India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యూపీలోని మీరట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలిపోయింది. మంటలు చెలరేగి మంచానికి అంటుకోవడంతో నలుగురు చిన్నారులు సారిక(12), నిహారిక(8), గోలు(6), కల్లు(5) తీవ్ర గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తండ్రి జానీ(39) పరిస్థితి విషమంగా ఉండగా, తల్లి బబిత(35)కు 60 శాతం గాయాలయ్యాయి. ఆమెను ఢిల్లీ AIIMSకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌లో ప్లేయర్‌గా మాత్రమే ఆడనున్నారు. IPLలో కెప్టెన్‌గా కాకుండా ప్లేయర్‌గా అతను ఆడటం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి. 2013లో MI కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న హిట్‌మ్యాన్ 5 ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించారు. ఇప్పుడు హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో ఆడనున్నారు. ఈసారి ఈ పుల్‌షాట్ మాస్టర్ బ్యాట్‌తో ఎలా చెలరేగుతారో చూడాలి.
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల్ని ఇవాళ బీజేపీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి, సోము వీర్రాజు ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరిపారు. ఎచ్చెర్ల, విజయవాడ వెస్ట్, బద్వేల్, పాడేరు, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్ నార్త్, ఆదోని లేదా అనంతపురంలో పోటీ చేయాలని నిర్ణయించగా.. అభ్యర్థుల్ని సైతం ప్రకటించనున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా మహిళా ఆల్ రౌండర్ సోఫీ మొలినెక్స్ అద్భుత ప్రదర్శన చేశారు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ఆమె 10 ఓవర్ల బౌలింగ్ చేసి కేవలం 10 పరుగులే ఇచ్చారు. అందులో 5 మెయిడిన్ ఓవర్లు ఉండగా 3 వికెట్లు తీశారు. మొత్తం 60 బంతులు వేయగా.. అందులో 53 డాట్ బాల్స్ ఉండటం విశేషం. ఇక ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి హడలెత్తించడంతో బంగ్లా 97 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా 23.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదాన్‌లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు ఇండియా కూటమి వెల్లడించింది. ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. ‘విపక్షాలను నిర్మూలించేందుకు, నాయకులను భయపెట్టేందుకు ప్రధాని మోదీ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారు. ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, బిహార్‌లో తేజస్వీ యాదవ్‌పై కూడా తప్పుడు కేసులు పెట్టారు’ అని మండిపడ్డారు.
AP: అధికారులు మోసం చేశారంటూ YSR జిల్లాలో కుటుంబం <<12908035>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ‘YCP నేతల భూకబ్జాలకు పేదలు బలైపోతున్నారు. ప్రజల ఆస్తులను హస్తగతం చేసుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. భూదందాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
ఐపీఎల్ ఆడుతున్న పలువురు టీమ్ఇండియా యంగ్ ప్లేయర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. రింకూ సింగ్, జితేశ్ శర్మ, సాయి సుదర్శన్, రజత్ పాటీదార్‌లకు ఐపీఎల్‌లో శాలరీని పెంచింది. రూ.55 లక్షలకే గత సీజన్ ఆడిన రింకూ సింగ్ ఈ ఏడాది రూ.కోటి అందుకోనున్నారు. జితేశ్ శర్మ, సాయి సుదర్శన్, రజత్ పాటీదార్‌ల శాలరీ కూడా రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెరగనుంది. ఈ మొత్తాన్ని ఆయా ఫ్రాంచైజీలు చెల్లించనున్నాయి.
కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టుల ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయో పరిమితి, పోస్టుల వివరాల కోసం ఈ <
AP: పిఠాపురంలో సీఎం జగన్ వచ్చి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ మెజార్టీ లక్షకు మెజార్టీ తగ్గదని జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ‘ఇప్పటికే పవన్‌ను ఓడించడానికి ముగ్గురు సీనియర్ నేతలను దింపారు. మూడు వేల మందిని పంపినా సరే పవన్‌ను ఓడించలేరు. మేం చేస్కోవాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చారు.
AP: సోషల్ మీడియా ద్వారా వైసీపీ ఇతర పార్టీల నేతలను వేధిస్తోందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. విపక్ష నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ అంశంపై విచారణ తప్పదని హెచ్చరించారు. ఏడాది కిందటే తాను ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని బయటపెట్టానని గుర్తు చేశారు.
Sorry, no posts matched your criteria.