News March 24, 2024

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం సులభమేనా?

image

ఢిల్లీ CM కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జైలులో ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో సీఎం నేరుగా పాల్గొనడం సాధ్యం కాదని అంటున్నారు. ప్రభుత్వ పనితీరును సమీక్షించడం, ఫైళ్లను తనిఖీ చేయడం సులభం కాదని, ఆయనను కలవాల్సినప్పుడల్లా కోర్టు అనుమతి ఉండాలని చెబుతున్నారు. పాలకుడు ప్రజల్లోనే ఉండాలని, కేజ్రీవాల్ మరొకరిని సీఎంగా నామినేట్ చేయాలని సూచిస్తున్నారు.

News March 24, 2024

రూ.కోట్లు కుమ్మరిస్తే.. ఆటలో తేలిపోయారు

image

IPL వేలంలో అత్యధిక <<12908684>>రేటు<<>> పలికిన ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్(KKR), పాట్‌ కమిన్స్‌(SRH) తొలి మ్యాచ్‌లో విఫలమయ్యారు. స్టార్క్ 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 53 రన్స్, కమిన్స్ 4 ఓవర్లలో ఒక వికెట్ తీసి 32 పరుగులు ఇచ్చుకున్నారు. బ్యాటింగ్‌లో చివరి బంతికి 5 రన్స్ చేయాల్సినప్పుడు కమిన్స్ షాట్ ఆడలేకపోయారు. IPLలో రూ.కోట్ల వీరులు తేలిపోతారనే ఆనవాయితీని వీరు కొనసాగించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News March 24, 2024

విద్యార్థులకు శుభవార్త

image

AP: పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్థిరత్వం, ఉపాధి సాఫల్యత, వ్యవస్థాపక రంగాల్లో వారిని బలోపేతం చేయడమే లక్ష్యంగా స్కిల్స్ ప్రోగ్రాం నిర్వహించనుంది. ‘పాలిటెక్నిక్ రెండో, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, ధ్రువీకరణ పత్రం అందిస్తాం. విశాఖ జిల్లాలోని కాలేజీల్లో అమలు చేశాక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం’ అని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది.

News March 24, 2024

రాష్ట్రపతిపై కోర్టుకెక్కిన కేరళ!

image

ఏకంగా రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్‌లపైనే కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దావా వేసింది. తాము ఆమోదించిన నాలుగు బిల్లులపై కావాలనే జాప్యం చేస్తున్నారని అందులో ఆరోపించింది. మొత్తంగా ఏడు బిల్లుల్ని తమ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపారని పేర్కొంది. ఆయన చర్య రాజ్యాంగ నైతికతను ఉల్లంఘించడమేనని, దాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది.

News March 24, 2024

ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

image

ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన ‘ఓపెన్ హైమర్’ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల జియో సినిమాలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే స్ట్రీమింగ్ అవ్వగా.. తాజాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. జియో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు సినిమాను ఉచితంగా చూడవచ్చు. అణు బాంబు సృష్టికర్త ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఏడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

News March 24, 2024

‘వెంకీ-అనిల్’ సినిమా మేలో ప్రారంభం?

image

F2, F3 చిత్రాల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్ మరో సినిమా చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్ మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. హీరోయిన్‌గా త్రిష, మృణాల్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని, వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుందని టాక్.

News March 24, 2024

బార్లీ నీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

image

బార్లీ నీళ్లు తాగితే మలబద్దకం, గ్యాస్, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్లాస్ బార్లీ నీళ్లలో ఉప్పు, చక్కర కలుపుకుని తాగితే శరీరంలో నీటి నిల్వలు కోల్పోకుండా ఉంటాయని, వడదెబ్బ తగలదని తెలిపారు. బార్లీలోని పీచు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువును తగ్గిస్తుందని పేర్కొన్నారు. మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు, గర్భిణుల్లో కాళ్ల వాపు సమస్యలను ఇది దూరం చేస్తుందని అంటున్నారు.

News March 24, 2024

ఏపీ పీజీఈసెట్ షెడ్యూల్ విడుదల

image

AP: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఏప్రిల్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాల కోసం <>https://cets.apsche.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.

News March 24, 2024

రేపటి నుంచి తిరుపతమ్మ చిన తిరునాళ్లు

image

AP: NTR(D) పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో చిన తిరునాళ్లు రేపటి నుంచి నిర్వహించనున్నారు. 29వ తేదీ వరకు జరిగే ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. రేపు ఉదయం 6 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో తిరునాళ్లు ప్రారంభం కానుండగా.. 26న రథోత్సవం, తిరుపతమ్మ, గోపయ్య స్వాములను గ్రామంలో ఊరేగిస్తారు. 27న దివ్యప్రభోత్సవం, 28న పసుపు కుంకుమ బండ్ల ఉత్సవం, 29న బోనాల సమర్పణతో తిరునాళ్లు ముగుస్తాయి.

News March 24, 2024

8,180 ఉద్యోగాలు.. BIG UPDATE

image

TG: 8,180 గ్రూప్-4 భర్తీలో రోస్టర్ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త రోస్టర్ విధానం, మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాలను TSPSC వెబ్‌సైటులో పొందుపరిచారు. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని ఉపసంహరించారు. ఏ జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు దక్కుతాయి? వంటి వివరాలను విడుదల చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

error: Content is protected !!