News March 25, 2024

కవితకు బెయిల్ రాకపోతే తీహార్‌ జైలుకే?

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన MLC కవిత ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది. ఉదయం 11 గంటలకు ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే కవితకు రేపు కూడా బెయిల్ రాకపోతే ఆమెను తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కవిత లాయర్లు ఎలాగైనా బెయిల్ వచ్చేలా చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ కవిత భర్త అనిల్, లాయర్ మోహిత్ ఆమెను కలిశారు.

News March 25, 2024

మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్‌లు

image

TG: సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ట్యాపింగ్ హార్డ్ డిస్క్‌లను మూసీలో పడేసినట్లు నిందితుడు ప్రణీత్ రావు విచారణలో వెల్లడించారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. నాగోలు మూసీ వంతెన కింద వాటిని స్వాధీనం చేసుకుని FSLకు పంపించారు. ఈ కేసులో పోలీసులు ఏ-1గా ప్రణీత్ రావు, ఏ-2గా భుజంగరావు, ఏ-3గా తిరుపతన్నను చేర్చారు. ఇప్పటికే వారు నేరాన్ని అంగీకరించారు.

News March 25, 2024

మనవడితో CM రేవంత్ హోలీ (PHOTOS)

image

TG: సీఎం రేవంత్‌రెడ్డి తన మనవడితో హోలీ ఆడారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసంలో మనువడు రియాన్స్‌కు సీఎం రంగులు పూస్తూ సరదాగా గడిపారు. వారితో పాటు సీఎం రేవంత్ సతీమణి గీతారెడ్డి కూడా సంబరాల్లో పాల్గొన్నారు.

News March 25, 2024

హార్దిక్‌కు మద్దతుగా నిలిచిన గవాస్కర్

image

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచారు. ‘హార్దిక్ చింతించకండి. ముంబై అభిమానిగా నేను మీకు మద్దతిస్తున్నా. మొదటి గేమ్‌లో ఓడిపోవడం ముంబై ఇండియన్స్‌కు అలవాటే. నిన్న కూడా అదే రిపీటైంది. ఇది కేవలం మొదటి గేమ్ మాత్రమే. మీరు కమ్‌బ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నా’ అని తెలిపారు.

News March 25, 2024

ఐపీఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్

image

ఐపీఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. తొలి విడతలో ఏప్రిల్ 7 వరకు షెడ్యూల్ విడుదల కాగా.. తాజాగా మిగతా షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. ఏప్రిల్ 8 నుంచి మే 19 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 21న క్వాలిఫయర్ 1, మే 22న ఎలిమినేటర్, మే 24న క్వాలిఫయర్ 2, మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి

News March 25, 2024

ముస్లింలూ హోలీ చేసుకునేవారట

image

హోలీ అంటే హిందువుల పండుగ అని మనకు తెలుసు. అయితే.. ముస్లింలు కూడా హోలీ చేసుకునేవారని మీకు తెలుసా? మొఘల్ కాలంలో ముస్లిం ప్రజలు హోలీని ఈద్-ఎ-గులాబీ(పింక్ ఈద్), ఆబ్-ఇ-పాషి (రంగుల పూల వర్షం) పేరుతో చేసుకునేవారు. ఆగ్రా, ఎర్రకోట వద్ద హిందూ, ముస్లింలతో కలిసి మొఘల్ చక్రవర్తులు అక్బర్, జహంగీర్‌ హోలీ ఆడేవారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ అధికారి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కేకే.మహమ్మద్ వెల్లడించారు.

News March 25, 2024

జెర్సీపై ఆ లోగో లేకుండానే ఆడిన సీఎస్కే ప్లేయర్

image

బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. జెర్సీపై మద్యం కంపెనీ లోగోను వేసుకునేందుకు నిరాకరించారు. మతపరమైన కారణాలతో ఆయన ఈ లోగోను నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో జెర్సీపై ఆ లోగో లేకుండానే బరిలోకి దిగారు. గతంలో ఆమ్లా, మొయిన్ అలీ వంటి ప్లేయర్లు కూడా ఇలాగే బరిలోకి దిగారు.

News March 25, 2024

రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తాం: చంద్రబాబు

image

AP: టీడీపీ, జనసేన, బీజేపీల అజెండా ఒక్కటేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమన్నారు. ఈసారి 160 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో గెలవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తామని ప్రకటించారు. ముస్లింల 4శాతం రిజర్వేషన్లు కాపాడింది తమ పార్టీయేనని బాబు గుర్తు చేశారు.

News March 25, 2024

రామ్ చరణ్- సుకుమార్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

image

రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్లో రెండో మూవీ తెరకెక్కనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి DSPనే ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేస్తారని సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. రంగస్థలం‌ను మించే సినిమా రాబోతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తుండగా.. బుచ్చిబాబుతో సినిమా చేయాల్సి ఉంది.

News March 25, 2024

మా ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు: డుప్లెసిస్

image

ఐపీఎల్ 2024లో ఇవాళ పంజాబ్‌తో మ్యాచులో విజయంతో ఖాతా తెరిచేందుకు ఆర్సీబీ ఎదురు చూస్తోంది. తమ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ చేయడానికి గొప్ప ప్లేస్ అని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నారు. జట్టులోని ప్లేయర్లంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో 84 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 39 విజయాలు, 40 పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ఒక మ్యాచ్ టై కాగా, నాలుగు మ్యాచుల్లో ఫలితం రాలేదు.

error: Content is protected !!