన్న అనే కారణంతోనే కమల్ హాసన్‌తో కలిసి పనిచేయడం లేదని శ్రుతి చెప్పారు. ఆయన కష్టపడి పనిచేస్తారని.. ఈ సాంగ్ కోసం పది రకాల లిరిక్స్ ఇచ్చారని తెలిపారు. ‘వాటిలో ఇదెలా ఉంది?.. అదెలా ఉంది? అని అడుగుతారే తప్ప.. ఇదే బాగుందని చెప్పరు’ అని పేర్కొన్నారు. అందుకే ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తానన్నారు.
AP: బీఈడీ కాలేజీల్లో స్పాట్, కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. యాజమాన్య కోటాలో మిగిలిన సీట్లను స్పాట్ కింద ఏప్రిల్ 12లోపు భర్తీ చేయాలని సూచించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు కౌన్సిలింగ్ నిర్వహించాలంది. EWS కోటా సీట్లను స్థానికులతోనే భర్తీ చేయాలని స్పష్టం చేసింది.
వెబ్‌సైట్: <
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన 2,253 పోస్టులకు దరఖాస్తు చేసేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ 1930, పర్సనల్ అసిస్టెంట్ 323 పోస్టులున్నాయి. బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయోపరిమితి, జీతభత్యాలు, పరీక్షా విధానం, ఇతర వివరాలకు https://upsc.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
Sorry, no posts matched your criteria.