News October 9, 2024

WTC: రికార్డు సృష్టించిన రూట్

image

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) చరిత్రలో 5వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ (5005) రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఈ ఘనత సాధించారు. 59 మ్యాచుల్లో అతను ఈ ఫీట్‌ను అందుకోగా, అతని తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు లబుషేన్(3904), స్మిత్(3,484) ఉన్నారు.

News October 9, 2024

RBI MPC: FY25లో రియల్ జీడీపీ గ్రోత్‌ 7.2%

image

FY25లో భారత రియల్ జీడీపీ గ్రోత్‌ను 7.2 శాతంగా RBI అంచనా వేసింది. Q1లో 8 కోర్ ఇండస్ట్రీస్ ఔట్‌పుట్ 1.8% తగ్గినట్టు తెలిపింది. కరెంటు, కోల్, సిమెంట్ ఉత్పత్తిపై అధిక వర్షపాతం ప్రభావం చూపినట్టు పేర్కొంది. ఇన్‌ఫ్లేషన్ గుర్రాన్ని కట్టడి చేశామని, కళ్లెం విప్పేముందు జాగ్రత్తగా ఉండాలంది. FY25లో ఇన్‌ఫ్లేషన్ 4.5% ఉంటుందని చెప్పింది. ఎమర్జింగ్ కరెన్సీలతో పోలిస్తే రూపాయి స్థిరంగా ఉన్నట్టు వెల్లడించింది.

News October 9, 2024

డైరెక్టర్ ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడు: పూనమ్

image

ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్ నాశనం చేశాడని నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ‘MAA’ జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికిందన్నారు. అతడు లీడర్‌గా మారిన నటుడు కాదని ఆమె హింట్ ఇచ్చారు. అయితే ఈ విషయంలోకి తనను, ఓ నటుడు/రాజకీయ నాయకుడిని అనవసరంగా లాగారని వాపోయారు. ఎవరి పేర్లూ ప్రస్తావించలేదు. పూనమ్ ఇటీవల త్రివిక్రమ్‌పై <<14124651>>ఆరోపణలు<<>> చేశారు.

News October 9, 2024

రేవంత్ సర్కార్‌కు మాదిగలు బుద్ధి చెబుతారు: మందకృష్ణ

image

SC వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్‌ సర్కార్‌కు మాదిగలు బుద్ధి చెబుతారని MRPS అధ్యక్షుడు మందకృష్ణ హెచ్చరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మాల కావడం వల్లే మాదిగలకు రేవంత్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వర్గీకరణ తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇప్పుడు హడావుడిగా నియామకాలు చేపడుతున్న CM సమాధానం చెప్పాలన్నారు. DSC నియామకాలను నిరసిస్తూ MRPS రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.

News October 9, 2024

హనుమంత వాహనంపై మలయప్పస్వామి

image

AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం హనుమంత వాహనంపై రామావతారంలో మలయప్పస్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7గంటలకు గజ వాహనంపై మలయప్పస్వామి ఊరేగుతారు.

News October 9, 2024

హరియాణాలో కాంగ్రెస్‌కు పెరిగిన ఆదరణ

image

హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక్కడ BJP-కాంగ్రెస్ మధ్య 11 సీట్ల తేడా ఉన్నప్పటికీ ఓటు షేర్‌లో రెండింటికీ 39% వచ్చింది. 2019లో కాంగ్రెస్‌కు 28.08% ఓట్లు రాగా, ప్రస్తుతం గణనీయంగా ఆదరణ పెరిగింది. BJP గత ఎన్నికల్లో 36.49% ఓటు బ్యాంక్‌తో 40సీట్లు గెలుచుకుంది. జననాయక్ జనతా పార్టీకి 2019లో 14.80% ఓట్లతో 10సీట్లలో విజయఢంకా మోగించింది.

News October 9, 2024

వడ్డీరేట్లు తగ్గించని RBI..

image

అక్టోబర్ పాలసీ మీటింగ్‌లోనూ రెపోరేట్లపై ఆర్బీఐ స్టేటస్ కో ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రెపోరేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. న్యూట్రల్ వైఖరినే అవలంబిస్తున్నామని చెప్పారు. ఇన్‌ఫ్లేషన్ తగ్గుదల ఇంకా నెమ్మదిగా, అసాధారణంగానే ఉందన్నారు. యూఎస్ ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల మేర కత్తిరించినా ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది.

News October 9, 2024

భర్త మృతి.. మరణమైనా నీతోనే అంటూ భార్య ఆత్మహత్య

image

AP: కోటి కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ ప్రేమ జంట ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. విధి ఇద్దరినీ బలి తీసుకుంది. విజయవాడకు చెందిన నాగరాజు(29), ఉష(22) ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 18నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. సోమవారం రోడ్డు ప్రమాదంలో నాగరాజు చనిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని రక్తపు మడుగులో చూసి ఉష గుండె తల్లడిల్లింది. ప్రాణసఖుడు లేని లోకంలో తాను ఉండలేనంటూ ఉరి వేసుకుంది.

News October 9, 2024

సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. క్రిస్మస్‌కి బదులు సంక్రాంతికి రిలీజ్ చేస్తే సెలవులు కలిసొస్తాయని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలిపాయి. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీ జనవరి 14న విడుదలవనుండగా, మెగాస్టార్ ‘విశ్వంభర’ ఉగాదికి వచ్చే అవకాశం ఉంది.

News October 9, 2024

వాహనాలు 15ఏళ్లు దాటినా వాడుకోవచ్చు కానీ..

image

TG: రాష్ట్రంలో 15ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. ఆ వాహనాలు ఫిట్‌గా ఉన్నాయనిపిస్తే నడుపుకోవచ్చు. అయితే తదుపరి 5ఏళ్లకు ₹5K, మరో పదేళ్లకు ₹10K గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి. పాత వాహనాన్ని తుక్కుగా మార్చాలా వద్దా అనేది యజమాని నిర్ణయించుకుంటారు. మారిస్తే తర్వాతి వాహనానికి రాయితీ వస్తుంది.