News October 20, 2024

గుర్లలో డయేరియా తగ్గుముఖం పట్టింది: మంత్రి కొండపల్లి

image

AP: భూగర్భ జలాల కలుషితం వల్లే విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం వ్యాప్తి చెందిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం గుర్లలో అతిసారం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. 41 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. క్లోరినేషన్ పనులు చేపట్టామని, ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం తాగునీటి వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు.

News October 20, 2024

యుద్ధానికి సిద్ధం కావాలని సైన్యానికి జిన్‌పింగ్ పిలుపు

image

తైవాన్ విషయంలో బీజింగ్ దూకుడు పెంచింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ సైన్యానికి పిలుపునిచ్చారు. ఆర్మీ రాకెట్ ఫోర్స్‌ను పరిశీలించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సీసీటీవీ తెలిపింది. ‘సైనిక శిక్షణ మరింత పెరగాలి. బలగాలన్నింటికీ పోరాట, వ్యూహాత్మక సామర్థ్యం అలవడాలి’ అని జిన్‌పింగ్ పేర్కొన్నారని స్పష్టం చేసింది. తైవాన్ తమదేనంటూ చైనా చెప్పుకొంటున్న సంగతి తెలిసిందే.

News October 20, 2024

మద్యం తాగేముందు ఆ రెండు చుక్కలు ఎందుకు?

image

మద్యం తాగే ముందు రెండుమూడు చుక్కలను నేలపై చల్లడం చూస్తుంటాం. దిష్టి తలగకుండా అని, పెద్దలకోసం అని కొందరు చెబుతుంటారు. అయితే, గతంలో ఇంట్లోనే మద్యం తయారుచేసుకునేవారని, దీన్ని పరీక్షించేందుకు ఇలా చేసేవారని మరికొందరు అంటున్నారు. నేలపై లిక్కర్ చుక్కలు వేసినప్పుడు బుడగలు ఏర్పడితే స్ట్రాంగ్‌ ఉందని అర్థమని చెప్పారు. రాజులపై విష ప్రయోగం జరిగిందో లేదో తెలుసుకోడానికి గతంలో ఇలా చేసేవారని మరికొందరి మాట.

News October 20, 2024

మహిళ పొట్టలో 12 ఏళ్ల పాటు కత్తెర!

image

ఆ మహిళకు 12 ఏళ్ల క్రితం 24 గంటల నొప్పి రావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి తరచూ పొట్టలో నొప్పితో ఇబ్బంది పడుతోంది. ఇటీవల ఆ నొప్పి మరీ ఎక్కువ కావడంతో మళ్లీ అదే ఆస్పత్రిని సంప్రదించింది. ఎక్స్‌రే పరీక్షలో ఆమె పొట్టలో కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి 12 ఏళ్ల నాటి ఆ కత్తెరను తొలగించారు. ఈ ఆసక్తికర ఘటన సిక్కింలో చోటుచేసుకుంది.

News October 20, 2024

‘బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగొచ్చు’

image

బంగ్లాదేశ్‌లో 2025లో సాధారణ ఎన్నికలు జరగొచ్చని అక్కడి తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అంచనా వేశారు. ఎన్నికలు నిర్వహించడానికి ముందు చాలా అంశాలను పరిష్కరించాల్సి ఉందన్నారు. రాజకీయ సంస్కరణలు, సెర్చ్, ఎన్నికల కమిటీల ఏర్పాటు, ఓటరు జాబితా తయారీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్లతో PMగా షేక్ హసీనా తప్పుకుని దేశం వీడారు. అప్పటి నుంచి బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొంది.

News October 20, 2024

అక్టోబర్ 20: చరిత్రలో ఈరోజు

image

1937: హాస్యనటుడు రాజబాబు జననం
1978: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జననం
1990: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోన ప్రభాకర్ రావు మరణం
2008: దర్శకుడు సి.వి. శ్రీధర్ మరణం
2011: నటుడు, గాయకుడు అమరపు సత్యనారాయణ మరణం
➢ప్రపంచ గణాంక దినోత్సవం

News October 20, 2024

హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?: బొత్స

image

AP: ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని CM చంద్రబాబుని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు తమ నేతలకు జమిలీ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారని అన్నారు. ‘ఈ ప్రభుత్వ కాలం మరో రెండున్నరేళ్లే అని CBN వ్యాఖ్యలతో అర్థమవుతోంది. మద్యం, ఇసుకలో అక్రమాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. ఎరువులు, విత్తనాలు మార్కెట్లో కొనుక్కునే దుస్థితిలో రైతులున్నారు’ అని విమర్శించారు.

News October 20, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 20, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:11 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:01 గంటలకు
అసర్: సాయంత్రం 4:14 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:51 గంటలకు
ఇష: రాత్రి 7.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 20, 2024

పెంపుడు జంతువుగా శునకానికే మొగ్గు!

image

పెంపుడు జంతువుగా కుక్కను పెంచుకోవడం సాధారణమైపోయింది. ఇది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. స్టాటిస్టా కన్జూమర్ ఇన్‌సైట్స్ సర్వే ప్రకారం మెక్సికోలో అత్యధికంగా ప్రతి 10 మందిలో ఏడుగురు పెంచుకుంటున్నట్లు తేలింది. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్ (62%), ఇండియా (55%), USA (51%), స్పెయిన్ (45%), ఇటలీ (44%), UK (41%) ఉన్నారు. కాగా, అమెరికన్లు 36% పిల్లిని, 7% మంది చేపలను పెంచుకుంటున్నారు.