India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మానవాభివృద్ధి కోసం AI టెక్నాలజీని ఉపయోగిస్తామని Nvidia సీఈవో జెన్సన్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్లలో ఈ సంస్థ ఒకటి. ఓ ఇంటర్వ్యూలో జెన్సన్ మాట్లాడుతూ.. ‘మనుషులు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకునేంత స్మార్ట్‌గా కంప్యూటర్లు ఉండాలి. ఆ దిశగా మేం పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ప్రోగ్రామింగ్ అనేది ప్రత్యేకమైన స్కిల్ కాదు. యువత కంప్యూటర్ సైన్స్ చదవాల్సిన అవసరం ఉండదు’ అని పేర్కొన్నారు.
ఇకపై తాను బిడ్డను కనలేనని బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ అన్నారు. ‘నాకు కూతురు పుట్టిన తర్వాత ఏడేళ్లు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించా. నాలుగేళ్ల క్రితం గర్భం దాల్చాను. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కడుపులోనే బిడ్డను కోల్పోయా. ప్రస్తుతం నా వయసు 46 ఏళ్లు. ఈ వయసులో ఇక బిడ్డను కనలేను. నా కూతురికి చెల్లినో, తమ్ముడినో ఇవ్వలేకపోయాననే బాధ మెలిపెడుతోంది’ అని ఆమె పేర్కొన్నారు.
లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, కవిత బంధువులు, అనుచరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఢిల్లీలోని ఆప్ MLA గులాబ్ సింగ్ ఇంటిపై రైడ్స్ జరుగుతున్నాయి. అదే సమయంలో హైదరాబాద్‌లోని కవిత ఆడపడుచు తదితర బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.
వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమా యువతను ఏ స్థాయిలో ఆకట్టుకుందో తెలిసిందే. కాగా ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. తన రెండో కూతురు ఖుషీ కపూర్ హీరోయిన్‌గా సినిమాను పునర్నిర్మించాలని చూస్తున్నారు. కాగా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను నవీన్ యెర్నేని నిర్మించారు.
TG: BRS MLC కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లపైనా రైడ్స్ జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె భర్తకూ నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే కవిత, అనిల్ బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ఓ పోలీస్ ఆఫీసర్‌పై కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈడీ ఆఫీస్ నుంచి కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో ఏసీపీ ఏకే సింగ్ తనతో అనుచితంగా ప్రవర్తించారని, అతడిని తన సెక్యూరిటీ విధుల నుంచి తప్పించాలంటూ రౌస్ అవెన్యూ కోర్టుకు దరఖాస్తు అందజేశారు. కాగా గతంలో మనీశ్ సిసోడియాను మెడ పట్టుకుని తీసుకెళ్లిన పోలీస్ ఆఫీసర్ కూడా ఏకే సింగే కావడం గమనార్హం.
TG: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భూపాలపల్లి వీఆర్ సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ PSలో ఎస్సైగా పనిచేశాడు. అప్పటినుంచి హనుమకొండకు చెందిన ఓ మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈక్రమంలోనే ఆమె కూతురుపై కన్నేసిన అతడు.. అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో సీఐపై పోక్సో కేసు నమోదైంది.
TG: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబీ డీఎస్పీ తిరుపతన్న, HYD మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభాకర్ రావు, రాధాకిషన్ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు.
AP: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ రెబల్‌గా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు తనవైపే ఉన్నారని అన్నారు. విజయం సాధించి అధికార పార్టీతో కలిసి పని చేస్తానని తెలిపారు. తన వెనుక వైసీపీ ఉందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. కాగా ఈ సీటును మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకే టీడీపీ అధిష్ఠానం కేటాయించింది.
హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ రైళ్లు నడవనున్నట్లు పేర్కొంది. 23న హైదరాబాద్-ధనపూర్, 25న సంత్రాగచి-సికింద్రాబాద్, 26న ధనపూర్-హైదరాబాద్, 24న సంత్రాగచి-చెన్నై సెంట్రల్, 27న పట్నా-కోయంబత్తూర్ మధ్య రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.