News October 24, 2024

సుందర్ వండర్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కుల్దీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ అదరగొడుతున్నారు. మూడేళ్ల తర్వాత టీమ్‌లో చోటు దక్కించుకున్న ఆయన తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు నేలకూల్చారు. సెటిల్‌గా కనిపిస్తున్న రవీంద్రను ఔట్ చేసి వికెట్ల వేటను ప్రారంభించారు. ఏకంగా ఐదుగురిని బౌల్డ్ చేయడం విశేషం. టెస్టుల్లో 5 వికెట్లు తీయడం సుందర్‌కు ఇదే తొలిసారి.

News October 24, 2024

ట్రంప్ నన్ను అసభ్యంగా తాకారు: మాజీ మోడల్

image

అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనను 1993లో అసభ్యంగా తాకారని మాజీ మోడల్ స్టేసీ విలియమ్స్ ఆరోపించారు. ‘న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ నాకు ట్రంప్‌ను తొలిసారి పరిచయం చేశారు. మొదట మామూలుగా పలకరించారు. తర్వాత అసభ్యంగా తాకడం ప్రారంభించారు. భయంతో నాకు నోట మాట రాలేదు. తర్వాత కుమిలిపోయాను’ అని వెల్లడించారు. ఆమె ఆరోపణల్ని ట్రంప్ వర్గం ఖండించింది.

News October 24, 2024

సైకిల్ గుర్తుపై పోటీ చేయ‌నున్న కాంగ్రెస్ అభ్య‌ర్థులు

image

UPలో 9 అసెంబ్లీ స్థానాల‌ ఉపఎన్నిక‌ల్లో పోటీపై ఇండియా కూట‌మి అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. కాంగ్రెస్ అభ్య‌ర్థులు కూడా స‌మాజ్‌వాదీ పార్టీ ‘సైకిల్’ గుర్తు మీద పోటీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు రాహుల్‌తో చ‌ర్చించాక అఖిలేశ్ యాద‌వ్ వెల్ల‌డించారు. సీట్ల పంప‌కాల కంటే గెలుపే ల‌క్ష్యంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. 9 స్థానాల్లో 7 చోట్ల‌ ఎస్పీ, 2 చోట్ల కాంగ్రెస్ అభ్య‌ర్థులు సైకిల్ గుర్తుపై పోటీ చేయనున్నారు.

News October 24, 2024

అందుకే రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం: కిషన్‌రెడ్డి

image

రాష్ట్రాలు వాటా ఇవ్వకపోవడంతో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 40 స్టేషన్లను ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. కాజీపేటలో రూ.680కోట్లతో తయారీ యూనిట్ రాబోతోందన్నారు. రాష్ట్రం నుంచి సహకారం లేకపోయినా రూ.650కోట్లతో MMTS పొడిగిస్తామన్నారు.

News October 24, 2024

గ్రూప్-1, గ్రూప్-2పై ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ ఆరా

image

AP: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం పెండింగ్ లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో రివ్యూ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 సహా పలు పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీశారు. కొత్తగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లపై వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటామని అనురాధ తెలిపారు.

News October 24, 2024

వాంతులు, విరేచ‌నాల‌తో ఇద్ద‌రు మృతి.. మంత్రి కీలక ఆదేశాలు

image

AP: ప‌ల్నాడు(D) దాచేప‌ల్లిలో వాంతులు, విరేచ‌నాల‌తో ఇద్ద‌రు వ్య‌క్తుల మృతిపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ నిర్వహించారు. వారి మృతికి నీరు క‌లుషితం కావ‌డమే కారణమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. స్థానికంగా ఉన్న బోర్ల‌లో నీటిని విజ‌య‌వాడ ల్యాబ్‌కు ప‌రీక్ష‌ల‌కు పంపాల‌ని ఆదేశించారు. బోర్ల‌ను మూసివేసి వాట‌ర్ ట్యాంక‌ర్ల ద్వారా తాగునీరు స‌ర‌ఫ‌రా చేయాల‌ని సూచించారు. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.

News October 24, 2024

పుష్ప-2 రిలీజ్‌పై అధికారిక ప్రకటన

image

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప-2’. ఈ సినిమా అధికారిక విడుదల తేదీని వెల్లడిస్తూ హీరో అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతకుముందు ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

News October 24, 2024

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు

image

ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 800
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 708
జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) – 704
అనిల్ కుంబ్లే (భారత్) – 619
స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) – 604
గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563
అశ్విన్ రవిచంద్రన్ (ఇండియా) – 531
నాథన్‌ లయోన్‌ (ఆస్ట్రేలియా) – 530

News October 24, 2024

VIRAL: నర్సరీ ఫీజు రూ.1.51లక్షలు!

image

ఓ ప్రైవేట్ స్కూల్‌లో నర్సరీకి రూ.1.51లక్షల ఫీజు అని తెలిపే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ Xలో పోస్ట్ చేశారు. ‘ఇందులో పేరెంట్ ఓరియంటేషన్ ఫీజు రూ.8,400 అని ఉంది. డాక్టర్ కన్సల్టేషన్ కోసం ఈ ఫీజులో కనీసం 20% చెల్లించేందుకు కూడా పేరెంట్స్ ఆసక్తి చూపించరు. అందుకే నేనిప్పుడు ఓ స్కూల్‌ను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా’ అని ఆ డాక్టర్ పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?

News October 24, 2024

ఇండియన్ కార్స్‌లో స్టీరింగ్ కుడివైపు ఎందుకు?

image

భారతదేశంతో పాటు జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కార్లకు కుడివైపున స్టీరింగ్ ఉంటుంది. అమెరికాలో మాత్రం ఎడమ వైపు ఉంటుంది. దీనికి వివిధ కారణాలున్నాయి. ప్రాచీనకాలంలో రవాణాకు గుర్రాలు వాడేవారు. ఎడమవైపు నుంచి ఎక్కి కుడిచేత్తో గుర్రాన్ని కంట్రోల్ చేసేవాళ్లు. జెట్కాలూ ఎడమవైపు నడిచేవి. దీంతోపాటు ఆంగ్లేయుల కాలంలో బ్రిటన్ నుంచి కార్లు దిగుమతి చేసుకోవడంతో అక్కడి ఆచారమే మనకూ వచ్చిందని అంటుంటారు.