News October 8, 2024
పుష్ప-2కి ఫహాద్ ఫాజిల్ రెమ్యునరేషన్ ఎంతంటే?
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కి ప్రస్తుతం దక్షిణాదిన అత్యంత డిమాండ్ నెలకొంది. రజినీకాంత్ నుంచి అల్లు అర్జున్ వరకూ స్టార్ హీరోల మూవీల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘పుష్ప’కు ఆయన రూ.3 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకోగా, పుష్ప-2కి ఏకంగా రూ.7.2 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ డిసెంబరు 6న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్‌కు ఎడిటింగ్ పూర్తి చేసి లాక్ చేసినట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.
Similar News
News November 5, 2024
కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: నిరంజన్
TG: రాష్ట్రంలో రేపటి నుంచి <<14533351>>కులగణన సర్వే<<>> జరగనుంది. ఈ సర్వేలో కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ సిఫారసు చేశారు. అన్ని కులాల లెక్కలు, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఈ సర్వేలో తెలుస్తాయని, భవిష్యత్తులో మళ్లీ కులగణన ఎప్పుడు జరుగుతుందో తెలియదని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు కావాలని వివరాలను తప్పుగా నమోదు చేస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు.
News November 5, 2024
STOCK MARKET: నిన్న విలవిల.. నేడెలా మొదలయ్యాయంటే
బెంచ్‌మార్క్ సూచీలు నేడూ నష్టాల్లోనే మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందినా ఇన్వెస్టర్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 23,943 (-52), సెన్సెక్స్ 78,586 (-198) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, మెటల్, ఫార్మా షేర్లలో అక్యూములేషన్ కనిపిస్తోంది. FMCG, ఫైనాన్స్, రియాల్టి, OIL & GAS షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. అదానీ పోర్ట్స్, TRENT, శ్రీరామ్ FIN, ITC, HDFC లైఫ్ టాప్ లూజర్స్.
News November 5, 2024
సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ భిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. సల్మాన్‌కు వారు 2 ఆప్షన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఏదైనా గుడికి వెళ్లి దేవుడిని క్షమాపణలు కోరడం లేదా రూ.5 కోట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ వారంలో ఆయన బెదిరింపులు ఎదుర్కోవడం ఇది రెండోసారి.