India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సరికొత్త ఘనత సాధించారు. టీ20ల్లో అత్యధిక సార్లు సిక్సర్‌తో మ్యాచ్ ముగించిన ప్లేయర్‌గా ఆయన రికార్డులకెక్కారు. ఇప్పటివరకు ఆయన 5 సార్లు సిక్సర్‌తో మ్యాచ్ ఫినిష్ చేశారు. విరాట్ కోహ్లీ, ఫించ్, ఇయాన్ మోర్గాన్, తిసారా పెరీరా, రస్సెల్, షాయ్ హోప్ నాలుగేసి సార్లు సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించారు. కాగా ఈ ఏడాది హార్దిక్ టీ20ల్లో 214 పరుగులతోపాటు 14 వికెట్లు కూడా తీశారు.

పదేళ్లు అధికారంలో ఉన్న BJPపై ప్రజల్లో వ్యతిరేకత *సాగు చట్టాలను నిరసిస్తూ రైతుల ఉద్యమాలు *వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళనలు * అగ్నివీర్‌పై స్థానిక యువతలో ఉన్న అసంతృప్తి *జాట్‌ల మద్దతు *కులగణన *దళిత వర్గాల ఓట్ల కన్సాలిడేషన్ * నిరుద్యోగం *లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన. వివిధ అంశాల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌ను గట్టెక్కించలేకపోయాయి.

గెలిచేస్తున్నామనే అతివిశ్వాసం హరియాణాలో కాంగ్రెస్ కొంపముంచింది. సీఎం కుర్చీ కోసం భూపిందర్ హుడా, కుమారీ షెల్జా మధ్య బహిరంగ వర్గపోరు నష్టం చేసింది. జాట్ల ఓట్లపై దృష్టి పెట్టి జాట్‌యేతరులను కోల్పోయింది. BJP కంటే అత్యధిక ఓట్లు సాధించినా ఆ స్థాయిలో సీట్లు గెలవలేకపోయింది. BJP తెరవెనుక వ్యూహాలు కాంగ్రెస్‌ను దెబ్బతీశాయి. అర్బన్ ఓటర్లను ఆకర్షించలేకపోవడం కాంగ్రెస్‌కు నష్టం చేసింది.

భారతదేశ సినీ చరిత్రలోనే ‘పుష్ప2’ మూవీ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ఆ మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేసింది. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ‘పుష్ప-2 ఫస్ట్ హాఫ్ లాక్ అయింది. లోడెడ్ అండ్ ప్యాక్డ్ విత్ ఫైర్. చరిత్రకు సాక్ష్యంగా నిలిచేందుకు సిద్ధం కండి. భారత బాక్సాఫీస్ వద్ద పుష్ప తుఫాను సృష్టించనుంది. డిసెంబరు 6 నుంచి థియేటర్లలో’ అని ట్వీట్ చేసింది.

TG: J&K, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. ‘2029 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌కు దూరంగా ఉంటాయి. రాబోయే కేంద్రప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం. దశాబ్దం, అంతకంటే ఎక్కువ కాలమే ఈ పరిస్థితి కొనసాగొచ్చు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ కర్ణాటక, హిమాచల్, తెలంగాణ ప్రజలను మోసం చేసింది. గ్యారంటీలు అబద్ధమని హరియాణా ప్రజలు గ్రహించారు’ అని ట్వీట్ చేశారు.

AP: పిఠాపురంలో <<14301232>>మైనర్<<>> బాలికపై జరిగిన అఘాయిత్యం తనకు బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని, లేదంటే తప్పించుకునేవాడని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించానన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

AP: వైసీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ బాట కార్యక్రమం చేపడతామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో తిరుపతిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి పదవులు ఇస్తామని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు సమావేశానికి హాజరయ్యారు.

భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తాజాగా తాజ్‌మహల్‌ను సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కట్టడం అందానికి ముగ్ధుడయ్యారు. ‘ఈ సమాధి మందిర అందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రేమకు, నిర్మాణ నైపుణ్య పరాకాష్ఠకు ఇది సజీవ సాక్ష్యం’ అని విజిటర్ బుక్‌లో రాశారు. భారత్‌లో 4 రోజుల టూర్‌లో భాగంగా ఆయన నేడు ముంబై, రేపు బెంగళూరులో పర్యటించనున్నారు.

ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో లోపెరా బేకరీలో ఓ కస్టమర్ రూ.335 ఖరీదైన ఐస్డ్ లాటే ఆర్డర్ ఇచ్చారు. తాగే సమయంలో ఏదో కాఫీ గింజలా తేలుతుండటంతో స్పూన్‌తో వెనక్కి తిప్పారు. తీరా చూస్తే అది బొద్దింక. ఈ విషయాన్ని ఆమె రెడిట్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. ఆమెకు క్షమాపణలు చెప్పి, డబ్బులు వెనక్కిచ్చామని, మరో కాఫీ ఆఫర్ చేశామని బేకరీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మరో కాఫీ తాగేందుకు ఆ కస్టమర్ సాహసించలేదు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్ అఘా సల్మాన్ విధ్వంసం సృష్టించారు. 108 బంతుల్లోనే సల్మాన్ (100*) సెంచరీ బాదారు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు అబ్దుల్లా షఫీఖ్ (102), షాన్ మసూద్ (151) కూడా సెంచరీలు చేయడంతో పాక్ 556 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 3 వికెట్లు పడగొట్టారు.
Sorry, no posts matched your criteria.