India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న కూలీల కనీస వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.300గా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) కనీస వేతనం రూ.272గా అమలు చేస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.28 జోడించి ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రూ.300 ఇవ్వనున్నారు.
AP: ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సదరం స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో స్లాట్లు బుక్ చేసుకోవచ్చని, వీరికి ఏప్రిల్ 8 నుంచి ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ENT వైద్యులు టెస్టులు చేసి అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు.
AP: అనపర్తి టికెట్‌ను BJPకి కేటాయించడంతో TDP మాజీ MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఐదేళ్లపాటు రాక్షసులతో యుద్ధం, నాపై 39 అక్రమ కేసులు, 400 మంది కార్యకర్తలపై 180కి పైగా కేసులు, 24/7 ప్రజల కోసమే పోరాటం.. ఇవేమీ కాపాడలేకపోయాయి. మాట మాత్రం చెప్పకుండా ఇచ్చిన టికెట్‌ను లాగేసుకున్నారు. కార్యకర్తలను కాపాడుకోవడానికి ఇవాళ ఉ.9 గంటలకు కఠిన నిర్ణయం తీసుకోబోతున్నా’ అని ట్వీట్ చేశారు.
TG: రాష్ట్రంలోని టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పెంచిన టెట్ ఫీజును తగ్గించనున్నట్లు సమాచారం. ఫీజుల పెంపు వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో ఒక పేపర్‌కు రూ.200 ఉండగా రూ.1000, రెండు పేపర్లకు రూ.300 ఉండగా రూ.2000 వరకు పెంచారు. దాదాపు 3 లక్షల మంది టెట్ రాయనున్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు(కేకే) కారు దిగి ‘చేయి’ అందుకునే అవకాశాలున్నట్లు సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరడంపై యోచిస్తున్నానని కేకే కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే వెల్లడించారు. ఆమెతోపాటు కేకే కూడా వెళ్లే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. 2రోజుల క్రితం కేసీఆర్ ఫోన్ చేసి మరీ రావాలని పిలిచినా కేకే వెళ్లలేదని తెలుస్తోంది.
నిన్న SRHపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య తేలిపోయారని పఠాన్ బ్రదర్స్ విమర్శించారు. 11 ఓవర్లకు 160+ స్కోర్ ఉన్నప్పుడు బుమ్రాకు కేవలం ఒక్క ఓవరే ఇవ్వడం ఏంటని యూసుఫ్ పఠాన్ ప్రశ్నించారు. లక్ష్యఛేదనలో మిగతా బ్యాటర్ల 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తుంటే కెప్టెన్ హార్దిక్ 120 SRతో ఆడారని ఇర్ఫాన్ ట్వీట్ చేశారు. అలాగే యంగ్ బౌలర్ల నైపుణ్యాన్ని వృథా చేయవద్దని సూచించారు.
గత వారం రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 140మంది చనిపోగా 182మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. అయితే, అధికారుల జాబితాలో లేని మరో 95మంది ఆచూకీ లభ్యం కావడంలేదని బాజా న్యూస్ ఛానల్ తెలిపింది. ఈ మేరకు తమ శోధనలో తేలిందని పేర్కొంది. తమవారేమయ్యారో తెలియడం లేదంటూ గల్లంతైన వారి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించింది.
ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని ఆప్ నేతలు చెబుతూ వస్తున్నారు. తాజాగా దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ‘జైలు నుంచి ప్రభుత్వ పాలన జరగదు. ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను’ అని తెలిపారు. మరోవైపు కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 3కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
TS: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నేటి ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1439 ఓటర్ల కోసం జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే నెల 2న ఓట్లు లెక్కిస్తారు.
IPLలో భాగంగా ఈరోజు రాత్రి 7.30గంటలకు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. జైపూర్‌లోని RR హోం గ్రౌండ్‌లోనే ఈ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ ఆల్రెడీ ఓ మ్యాచ్ గెలవగా, ఢిల్లీ ఖాతా తెరవాల్సి ఉంది. ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ హోం టీమ్సే గెలిచాయి. ఆ ట్రెండ్‌ను మార్చాలని ఢిల్లీ భావిస్తోంది. ఆ జట్టులో తొలి మ్యాచ్‌కు దూరమైన బౌలర్ ఎన్రిచ్ నోకియా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు.
Sorry, no posts matched your criteria.