India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రం మాదక ద్రవ్యాలకు అడ్డాగా నిలిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు రాష్ట్రంలోనే ఉంటున్నాయి. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరకడం సిగ్గు చేటు. వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధానికి మార్చింది. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఆపరేషన్ గరుడ నిర్వహించి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
* ప్రతిపక్షాలను BJP బలహీనపర్చాలని చూస్తోంది – ఖర్గే
* అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కాలరాస్తోంది – సీఎం స్టాలిన్
* ఎన్నికలకు భయపడేవారే ఇలాంటి అరెస్టులకు పాల్పడతారు – కేరళ సీఎం
* దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ ప్రతిపక్షాలపై దాడులు – శరద్ పవార్
* మోదీ ప్రజలకు భయపడుతున్నారు – సీతారాం ఏచూరి
* బీజేపీ భయపడుతోంది – శివసేన(UBT)
సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ చెప్పిన జ్యోతిషం నిజమైంది. ‘మార్చి 2024 నుంచి కేజ్రీవాల్‌కు బ్యాడ్ టైమ్ మొదలవుతుంది. తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. అరెస్ట్ అవుతారు. తర్వాత ఢిల్లీ సీఎం ఎవరో కూడా నాకు తెలుసు. తర్వాత చెబుతా. అతడి కర్మ ఫలం 2025 ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయేలా చేస్తుంది. తర్వాత నుంచి కేజ్రీవాల్ రాజకీయ పతనం మొదలవుతుంది’ అని 2022 మార్చి 25న ఆయన ట్వీట్ చేశారు.
టీమ్ఇండియా క్రికెటర్ షమీపై మాజీ భార్య హసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. ‘షమీ నన్ను హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. UP పోలీసుల సహాయంతో అతడు ఈ పథకం రచిస్తున్నాడు’ అని సంచలన కామెంట్స్ చేశారు. కాగా షమీ, జహాన్‌ను 2014లో పెళ్లి చేసుకున్నారు. 2015లో వారికి ఓ కూతురు జన్మించింది. 2018లో కట్నం సహా పలు అంశాలలో షమీ వేధిస్తున్నాడంటూ అతడిపై కేసు పెట్టారు. అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
కేజ్రీవాల్ అరెస్టుతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘ఈ భయపడే నియంత ప్రజాస్వామ్యానికి ఉనికి లేకుండా చేస్తున్నాడు. మీడియాతో సహా అన్ని సంస్థలను భయపెట్టడం, పార్టీలను చీల్చడం, కంపెనీల నుంచి డబ్బులు దండుకోవడం, ప్రధాన ప్రతిపక్షం అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడం ఈ పైశాచిక శక్తికి సరిపోలేదు. ఇప్పుడు సీఎంలను అరెస్ట్ చేయిస్తున్నాడు. దీనంతటికీ INDIA తగిన సమాధానం చెబుతుంది’ అని ట్వీట్ చేశారు.
1.బీజేపీకి రూ.584 కోట్లు
2.BRSకు రూ.212 కోట్లు
3.డీఎంకేకు రూ.85 కోట్లు
4.YSRCPకి రూ.37 కోట్లు
5.TDPకి రూ.28 కోట్లు
6.కాంగ్రెస్ పార్టీకి రూ.18 కోట్లు
7.జేడీయూకు రూ.5 కోట్లు
8.జనసేనకు రూ.4 కోట్లు
1.మేఘా ఇంజినీరింగ్ (MEIL): రూ.584 కోట్లు
2.క్విక్ సప్లై: రూ.375 కోట్లు
3.వేదాంత లిమిటెడ్: రూ.226 కోట్లు
4.భారతీ ఎయిర్‌టెల్: రూ.197 కోట్లు
**కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా వేదాంత లిమిటెడ్ రూ.125 కోట్లు ఇచ్చింది.
SOURCE: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైట్‌లోని ఎలక్టోరల్ బాండ్లు
ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ CM మనీశ్ సిసోడియా, ఆప్ MP సంజయ్ సింగ్, BRS MLC కవిత, మాగుంట రాఘవ, విజయ్ నాయర్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, గౌతమ్ మల్హోత్రా, రాజేశ్ జోషి, అమన్ దీప్, అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేసింది.
AP: ఎక్కడేం జరిగినా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టి ఏపీ ప్రతిష్ఠపై బురదజల్లడమే చంద్రబాబు పని అని YCP విమర్శించింది. ‘విశాఖలో దొరికిన డ్రగ్స్ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ సంస్థకు చెందినది. దాని ఎండీ కూనం వీరభద్రరావు కాగా డైరెక్టర్ కూనం కోటయ్య చౌదరిగా గుర్తించారు. ఇప్పుడు చెప్పు చంద్రబాబూ.. వీళ్లు మీ పార్టీకి చెందినవారు కాదా? వీళ్లు ఎవరికి బంధువులు? నీకా నీ కొడుక్కా?’ అని వైసీపీ ట్వీట్ చేసింది.
ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏటా భారీగా పెరుగుతుండటంపై UN ఆందోళన వ్యక్తం చేసింది. 2022లో 62 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అయిందని.. ఇది 6వేల ఐఫిల్ టవర్స్‌తో సమానమని పేర్కొంది. ఏటా ఈ-వేస్ట్ 2.6 మిలియన్ టన్నుల చొప్పున పెరుగుతోందని 2030 నాటికి ఆ మొత్తం 82 మిలియన్ టన్నులకు చేరుతుందని హెచ్చరించింది. ఈ వ్యర్థాలు ఎక్కువగా ఈ-సిగరెట్స్, గృహోపకరణాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపింది.
Sorry, no posts matched your criteria.