India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ఇవాళ సా.4 గంటలకు జనసేన పార్టీలో చేరనున్నారు. పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆమెకు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. ఆమెతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు నుంచి పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాలు ఇవే..
కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, MBNR, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిజామాబాద్, సిరిసిల్ల, RR, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇదేరోజున 2023 WCలో BANతో జరిగిన మ్యాచ్‌లో వివిధ రికార్డులు నెలకొల్పారు. ఈ మ్యాచులో విరాట్ 78వ సెంచరీ చేసి అత్యంత వేగంగా 26వేల ఇంటర్నేషనల్ రన్స్ పూర్తిచేశారు. దీంతో ఆయన WCలో వెయ్యి పరుగులు చేసిన మొదటి NO.3 ఇండియన్ బ్యాటర్‌గా నిలిచారు. ICC వైట్‌బాల్ ఈవెంట్‌లలో అత్యధిక రన్స్ & అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ రికార్డులను ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.

TG: నిజమైన స్నేహం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని నొక్కి చెప్పారు. హరియాణా, J&K ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపింది వాస్తవం కాదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ ఏమైందన్నారు. BRS, కాంగ్రెస్ మధ్య స్నేహం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

బాంబు బెదిరింపు కాల్స్‌తో ఎయిర్‌లైన్స్ కంపెనీల చమురు వదులుతోంది! ఒక్కో నకిలీ కాల్ వల్ల రూ.3 కోట్ల వరకు నష్టపోతున్నట్టు అంచనా. దారి మళ్లిస్తే అదనపు ఫ్యూయల్ కోసం రూ.కోటి వరకు ఖర్చవుతోంది. ఇక ఫ్లైట్ ల్యాండింగ్, ఎయిర్‌పోర్ట్ పర్మిషన్లు, ప్రయాణికులకు లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, ఇతర అవసరాలకు మరో రూ.2కోట్లు కావాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 40 ఫేక్ కాల్స్ వల్ల కంపెనీలపై రూ.60-80కోట్ల అదనపు భారం పడింది.

AP: రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని, అదే ఏకైక రాజధాని అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. అమరావతి కోసం 54వేల ఎకరాలు సేకరిస్తే గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసిందని దుయ్యబట్టారు. రైతులను అడుగడుగునా అణగదొక్కినా వాళ్లు అద్భుతంగా పోరాడారని పేర్కొన్నారు.

TG: పోరాటాలకు మారు పేరు నల్గొండ జిల్లా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా పాత్ర కీలకమని చెప్పారు. జిల్లా ప్రజలది దొరలు చెప్తే వినే రక్తం కాదన్నారు. బీఆర్ఎస్‌లా కాకుండా తాము చేసేదే చెప్పి అధికారంలోకి వచ్చామన్నారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధి కోసమే సీఎం పర్యటనలు చేస్తున్నారన్నారు.

AP: సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలను నిజాం, బ్రిటిష్ వాళ్లు అభివృద్ధి చేస్తే తాను మూడో నగరం సైబరాబాద్‌ను తీర్చిదిద్దానని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలోనే నంబర్-1 సిటీగా హైదరాబాద్‌ను మార్చామన్నారు. అప్పట్లోనే 8 లేన్ల రోడ్లకు రూపకల్పన చేస్తే అందరూ ఆశ్చర్యపోయారని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో అందరూ ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు అమరావతిని కూడా గొప్పగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

TG: పంట ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రబీ నుంచి పంట బీమాకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన MSPకే పంట కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతు భరోసాపై సబ్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీని ఆధారంగా రబీ సీజన్ నుంచి ఎకరాకు రూ.7,500 చెల్లించేందుకు సిద్ధంగా ఉందన్నారు. పంట వేసిన వారికే డబ్బులు చెల్లించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు.

రంజీ ట్రోఫీలో మహారాష్ట్రతో జరుగుతున్న టెస్టులో ముంబై తొలి ఇన్నింగ్సులో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ అయుష్(176), శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగారు. దీంతో 200 పరుగులకు పైగా ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్సులో మహారాష్ట్ర 126 పరుగులకే ఆలౌటైంది. కాగా శ్రేయస్‌కు ఇది 14వ ఫస్ట్ క్లాస్ సెంచరీ.
Sorry, no posts matched your criteria.