India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రతన్ టాటా అపర కుబేరుడు. టాటాల వారసుడు. ఆగర్భ శ్రీమంతుడు. అలాంటి వ్యక్తి వాడే వస్తువులంటే ఎంత ధర ఉండాలి? ఓ సినిమాలో డైలాగ్‌లా ఆయన వాచ్ అమ్మితే ఓ మధ్య తరగతి మనిషి లైఫ్ సెటిల్ అయిపోవాలి. కానీ కేవలం టైమ్ చూసేందుకు అంత ఖర్చెందుకు అని భావించేవారాయన. విక్టోరినాక్స్ బ్రాండ్‌కు చెందిన సుమారు రూ.10వేల విలువైన స్విస్ ఆర్మీ వాచ్‌ని మాత్రమే రతన్ ధరించేవారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదే కదా!

TG: న్యాయం కోసం శాంతియుత నిరసన చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BRS MLA హరీశ్‌రావు అన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘విద్యార్థులుండే అశోక్‌నగర్‌లో కరెంట్ తీసేసి, నిర్బంధించడమే ప్రజా పాలన? ఎన్నికలప్పుడు రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌లో ఓట్లడిగింది మరిచిపోయారా? ’అని ప్రశ్నించారు.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రతరం చేస్తోంది. హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఖనా నగరంపై జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో నబాతియే మేయర్ అహ్మద్ కహిల్ మరణించారు. ఆయనతో సహా 15 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 250 మంది మిలిటెంట్లు మరణించారు. తమ సరిహద్దుల్లో హెజ్బొల్లాను తరిమికొట్టేంత వరకు కాల్పుల విరమణ చేపట్టమని ఇజ్రాయెల్ PM నెతన్యాహు తేల్చిచెప్పారు.

న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ముంగిట రోహిత్ శర్మ ఇటీవల ఎన్నడూ లేనంత ఫిట్‌గా కనిపిస్తున్నారు. బెంగళూరు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ సందర్భంగా ఆయన ఫొటోలు బయటికొచ్చాయి. ఇంతకు ముందుతో పోలిస్తే సన్నగా, కండలు తిరిగిన దేహంతో హిట్‌మ్యాన్ కనిపిస్తున్నారు. ఇప్పుడు రోహిత్ హిట్‌మ్యాన్ కాదు ఫిట్‌మ్యాన్ అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రోహిత్ ప్రస్తుతం వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతుండటం తెలిసిందే.

TG: ఫార్మసీ కాలేజీల్లో రేపటి నుంచి క్లాసులు బంద్ చేస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఇప్పటికే డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ను చేపడుతుండగా, రేపటి నుంచి ఫార్మసీ కాలేజీలు సైతం బంద్‌లో పాల్గొననున్నాయి.

ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఒకే రాజధాని అనేది ఎన్డీఏ పాలసీ అని చెప్పారు. ‘అమరావతి రాజధాని. విశాఖ ఆర్థిక రాజధాని. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. కర్నూలు ఇండస్ట్రియల్ హబ్‌గా, అద్భుతమైన సిటీగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం’ అని తెలిపారు.

న్యాయదేవత కళ్లకు గంతలు తొలగిపోయి తలపై కిరీటం, చేతిలో కత్తి స్థానంలో రాజ్యాంగ పుస్తకం వచ్చాయి. దీన్ని సుప్రీం న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేశారు. చట్టం గుడ్డిది కాదని, శిక్షకు ప్రతీక కాదనే సందేశమివ్వాలనే CJI ఈ మార్పులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. బ్రిటిష్ వారసత్వం నుంచి భారత్ ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఇటీవల కేంద్రం సైతం IPC స్థానంలో BNS తీసుకొచ్చింది.

AP: ఉచిత ఇసుక విషయంలో కూటమి MLAలు జోక్యం చేసుకుంటే ఎవర్నీ వదలబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇందులో తన, మన అనేవి ఉండవు. ఇసుక ఉచితంగానే తీసుకెళ్లాలి. ఎవరైనా ఎడ్ల బండి తీసుకొచ్చి ఇసుక తీసుకెళ్లవచ్చు. వారిపై కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తాం. దీనిలో ఎవరి పెత్తనాన్నీ సహించం. ఎవరి ఊరిలో వాళ్లకు ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో ఎవరి పెత్తనం వద్దు’ అని ఆయన స్పష్టం చేశారు.

AP: ప్రతిపక్ష నేతలపై చంద్రబాబు సర్కార్ తప్పుడు కేసులు బనాయిస్తోందని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ‘కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేదు. మద్యం షాపుల కోసం టీడీపీ MLAలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కేరళ మాల్ట్ బ్రాండ్ కర్ణాటకలో రూ.90కి ఇస్తుంటే ఇక్కడ రూ.99కి పెంచారు. పథకాలేవీ అమలు చేయడం లేదు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.

UPలో చర్ఖారీ MLA బ్రిజ్‌భూషణ్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. పెట్రోల్ బంక్‌లో పని చేసే అఖిలేంద్ర అనే వ్యక్తి తనకు పెళ్లి చేయాలని MLAను కోరాడు. తననే ఎందుకు అడుగుతున్నావని MLA ప్రశ్నించగా.. ‘నేను మీకు ఓటేశాను’ అని ఆన్సర్ ఇచ్చాడు. తన వయసు 43 అని చెప్పాడు. కాసేపు మాట్లాడిన MLA ‘నాకు ఓటేశావు కదా. నా వంతు ప్రయత్నిస్తా. నీ జీతం ఎంత?’ అని అడిగారు. అతను రూ.6వేలు వస్తుందని, 13బిగాల భూమి ఉందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.