News October 8, 2024
ఆ కాఫీ ధర రూ.335.. అందులో బొద్దింక!

ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో లోపెరా బేకరీలో ఓ కస్టమర్ రూ.335 ఖరీదైన ఐస్డ్ లాటే ఆర్డర్ ఇచ్చారు. తాగే సమయంలో ఏదో కాఫీ గింజలా తేలుతుండటంతో స్పూన్‌తో వెనక్కి తిప్పారు. తీరా చూస్తే అది బొద్దింక. ఈ విషయాన్ని ఆమె రెడిట్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. ఆమెకు క్షమాపణలు చెప్పి, డబ్బులు వెనక్కిచ్చామని, మరో కాఫీ ఆఫర్ చేశామని బేకరీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మరో కాఫీ తాగేందుకు ఆ కస్టమర్ సాహసించలేదు.
Similar News
News January 16, 2026
కేంద్ర విద్యుత్ సవరణ రూల్స్‌ను వ్యతిరేకిస్తూ TG నివేదిక

TG: కేంద్ర ముసాయిదా విద్యుత్ (సవరణ) బిల్లు-2025లోని కొన్ని నిబంధనలను TG వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ERCలకు పూర్తి అధికారాలు, విద్యుత్ సబ్సిడీల హేతుబద్ధీకరణ, పరిశ్రమలు నేరుగా విద్యుత్ కొనుగోలు వంటి నిబంధనల్ని కేంద్రం ఈ ముసాయిదాలో ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్రం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈమేరకు రెండు డిస్కంలు నివేదికను సిద్ధం చేశాయి. CM అనుమతితో అధికారులు దీన్ని కేంద్రానికి సమర్పించనున్నారు.
News January 16, 2026
APలో స్మాల్ మిక్స్‌డ్ మాడ్యులర్ ఎనర్జీ రియాక్టర్

AP: థర్మల్ ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గిస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేలా చిన్నస్థాయిలో థర్మల్, హైడ్రో మిక్స్‌డ్ ఎనర్జీ రియాక్టర్‌ను నెలకొల్పేందుకు ఏపీ జెన్కో ఆలోచిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కోల్ ఇండియాతో కలిసి జాయింట్ వెంచర్ కింద దీనికి సంబంధించిన ప్లాంటు ఏర్పాటు ఆలోచన ఉందని జెన్‌కో ఎండీ నాగలక్షి ‘ది హిందూ’తో పేర్కొన్నారు. అయితే ఇది బొగ్గు రవాణా, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు.
News January 16, 2026
IOCLలో 405 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


