India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఆసక్తి ఉన్న రైతులకు డ్రోన్లు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 40వేల డ్రోన్లు అవసరం ఉందని ఆయన చెప్పారు. దీంతో పాటు ఎరువులను ద్రవరూపంలోకి మార్చాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఉద్యానవన పంటలతో రైతులకు లాభమని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారని, దానికి పూర్వవైభవం తీసుకొస్తామని కిసాన్ మేళాలో చెప్పారు.

ఇళ్ల అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే దాదాపు 500 ఏళ్ల నుంచి జర్మనీలోని ఫుగ్గేరీ గ్రామంలో అద్దెలే పెంచలేదు. ప్రస్తుతం అక్కడ ఏడాది అద్దె ఒక డాలర్ మాత్రమే. ఆ ప్రాంతానికి చెందిన ధనిక వ్యాపారవేత్త జాకబ్ ఫుగ్గర్ పేదల(కాథలిక్ విశ్వాసులకు మాత్రమే) కోసం 1521లో దీనిని కట్టించాడు. 67 ఇళ్లు, 142 అపార్ట్‌మెంట్లు ఉండగా 150 మంది జీవిస్తున్నారు. నివాసితులు రా.10 గం. కల్లా ఇంటికి చేరుకోవాలనే రూల్ ఉంది.

* 1798: తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జననం.
* 1979: స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత తెన్నేటి విశ్వనాథం మరణం.(ఫొటోలో)
* 1904: బహురూపధారణ(డ్యుయల్ రోల్) ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు వైద్యుల చంద్రశేఖరం జననం.
* 1957: గాయనీ, సంగీత దర్శకురాలు, రచయిత శోభారాజు జననం.
* ప్రపంచ సైన్స్ దినోత్సవం.

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆ దేశానికి వెళ్లబోదని BCCI ఐసీసీకి చెప్పినట్లు తెలుస్తోంది. 8ఏళ్ల విరామం తర్వాత జరుగుతోన్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలను ఈసారి పాకిస్థాన్ దక్కించుకుంది. కాగా ఆ దేశంతో సత్సంబంధాలు లేకపోవడంతో కొన్నేళ్లుగా భారత్ ఆ దేశానికి వెళ్లడం లేదు. ఇప్పుడు భారత్ వెళ్లని పక్షంలో తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహించాలనే ప్రతిపాదనలున్నాయి.

విలువైన విగ్రహాలు చోరీ కాకుండా చూసేందుకు వాటికి QR కోడ్ ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. విగ్రహాలు చోరీ అయితే ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు కోడ్‌ను వాడుకోవచ్చని మంత్రి శేఖర్ బాబు వివరించారు. ‘కోడ్‌ల ద్వారా ఇకపై విగ్రహాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. మరో 6 నెలల్లో ఈ మొత్తం ప్రాసెస్ పూర్తవుతుంది. ఇప్పటి వరకు రికవర్ చేసిన విగ్రహాలను వాటి స్థానంలో తిరిగి ప్రతిష్టిస్తాం’ అని పేర్కొన్నారు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

US అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 13న శ్వేతసౌధంలో భేటీ అవుతారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. పదవి నుంచి తప్పుకొనే అధ్యక్షుడు, కొత్తగా పదవిలోకి వచ్చే అధ్యక్షుడితో సమావేశమై కీలక వివరాలను పంచుకోవాల్సి ఉంటుంది. ట్రంప్‌నకు అధికార బదలాయింపు ప్రక్రియ జనవరిలో పూర్తి కానుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా తాను చూసుకుంటానని బైడెన్ ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మహిళల ఎదుగుదలకు పితృస్వామ్యం అడ్డుకాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులోని CMS బిజినెస్ స్కూల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘పితృస్వామ్య వ్యతిరేకత అనేది వామపక్షాలు తీసుకొచ్చిన కాన్సెప్ట్. దానికి ప్రభావితం కావొద్దు. మీరు మీ కాళ్లమీద నిలబడి, ధైర్యంగా మాట్లాడగలిగితే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇందిరాగాంధీ ప్రధాని కాకుండా పితృస్వామ్యం ఆపిందా?’ అని ప్రశ్నించారు.

✒ తేది: నవంబర్ 10, ఆదివారం ✒ శు.నవమి: రాత్రి 09.01 గంటలకు ✒ ధనిష్ఠ: ఉ.10.59 గంటలకు ✒ వర్జ్యం: సా.5.47-7.18 గంటల వరకు ✒ దుర్ముహూర్తం: సా.4.01-4.47 గంటల వరకు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.