News October 20, 2024
హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?: బొత్స
AP: ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని CM చంద్రబాబుని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు తమ నేతలకు జమిలీ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారని అన్నారు. ‘ఈ ప్రభుత్వ కాలం మరో రెండున్నరేళ్లే అని CBN వ్యాఖ్యలతో అర్థమవుతోంది. మద్యం, ఇసుకలో అక్రమాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. ఎరువులు, విత్తనాలు మార్కెట్లో కొనుక్కునే దుస్థితిలో రైతులున్నారు’ అని విమర్శించారు.
Similar News
News November 8, 2024
ట్రూడో ఓడిపోవడం ఖాయం: ఎలాన్ మస్క్
ఇండియాతో తగువులతో వార్తల్లో నిలుస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయమని అంచనా వేశారు. జర్మనీలో సోషలిస్ట్ ప్రభుత్వం <<14553363>>కూలిపోతోందని<<>> ఒకరు, ఇలాగే కెనడాలోనూ ట్రూడోను తొలగించడానికి మీ సాయం కావాలని మరొకరు ట్వీట్ చేయగా మస్క్ స్పందించారు. కాగా కెనడాలో 2025 అక్టోబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి.
News November 8, 2024
ప్రపంచం మారినా బాబు మారడు: విజయసాయిరెడ్డి
AP: ప్రపంచం ఎంతో మారిందని, కానీ సీఎం చంద్రబాబు మారడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పుట్టినప్పటి నుంచి అవే మోసాలు, అబద్ధాలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘జ్ఞానం కలగాల్సిన వయసులో కూడా పాపాలు చేస్తున్నాడు. ఆయనకు ఇక నరకం సరిపోదు.. యముడు ఒక ప్రత్యేక లోకాన్ని సృష్టించాల్సిందే. చివరకు ఆ యముడిని కూడా తప్పుదోవ పట్టిస్తారేమో?’ అని ఆయన ట్వీట్ చేశారు.
News November 8, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి స్పెషల్ పోస్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హీరోయిన్ కియారా అద్వానీకి చెందిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సరికొత్త లుక్‌లో ఆమె ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవనుంది. టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోతాయని సినీవర్గాలు భావిస్తున్నాయి.