India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

☛ గ్రూప్-1 మెయిన్స్ యథాతథం: సీఎం రేవంత్
☛ గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా బండి సంజయ్ ర్యాలీ
☛ అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం
☛ జనసేనలో చేరిన ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి
☛ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయి: YS జగన్
☛ INDvsNZ: సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్
☛ వయనాడ్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్

టెస్టు మ్యాచ్‌లో నాలుగోరోజు రిషభ్ పంత్ 99 పరుగులకు ఔటైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఓ నెటిజన్ ముందుగానే పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంత ముందుగా, కచ్చితత్వంతో అతడెలా చెప్పాడన్నది మిస్టరీగా మారింది. నువ్వు మ్యాచ్ ఫిక్సర్‌వా అంటూ కొంతమంది, నా జాతకం చెప్పు బాస్ అంటూ మరికొంతమంది అతడి ట్వీట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం నీవల్లే రిషభ్ ఔటయ్యారంటూ మండిపడుతున్నారు.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రేపు కర్వా చౌత్ వేడుక జరుపుకోనున్నారు. గత ఏడాది ఈ పండుగకు రూ.15వేల కోట్ల మేర వ్యాపారం జరగగా, ఈసారి అది రూ.22 వేల కోట్లకు పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేశారు. ఢిల్లీలోనే రూ.4వేల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఎర్రగాజులు, సంప్రదాయ దుస్తులు, పూజాసామగ్రి, లాకెట్లు, మెట్టెలు, ఆభరణాల వంటివాటికి డిమాండ్ నెలకొందని వివరించారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి పోలీస్ డ్యూటీ మీట్‌కు హాజరుకావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడే ఖాకీ సైనికులు, పెట్టుబడుల సాధనకు భరోసా కల్పించే శాంతిభద్రతకు ప్రతినిధులు, దేశానికే గర్వకారణం తెలంగాణ పోలీసులు’ అంటూ ఓ ట్వీట్‌లో కొనియాడారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన అన్న హాష్ ట్యాగ్‌లను దానికి జోడించారు.

TG: పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘ఇందుకోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూలు నిర్మిస్తాం. వచ్చే ఏడాది 1-5 క్లాసులతో దీనిని ప్రారంభిస్తాం. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ డిగ్రీ వరకు విద్య అందిస్తాం’ అని HYDలో పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు.

TG: గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై రాష్ట్ర మంత్రులు చర్చిస్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు, జీవో 29 తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రేపు కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో గట్టెక్కడం భారత్‌కు దాదాపు అసాధ్యమే. కివీస్ విజయలక్ష్యం కేవలం 107 పరుగులు మాత్రమే. ఈ నేపథ్యంలో వరుణుడు ఎంటర్ అయితేనే టీమ్ ఇండియా కనీసం డ్రాతో బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఆక్యువెదర్ అంచనాల ప్రకారం రేపు 30 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడుతుంది. మరి 107 రన్స్‌ను NZ ఛేజ్ చేస్తుందా లేక టీమ్ ఇండియా బౌలింగ్‌తో ఏమైనా అద్భుతం సృష్టించగలదా అన్నది చూడాలి మరి.

AP: YSR జిల్లా బద్వేల్ <<14399353>>ఘటనలో <<>>పోలీసులు పురోగతి సాధించారు. ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేశ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విఘ్నేశ్ కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో తన కూతురిని వేధిస్తున్నాడని బాధితురాలి పేరెంట్స్ తెలిపారు.

వ్యవసాయం గురించి పూర్తిగా తెలియని వయసులోనూ విత్తనాలను భద్రపరుస్తున్నారు 8వ తరగతి చదివే హర్షిత ప్రియదర్శిని. ఒడిశాలోని కోరపట్‌లో నివసించే ఈ ‘సీడ్ గర్ల్’.. 2023లో సీడ్ బ్యాంక్‌ను స్టార్ట్ చేశారు. ఇందులో 180 రకాల వరి, 80 రకాల మిల్లెట్స్‌ను భద్రపరిచారు. ప్రతి రకాన్ని 250gms లేదా 100gms సేకరిస్తూ రైతులకు ఉచితంగా సీడ్స్ ఇస్తున్నారు. పద్మశ్రీ కమలా పూజారి నుంచి ప్రేరణ పొందినట్లు హర్షిత తెలిపారు.

రైల్వేలో 8,113(గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్ వైజర్-1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్-732) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేయవచ్చు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. SCRలో 478, ECoRలో 758 పోస్టులున్నాయి. ఫీజు: రూ.500(ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్). మరిన్ని వివరాలకు <
Sorry, no posts matched your criteria.