News March 25, 2024

2019లో జనసేనకు పోలైన ఓట్లు..2/4

image

➣పెందుర్తి: 19,626(9.79%, 2009 PRP అభ్యర్థి గెలుపు)
➣ఎలమంచిలి: 19,774(11.72%, 2009 PRP 30% ఓట్లు)
➣పి.గన్నవరం: 36,259(23.91%, 2009 PRP 30.74%)
➣రాజోలు: 50,053(32.92% ఓట్లతో జనసేన గెలుపు)
➣తాడేపల్లిగూడెం: 36,197(21.58%, 3వ స్థానం, 2009 PRP గెలుపు)
➣భీమవరం: 62,285(32.88%,2వ స్థానం, 2009 PRP 26.42%)

News March 25, 2024

కాంగ్రెస్‌లో చేరనున్న మరో వైసీపీ ఎమ్మెల్యే?

image

AP: చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన.. నిన్న ఏపీసీసీ చీఫ్ షర్మిలతో HYDలో భేటీ అయ్యారు. ఇప్పటికే నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కాంగ్రెస్‌ గూటికి చేరిన విషయం తెలిసిందే.

News March 25, 2024

టీబీ వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలు

image

టీబీ నిరోధానికి తయారుచేసిన ‘ఎంటీబీవ్యాక్’ టీకా క్లినికల్ పరీక్షలను పెద్దలపై ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. మానవ మూల కణాల నుంచి అభివృద్ధి చేసిన తొలి టీబీ వ్యాక్సిన్ ఇదేనని తెలిపింది. ప్రస్తుతం శిశువులకు వేస్తోన్న BCG టీకా కంటే మెరుగ్గా పనిచేస్తుందని, పెద్దల్లో టీబీని నిరోధిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ప్రపంచంలో 28 శాతం టీబీ కేసులు మన దేశంలోనే నమోదవుతున్నాయి.

News March 25, 2024

ఆరు భాషలు మాట్లాడే టీచర్‌కు బీజేపీ ఎంపీ టికెట్

image

కేరళలోని కాసరగోడ్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ML అశ్విని(38) పోటీ చేయనున్నారు. టీచర్ ఉద్యోగాన్ని వదిలి బీజేపీలో చేరిన ఆమె దాదాపు 10 రాష్ట్రాల్లో మహిళా మోర్చా కార్యకలాపాల బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఆమె మలయాళంతో పాటు కన్నడ, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్ భాషలు మాట్లాడగలరు. ఓటర్లతో ఆమె మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రతిభ ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది.

News March 25, 2024

2019లో జనసేనకు పోలైన ఓట్లు.. 3/4

image

➬నరసాపురం: 49,120 ఓట్లు (35.97% ఓటు షేర్, 2వ స్థానం, 2009లో ప్రజారాజ్యం 35.58%)
➬ఉంగుటూరు: 10,721(6.17%, 3వ స్థానం, 2009 PRP 28.73%)
➬పోలవరం: 13,378(6.27%, 3వ స్థానం, 2009 PRP 25.22%)
➬తిరుపతి: 12,315(8.3%, 3వ స్థానం, 2009 PRP గెలుపు)
➬రైల్వేకోడూరు: 9,964(7.29%, 3వ స్థానం, 2009 PRP 18.80%)

News March 25, 2024

2019లో జనసేనకు పోలైన ఓట్లు.. 4/4

image

➤అవనిగడ్డ: 28,556 ఓట్లు(15.49% ఓటు షేర్, 3వ స్థానం, 2009 PRP 23.46%)
➤నెల్లిమర్ల: 7,633(4.3%, 3వ స్థానం.. 2009 PRP 30.62శాతం)
➤విశాఖ దక్షిణ: 18,119(14.41%, 3వ స్థానం, 2009 PRP 35.40%)

News March 25, 2024

ఈ రాష్ట్రాల్లోనే రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఎక్కువ!

image

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ICMR అధ్యయనంలో వెల్లడైంది. వచ్చే ఏడాది దీని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని పరిశోధకులు తెలిపారు. పట్టణాల్లో ఉండే మహిళలతో పోలిస్తే గ్రామాల్లో ఉండేవారికి ఈ ముప్పు తక్కువని తెలిపారు. ఊబకాయం, లేటు వయసులో వివాహాలు, ఆలస్యంగా పిల్లల్ని కనడం, పిల్లలకి సరిపడా పాలు ఇవ్వకపోవడం వంటివి క్యాన్సర్ ఉద్ధృతికి కారణాలని పేర్కొన్నారు.

News March 25, 2024

కొత్త నిబంధనలను తీసుకొచ్చిన IRDAI

image

ఇన్సూరెన్స్ పాలసీల్లో సరెండర్ వాల్యూకు సంబంధించి IRDAI కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం మూడేళ్లలోపు పాలసీలను సరెండర్ చేస్తే వాటి విలువ యథాతథంగా లేదా తక్కువగా ఉంటుంది. 4-7 ఏళ్లలోపు సరెండర్ చేస్తే స్వల్పంగా పెరుగుతుంది. మెచ్యూరిటీ డేట్ కంటే ముందే పాలసీని ముగిస్తే కంపెనీలు పాలసీదారుడికి చెల్లించే మొత్తాన్ని సరెండర్ వాల్యూగా పరిగణిస్తారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

News March 25, 2024

ఎంపీగా మాజీ సీఎం

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రానున్నారు. బీజేపీలో ఉన్న ఆయనకు రాజంపేట ఎంపీ టికెట్ వచ్చింది. చాలా రోజుల క్రితమే ఆయన కమలం పార్టీలో చేరినప్పటికీ క్షేత్రస్థాయిలో రాజకీయం చేయలేదు. మరి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా మాజీ సీఎం ఎంపీగా గెలుస్తారో లేదో చూడాలి.

News March 25, 2024

‘శివ శక్తి’ పేరుకు ఆమోదం

image

జాబిల్లిపై చంద్రయాన్-3 విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రదేశానికి ప్రధాని మోదీ ప్రకటించిన ‘శివ శక్తి’ పేరును అంతర్జాతీయ ఖగోళ సంఘం ఆమోదించింది. గతేడాది ఆగస్టు 23న ప్రధాని ఆ పేరును ప్రకటించగా దాదాపు 7 నెలల తర్వాత ఆమోదం లభించింది. ప్రకృతి పురుషుడు (శివుడు), స్త్రీ (శక్తి) అర్థాలను వర్ణించే భారతీయ పురాణాల నుంచి సేకరించిన పదమే ‘శివ శక్తి’ అని గెజిటరీ ఆఫ్‌ ప్లానెటరీ నోమెన్‌క్లేచర్‌ వివరించింది.

error: Content is protected !!