News October 20, 2024

వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు

image

AP: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముకున్నట్లు ఓ భక్తుడు చేసిన ఫిర్యాదుతో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలతో 6 టికెట్లను రూ.65వేలకు అమ్ముకున్నట్లు బెంగళూరుకు చెందిన సాయికుమార్ ఆరోపించారు. అయితే తాను టీడీపీలో చేరుతుండటంతో వైసీపీ నేతలే కుట్ర చేశారని జకియా ఖానమ్ విమర్శించారు. మైనార్టీ మహిళలకు ఆ పార్టీలో గౌరవం లేదన్నారు.

News October 20, 2024

అలాంటి నిర్మాణాలను కూల్చివేయం: హైడ్రా

image

TG: చట్టపరమైన అనుమతులున్న వెంచర్లు, భవనాల విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని హైడ్రా పేర్కొంది. చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలను కూల్చివేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అన్ని పర్మిషన్లు ఉన్న నిర్మాణాలను కూల్చివేయబోమన్న సీఎం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.

News October 20, 2024

టీటౌన్ రూమర్: OG మూవీలో అకీరా నందన్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అకీరా తన తండ్రితో కలిసి నటించనున్నారని తెలియడంతో అభిమానులు ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు.

News October 20, 2024

పెట్రోల్ దాడిలో బాలిక మరణం కలచివేసింది: అనిత

image

AP: వైఎస్సార్ జిల్లాలో ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక <<14403526>>మరణించడం<<>> దిగ్భ్రాంతికి గురిచేసిందని హోంమంత్రి అనిత చెప్పారు. విద్యార్థినిపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తీవ్రంగా కలచివేశాయన్నారు. నిందితుడు విఘ్నేశ్, అతనికి సహకరించిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

News October 20, 2024

అశోక్‌నగర్‌లో మళ్లీ ఉద్రిక్తత

image

TG: హైదరాబాద్ అశోక్‌నగర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా రేపటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

News October 20, 2024

టీడీపీలో కొత్తగా పంచ సభ్య కమిటీ?

image

AP: ఎమ్మెల్యేల పనితీరుని పర్యవేక్షించడానికి పంచ సభ్య కమిటీ వేస్తున్నట్లు CM చంద్రబాబు ప్రకటించినట్లు తెలుస్తోంది. ‘MLAలు చేస్తున్న తప్పులను ఈ కమిటీ గమనిస్తుంటుంది. పంచ సభ్య కమిటీ చెప్పిన తర్వాత కూడా తీరు మారకపోతే నేను పిలవాల్సి ఉంటుంది. అయినా మార్పు రాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయి. కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్లు అందరికీ ఇది వర్తిస్తుంది’ అని నేతలతో సమావేశంలో CBN చెప్పినట్లు సమాచారం.

News October 20, 2024

CBN చేతకాని పాలనకు యువతి బలి: YCP

image

AP: ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో యువతి(17) <<14403526>>మృతి <<>>చెందడంపై YCP మండిపడింది. ‘చంద్రబాబు చేతకాని పాలనకి మరో యువతి బలైపోయింది. బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై శనివారం అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి విఘ్నేశ్ అనే వివాహితుడు నిప్పంటించి పరారయ్యాడు. ఇవాళ ఆ అమ్మాయి మృతి చెందింది. APలో కామాంధులు ఇష్టారీతిన రెచ్చిపోతుంటే.. సీఎం చంద్రబాబు, హోంమంత్రి, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించింది.

News October 20, 2024

పాత సంజయ్‌ను గుర్తుచేశారు

image

TG: నిన్న గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న బండి సంజయ్ పాత రోజులను గుర్తు చేశారు. తాను కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని అన్న విషయాన్ని పక్కనపెట్టి రోడ్డుపై ఒకప్పటి రాష్ట్ర BJP అధ్యక్షుడిలా బైఠాయించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ ‘ఛలో సెక్రటేరియట్’కు పిలుపునివ్వగా, పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత GO 29 రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

News October 20, 2024

వాహనదారులకు హెచ్చరిక

image

TG: కొందరు వాహనదారులు తమ పాత వాహనాల నంబర్ ప్లేట్లపై TSతో ఉన్న అక్షరాలను తొలగించి TGగా మార్చేస్తున్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులు స్పందించారు. ‘TG సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్న వాహనాలకు మాత్రమే ఆ కోడ్ వర్తిస్తుంది. TS ఉన్న వాళ్లకు TGగా మారదు. ఎవరైనా సొంతంగా నంబర్ ప్లేట్‌పై స్టేట్ కోడ్ మారిస్తే ట్యాంపరింగ్‌గా భావించి నేరంగా పరిగణిస్తాం. అలాంటి వారిపై చర్యలు ఉంటాయి’ అని హెచ్చరించారు.

News October 20, 2024

మ్యాచ్ టై.. సూపర్ ఓవర్లో గెలిచిన నేపాల్

image

నేపాల్, యూఎస్ఏ మధ్య జరిగిన రెండో టీ20 ఊహించని మలుపులు తిరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. ఛేదనలో యూఎస్ఏ 170 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్లో USA 2 పరుగులు చేయగా నేపాల్ నాలుగు బంతుల్లోనే విజయాన్ని సొంతం చేసుకుంది.