News November 24, 2024

పాక్‌‌కు షాక్.. తొలి వన్డేలో జింబాబ్వే గెలుపు

image

జింబాబ్వే టూర్‌ వెళ్లిన పాక్‌కు షాక్ తగిలింది. తొలి వన్డేలో 80పరుగుల తేడాతో ఓడింది. జింబాబ్వే తొలుత 40.2 ఓవర్లకు 205 రన్స్ చేసి ఆలౌటైంది. పాకిస్థాన్ 21 ఓవర్లకు 60/6 వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ నిలిపేశారు. ఆపై వాతావరణం ఆటకు అనుకూలించలేదు. 21 ఓవర్ల వద్ద జింబాబ్వే 125/7 స్థితిలో ఉండటంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం గెలుపును నిర్ణయించారు. 39రన్స్ చేసి 2వికెట్లు తీసిన సికందర్ రజా POMగా నిలిచారు.

Similar News

News December 2, 2024

లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా

image

పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్, ఛైర్మన్ సముదాయించినా విపక్ష ఎంపీలు వినలేదు. అదానీ అంశంపై చర్చకు కేంద్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలను స్పీకర్, ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు.

News December 2, 2024

హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో కీర్తి సురేశ్ పెళ్లి!

image

టాలీవుడ్ ‘మహానటి’ కీర్తి సురేశ్ & ఆంటోనీల వివాహం గోవాలో ఈనెల 12న జరగనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు వివాహం జరగనుండగా, 10న ప్రీవెడ్డింగ్, 11న సంగీత్ నిర్వహించనున్నారు. 12న ఉదయం కీర్తి మెడలో ఆంటోనీ తాళి కట్టనుండగా అదేరోజు సాయంత్రం స్థానిక చర్చిలో మరోసారి వెడ్డింగ్ జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నారు.

News December 2, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అనిత

image

AP: ‘ఫెంగల్’ తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణముఖి నది సహా నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకల పరిసరాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. తిరుపతి, తిరుమలలో కొండచరియలు జారిపడుతున్న నేపథ్యంలో భక్తులు, ప్రజల రాకపోకలు, భద్రతపై దృష్టి పెట్టాలని చెప్పారు.