India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కీర్తికిరీటంలో మరో కలికితురాయి అంటూ వార్తల్లో వింటుంటాం. అయితే, చాలా మందికి దీని అర్థం తెలియదు. ‘కలికితురాయి’ అంటే
కొంగ తల ఈకలతో చేసిన శిరోభూషణము అని అర్థం. వివరంగా చెప్పాలంటే.. కలికి అంటే మనోహరమైన, తురాయి అంటే పక్షి ఈక లేదా పువ్వుతో తయారుచేసిన మకుటాలంకారం. ఎవరైనా ఏదైనా అవార్డును, ఘనకార్యాన్ని సాధించినప్పుడు ఆ వ్యక్తి “కీర్తి కిరీటంపై కలికితురాయి ” అనే నానుడిని వాడతారు.

TG: రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే గురుకులాలను శాశ్వతంగా మూసివేసే కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోందని KTR అన్నారు. అద్దె చెల్లించకపోవడంతో గురుకులాలకు యజమానులు తాళాలు వేయడంపై ఆయన Xలో స్పందించారు. ‘ఢిల్లీకి మూటలు పంపేందుకు డబ్బులున్నాయి. కమిషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు రూ.వేల కోట్లు ఉన్నాయి. కానీ గురుకులాల అద్దెలు చెల్లించడానికి డబ్బులు లేవా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై హత్యాయత్నం కేసులో భారత అధికారి జోక్యాన్ని దర్యాప్తు చేసేందుకు భారత బృందం అమెరికాకు వెళ్లింది. ప్రధాన నిందితుడు నిఖిల్ గుప్తాతో పాటు ఆ అధికారి ఇతర సంబంధాలను పరిశీలించనుంది. ఈ మేరకు భారత్ తమకు సమాచారం ఇచ్చిందని US స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. న్యూయార్క్‌లో పన్నూన్ హత్యకు వీరిద్దరూ కుట్ర పన్నారని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఎలక్షన్ల ముంగిట రాజకీయ పార్టీలిచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణిస్తూ ఆదేశాలివ్వాలన్న పిల్‌పై ముందడుగు పడింది. కేంద్రం, ECIకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశంపై నమోదైన పెండింగ్ కేసులనూ ఈ పిటిషన్‌కు ట్యాగ్ చేసింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా వెంటనే పటిష్ఠ చర్యలు తీసుకొనేలా ECIకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌దారులు సుప్రీం కోర్టును కోరారు. విచారణపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

*ప.గో., పల్నాడు- గొట్టిపాటి రవికుమార్ *అల్లూరి- గుమ్మిడి సంధ్యారాణి *తూ.గో, కర్నూలు- నిమ్మల రామానాయుడు *కృష్ణా- వాసంశెట్టి సుభాష్
*గుంటూరు- కందుల దుర్గేశ్ *బాపట్ల- పార్థసారథి *ప్రకాశం- ఆనం రామనారాయణ రెడ్డి *నెల్లూరు- ఫరూఖ్
*నంద్యాల- పయ్యావుల కేశవ్ *అనంతపురం- టీజీ భరత్
*శ్రీసత్యసాయి, తిరుపతి- అనగాని సత్యప్రసాద్ *వైఎస్సార్- సవిత *అన్నమయ్య- బి.సి జనార్ధన్ రెడ్డి
*చిత్తూరు- రాంప్రసాద్ రెడ్డి

దీపావళి సందర్భంగా ఫోన్ పే ‘ఫైర్ క్రాకర్’ పాలసీని తీసుకొచ్చింది. బాణసంచా సంబంధిత ప్రమాదాలకు ఈ బీమా అందించనుంది. ఈ ప్లాన్ కింద రూ.9 చెల్లించి వినియోగదారులు రూ.25 వేల వరకు బీమా కవరేజీ పొందొచ్చు. ఈ నెల 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు కవరేజీ పొందొచ్చని కంపెనీ తెలిపింది. ఫోన్ పే యాప్ ద్వారా దీనిని కొనుగోలు చేయొచ్చు. బజాజ్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఈ పాలసీని ఫోన్‌పే తీసుకొచ్చింది.

‘పుష్ప-2’పై ఉన్న క్రేజ్‌కు తగ్గట్లుగా పక్కా ప్లానింగ్‌తో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 4న ఓవర్సీస్‌తో పాటు అదే రోజు రా.9 గంటల నుంచి నార్త్ ఇండియాలో ప్రీమియర్స్ వేయాలని భావిస్తున్నారట. DEC 5న AP, TGలో 1AM నుంచే షోలు పడేలా ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇలా జరిగితే ఓపెనింగ్ డే ఆల్ టైమ్ రికార్డు స్థాయి కలెక్షన్స్ వస్తాయని ఫ్యాన్స్ అంటున్నారు.

AP: జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*విజయనగరం- వంగలపూడి అనిత
*విశాఖ- డోలా బాల వీరాంజనేయస్వామి
*శ్రీకాకుళం- కొండపల్లి శ్రీనివాస్
*పార్వతీపురం మన్యం, కోనసీమ- అచ్చెన్నాయుడు
*అనకాపల్లి- కొల్లు రవీంద్ర
*కాకినాడ- పొంగూరు నారాయణ
*ఏలూరు- నాదెండ్ల మనోహర్
*ఎన్టీఆర్- సత్యకుమార్

పుణేకు చెందిన అభయ్ అనే యువకుడి స్కూటీ చోరీకి గురైంది. ఎంత వెతికినా దొరక్కపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఆ స్కూటీ క్యాన్సర్‌తో చనిపోయిన తన తల్లిదని అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘నా యాక్టివా దొంగిలించిన దొంగకు ఓ రిక్వెస్ట్. ఈ స్కూటీ మా అమ్మ చివరి జ్ఞాపకం. దయచేసి దాన్ని తిరిగి ఇవ్వండి. మీకు కొత్త వాహనం కొనిస్తా’ అని ప్లకార్డుతో ప్రదర్శన చేస్తున్నారు.

AP: TDP ఆఫీసుపై దాడి ఘటన కేసులో సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని YCP విమర్శించింది. సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాశ్, అప్పిరెడ్డి, తలశిల రఘరాంపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనమంది. నిన్న విదేశీ పర్యటన ముగించుకుని వస్తున్న సజ్జలను ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ నోటీసు పేరుతో అడ్డుకున్నారని తెలిపింది. ఆయన విదేశాలకు వెళ్లేటప్పుడు లేని నోటీసు ఇప్పుడేంటని ప్రశ్నించింది.
Sorry, no posts matched your criteria.