News October 8, 2024

ఇవాళ్టి నుంచి రైతు బజార్లలో రాయితీపై టమాటా, ఉల్లి

image

AP: సెంచరీ దాటిన టమాటా, ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేరుగా రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లోని రైతు బజార్లలో కిలో టమాటా రూ.50, ఉల్లి రూ.40-45 చొప్పున విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ కార్డుతో వెళితే కుటుంబానికి కిలో చొప్పున ఇస్తామన్నారు.

News October 8, 2024

పోలవరం సందర్శకుల ఖర్చులకు రూ.23 కోట్లు విడుదల

image

AP: గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలను పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి ఉచితంగా భోజనాలు పెట్టేవారు. దీనికి సంబంధించి 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. వారు హైకోర్టును ఆశ్రయించగా 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీంతో మొత్తం రూ.23.11 కోట్ల నిధుల విడుదలకు జలవనరుల శాఖ తాజాగా ఆమోదం తెలిపింది.

News October 8, 2024

పోలవరానికి రూ.2,800 కోట్లు విడుదల

image

AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.2,800 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. రీయింబర్స్‌మెంట్ కింద రూ.800 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే, వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్ల మంజూరుకు కేంద్రం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

News October 8, 2024

YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు

image

TGలో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, వరంగల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో నేడు APలోని మన్యం, అల్లూరి, ఉ.గో, రాయలసీమ, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని APSDMA పేర్కొంది.

News October 8, 2024

మంత్రిపై పరువు నష్టం కేసు.. విచారణకు నాగార్జున

image

TG: కాంగ్రెస్ మంత్రి సురేఖపై పరువు నష్టం కేసులో నేడు హీరో నాగార్జున విచారణకు హాజరు కానున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల విషయమై మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు తీశాయని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం ఇవ్వాలని పేర్కొంటూ జడ్జి శ్రీదేవి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.

News October 8, 2024

అక్రమ కూల్చివేతలకు బ్రేక్!

image

TG: అక్రమ కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంపై హైడ్రా దృష్టి పెట్టిందని ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో 3 నెలలు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ఇచ్చిందని తెలిపాయి. అదే సమయంలో చెరువుల సర్వే పూర్తి చేసి, తదుపరి కార్యాచరణ రూపొందించాలని సర్కార్ ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News October 8, 2024

అందరి చూపు జమ్మూకశ్మీర్ పైనే..

image

దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో దేశం మొత్తం చూపు జమ్మూకశ్మీర్ వైపే ఉంది. ఇవాళ ఫలితాల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడవచ్చని చెప్పినా తమదే విజయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో హంగ్ ఏర్పడితే గవర్నర్ నామినేట్ చేసే ఐదుగురు ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. దీంతో బీజేపీకి లాభమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News October 8, 2024

ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్

image

TG: కేంద్రం అందిస్తోన్న ‘నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు ఇంటర్ పాసైన విద్యార్థులు ఈనెల 31 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లై చేసుకున్నవారు ఇదే గడువులోగా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది టాప్-20 పర్సంటైల్ వచ్చిన విద్యార్థులు 59,355 మంది ఉన్నారని తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ <>వెబ్‌సైట్‌<<>>ను సందర్శించండి.

News October 8, 2024

నేడే రిజల్ట్స్: గెలుపెవరిదో?

image

హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్‌ కూటమికే అనుకూలంగా రాగా బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. దీంతో ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొంది.

News October 8, 2024

శ్రీవారి గరుడోత్సవం.. 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం నేడు జరగనుంది. దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో RTC బస్సులలో వారిని కొండపైకి తరలించేందుకు TTD అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టూవీలర్స్, టాక్సీలను కొండపైకి నిషేధించారు. కాగా గరుడు వాహన సేవ సా.6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.