News March 23, 2024

కవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఆమె కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో కోర్టులో హాజరుపర్చిన అధికారులు.. మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని జడ్జిని కోరారు. దీంతో జడ్జి నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

News March 23, 2024

ఈసారి పోలింగ్ 75% దాటుతుందా?

image

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో 67.40%తో ఆల్ టైమ్ హై నమోదైంది. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం 75% దాటాలని రాజకీయ వర్గాలు ఆశిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ మినహా ఇతర ప్రాంతాల్లో 2014తో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. J&Kలో 2014లో 49.72% నమోదు కాగా 2019లో అది 29.39%కు పరిమితమైంది. కాగా 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంతో తెలుసా? 45.67శాతం.

News March 23, 2024

బీజేపీకి వెన్నుపోటు పొడిచిన సీఎం రమేశ్: YCP

image

AP: చంద్రబాబు శిష్యుడు సీఎం రమేశ్ బీజేపీకి వెన్నుపోటు పొడిచాడంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ‘టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికై ఆ తర్వాత బాబు సలహాతో సీఎం రమేశ్ బీజేపీలోకి వెళ్లారు. గతేడాది కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీ పేరుతో రూ.30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనిచ్చారు. బాబు సలహా మేరకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ఆర్థిక సాయం చేశారు’ అంటూ బాండ్ల వివరాలను జత చేసింది.

News March 23, 2024

‘రివ్యూస్ రాస్తే డబ్బులు’.. ఇలాంటి ప్రకటనలు నమ్మకండి

image

TG: సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. రివ్యూస్ రాసే పార్ట్‌‌టైమ్ జాబ్ అంటూ హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని నిలువునా ముంచేశారు. ఆన్‌లైన్‌లో బాధితుడికి పరిచయమైన మోసగాళ్లు.. హోటల్స్‌ను ప్రమోట్ చేయడంలో భాగంగా రివ్యూస్ రాస్తే డబ్బు ఇస్తామన్నారు. తొలుత పనికి తగ్గ డబ్బులు ఇస్తూ వచ్చారు. ఆపై మరింత పెట్టుబడి పెడితే లాభాలొస్తాయని బాధితుడిని నమ్మించి రూ.13,57,288 దోచేశారు.

News March 23, 2024

‘కాస్త రుతురాజ్‌ను కూడా చూపించు’.. కెమెరామెన్‌కు వీరూ సెటైర్

image

ఐపీఎల్‌లో సీఎస్‌కే మ్యాచ్ అనగానే ధోనీపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ సీజన్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే కెమెరామెన్‌ కూడా ధోనీనే ఎక్కువ చూపిస్తుంటారు. అయితే నిన్నటి మ్యాచ్‌లో ఈ మోతాదు ఎక్కువైందని అనిపించింది కాబోలు.. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో సెటైర్ వేశారు. ధోనీతో పాటు రుతురాజ్‌ను కూడా చూపించాలని, అతను చెన్నై కెప్టెన్ అని గుర్తుచేశారు.

News March 23, 2024

నాకు హైబీపీ ఉంది: కవిత

image

ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. తన మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వడంలేదని కవిత పిటిషన్ వేశారు. తనకు హైబీపీ ఉందని, రిపోర్ట్స్ అడిగితే ఇవ్వడంలేదని తెలిపారు. మరోవైపు కాసేపట్లో కవితను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది. ఆమె కస్టడీ నేటితో ముగిసింది. మరో 3 రోజుల కస్టడీని కోరే అవకాశం ఉంది.

News March 23, 2024

డైరెక్షన్ చేయాలని ఉంది: సాయి పల్లవి

image

తనకు డైరెక్షన్ చేయాలనే కోరిక ఉందంటూ హీరోయిన్ సాయిపల్లవి తన మనసులోని మాటను బయటపెట్టారు. తన అభిరుచికి తగ్గట్లు కథను రెడీ చేస్తోందట. అయితే అది ప్రస్తుతం ఆలోచన మాత్రమేనని.. సినిమాకు నిర్మాతలెవరో తెలియదని, తెలిశాక అందరికీ చెబుతానని పేర్కొంది. కాగా ప్రస్తుతం తండేల్ సినిమాలో సాయిపల్లవి నటిస్తోంది. ఆ తర్వాత అమిర్‌ఖాన్ కుమారుడు హీరోగా రూపొందుతున్న సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

News March 23, 2024

ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్‌షాప్ ప్రారంభం

image

AP: వచ్చే 50 రోజుల ఎన్నికల ప్రణాళికపై టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేసేందుకు చంద్రబాబు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన నేతలు కూడా హాజరయ్యారు. ఎన్నికల నియమావళి, పోల్ మేనేజ్‌మెంట్, అభ్యర్థులకు ఉండే హక్కులు, ప్రచారం, నామినేషన్ల దాఖలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు సూచనలు చేస్తారు.

News March 23, 2024

బాంబు పేలుడు కేసులో నిందితుడి గుర్తింపు

image

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు ముస్సావిర్ షాజిబ్‌గా తేల్చారు. అతడు కర్ణాటకలోని శివమొగ్గకు చెందినవాడని తెలిపారు. పేలుడు అనంతరం చెన్నైలో స్నేహితుడితో కలిసి ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు. స్నేహితుడు కూడా తమిళనాడులోని ఓ హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ ముద్దాయని తెలిపారు. మార్చి 1న బాంబు పేలుడు జరగ్గా ఈ కేసును NIA దర్యాప్తు చేస్తోంది.

News March 23, 2024

APPLY NOW: 2,253 ప్రభుత్వ ఉద్యోగాలు

image

ESICలో 2,253 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 27తో ముగియనుంది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ 1930, పర్సనల్ అసిస్టెంట్ 323 ఉద్యోగాలున్నాయి. బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <>https://upsc.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు.

error: Content is protected !!