News October 8, 2024

పోలవరం సందర్శకుల ఖర్చులకు రూ.23 కోట్లు విడుదల

image

AP: గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలను పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి ఉచితంగా భోజనాలు పెట్టేవారు. దీనికి సంబంధించి 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. వారు హైకోర్టును ఆశ్రయించగా 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీంతో మొత్తం రూ.23.11 కోట్ల నిధుల విడుదలకు జలవనరుల శాఖ తాజాగా ఆమోదం తెలిపింది.

Similar News

News December 11, 2025

‘అలాంటి వరి రకాల సాగును ప్రోత్సహించాలి’

image

ప్రజలు ఎక్కువగా ఆహారంగా తీసుకునే వరి రకాల సాగును ప్రోత్సహించడంతో పాటు వాటి కొనుగోలు, అంతర్జాతీయంగా ఎగుమతికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఉల్లి కొనుగోలు నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. సుబాబుల్ రైతులకు మంచి ధర దక్కేలా చూడాలన్నారు. అరటి, నిమ్మ, ఇతర ఉద్యానపంటల కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు.

News December 11, 2025

తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేటు!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 110 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.100 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,09,000గా ఉంది. సిల్వర్ రేటు నాలుగు రోజుల్లోనే రూ.13,100 పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 11, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరో నోటిఫికేషన్ విడుదల

image

<>భారత్<<>> ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నవీ ముంబై 4 డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) అర్హతగల వారు డిసెంబర్ 31వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.472. జీతం నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000వరకు చెల్లిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.