India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. ఆమె కోసం 30 నిమిషాల సంగీత ప్రదర్శన వీడియోను రేపు విడుదల చేయనున్నారు. దక్షిణాసియా నుంచి హారిస్‌కు మద్దతునిచ్చిన తొలి కళాకారుడు ఆయనే కావడం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెల 5న జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమొక్రాట్ పార్టీ తరఫున హారిస్ పోటీ పడుతున్నారు.

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ ‘కోహీనూర్’ పేరుతో కొత్త సినిమాను ప్రకటించారు. ఇవాళ దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో సిద్దూ గెటప్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌పై పార్ట్-1 అని ఉండటంతో ఈ సినిమా రెండు పార్టులుగా రానున్నట్లు తెలుస్తోంది. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం భక్తులకు ఇకపై 17 గంటల పాటు అందుబాటులో ఉండనుంది. మండలం మకరవిళక్కు సీజన్‌ను పురస్కరించుకుని ఉదయం 3 నుంచి మ.ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులంతా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

రామ్ చరణ్‌కు తనకు మధ్య చక్కటి స్నేహం ఉందని అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన కుమార్తె రాహా పేరు మీద ఓ అడవి ఏనుగును దత్తత తీసుకుని చెర్రీ దాని ఆలనాపాలనా చూస్తున్నారని ఆమె కొనియాడారు. దత్తతకు సూచనగా ఓ ఏనుగు బొమ్మను రాహాకు గిఫ్ట్‌గా పంపించారని, రాహా రోజూ ఆ ఏనుగుపైకెక్కి ఆడుకుంటుందని వివరించారు. చెర్రీ, అలియా కలిసి RRRలో జోడీగా నటించిన సంగతి తెలిసిందే.

యూజర్ల కోసం BSNL మరో సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.666తో రీఛార్జ్ చేసుకుంటే 105 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, నిత్యం 2GB హైస్పీడ్ డేటా, 100 SMSల ప్రయోజనాన్ని పొందొచ్చు. జియో, ఎయిర్‌టెల్, VIలో ఇటీవల రీఛార్జ్ ధరలు భారీగా పెరగడంతో BSNLకు పోర్ట్ అవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే నెట్‌వర్క్ సమస్యను పరిష్కరిస్తే మరింతమంది యూజర్లు పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విజయదశమి రోజు సూర్యాస్తమయానికి గంటన్నర ముందుకాలాన్ని విజయ ముహూర్తంగా చెబుతారు. ఆ సమయంలో శమీవృక్షా(జమ్మిచెట్టు)న్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. జమ్మిని ‘అగ్నిగర్భ’ అని కూడా పిలుస్తారు. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అని అర్థం. దీనికే ‘శివా’ అనే మరో పేరుంది. అంటే సర్వశుభకరమైనదని. ‘మహాభారతం’ ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే దాచారు.

TG: ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తే చర్యలు తప్పవని OU రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాలేదని పలు కాలేజీల యాజమాన్యాలు నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించడంతో ఆయన స్పందించారు. డిగ్రీ, పీజీ అకడమిక్ సెమిస్టర్ పరీక్షలు, గ్రూప్-1,2,3 ఉద్యోగాలు, ఇతర రాత పరీక్షలు ఉన్నందున కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతారని చెప్పారు.

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా ఎంపికైన నోయల్ టాటా రతన్ టాటా సవతి తల్లి కొడుకు. రతన్ తండ్రి నావల్ హెచ్ టాటా తొలుత సూనూ కమిశారియట్‌ను పెళ్లాడారు. వీరికి రతన్, జిమ్మీ జన్మించారు. ఆ తర్వాత నావల్ సిమోన్ హెచ్ టాటాను వివాహమాడగా వారికి నోయల్ పుట్టారు. రతన్, జిమ్మీ ఇద్దరూ అవివాహితులే. నోయల్ భార్య ఆలూ మిస్త్రీ షాపూర్‌జీ పల్లోంజీ అధినేత పల్లోంజీ మిస్త్రీ కుమార్తెనే. సైరస్ మిస్త్రీకి స్వయానా సోదరి.

AP: కాకినాడ DFO డి.రవీంద్రనాథ్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. ఇటీవల బదిలీపై కాకినాడకు వచ్చిన ఆయన పవన్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ మైనింగ్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. తన పేరు, పేషీ పేరు వాడటంపై ఆగ్రహించిన పవన్, విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటు తన పేరుతో అవినీతికి పాల్పడితే చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.

దసరా సందర్భంగా పర్యాటకులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి పాపికొండల్లో లాంచీల్లో విహరించేందుకు అధికారులు అనుమతిచ్చారు. వరదల కారణంగా ఐదు నెలల పాటు పాపికొండలు టూరిజంను నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగవ్వడంతో లాంచీ యజమానుల విజ్ఞప్తుల మేరకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.
Sorry, no posts matched your criteria.