News March 24, 2024
గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌లో ప్లేయర్‌గా మాత్రమే ఆడనున్నారు. IPLలో కెప్టెన్‌గా కాకుండా ప్లేయర్‌గా అతను ఆడటం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి. 2013లో MI కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న హిట్‌మ్యాన్ 5 ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించారు. ఇప్పుడు హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో ఆడనున్నారు. ఈసారి ఈ పుల్‌షాట్ మాస్టర్ బ్యాట్‌తో ఎలా చెలరేగుతారో చూడాలి.
Similar News
News December 11, 2025
కందుల దుర్గేశ్‌కు 7వ ర్యాంకు

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాలనలో జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. ఫైళ్ల పరిష్కారంలో రాష్ట్రంలోనే 7వ ర్యాంకు సాధించి సీఎం ప్రశంసలు పొందారు. జనసేన కోటాలో మంత్రి అయిన దుర్గేశ్.. 316 ఫైళ్లను కేవలం 3 రోజుల 9 గంటల 21 నిమిషాల సమయంలోనే క్లియర్ చేసి సత్తా చాటారు. కాగా ఫైళ్ల పరిష్కారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ 11వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
News December 11, 2025
నేడు కాంగ్రెస్ పెద్దలతో సీఎం భేటీ

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. 11AMకు పార్లమెంట్‌కు వెళ్లి రాహుల్, KC వేణుగోపాల్, ప్రియాంకా గాంధీని కలవనున్నారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్ వివరాలను వారితో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా చర్చించే అవకాశముంది. బుధవారం రాత్రికే ఢిల్లీ చేరుకున్న ఆయన NCP అధినేత శరద్ పవార్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
News December 11, 2025
పెరిగిన చలి.. కోళ్ల సంరక్షణలో జాగ్రత్తలు(2/2)

కోళ్లకు తాజా నీరు, దాణా మాత్రమే అందించాలి. కోళ్ల దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. దాణా బస్తాలను గోడలకు తగలకుండా చూడాలి. తేమ ఉన్న దాణా నిల్వ చేయకూడదు. బాగా ఎండిన దాణాను మాత్రమే నిల్వ ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనల మేరకే తగిన మోతాదులో ఆక్సిటెట్రాసైక్లిన్, సల్ఫాడిమిడిన్ వంటి యాంటీ బయాటిక్స్, ఇతర శానిటైజర్లు, విటమిన్‌లు, దాణా నీరు ఇవ్వాలి. కోళ్లకు అవసరమైన టీకాలు వేయించాలి.


