News November 8, 2024
మూసీ నీళ్లతో కడిగినా నీ నోరు మురికి పోదు: హరీశ్
KCR కాలిగోటికి కూడా సరిపోని రేవంత్ <<14562919>>CM<<>> స్థాయి దిగజారి మాట్లాడుతున్నారంటూ హరీశ్ రావు మండిపడ్డారు. ‘కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి పద్యం CMకు సరిగ్గా సరిపోతుంది. KCRపై నువ్వు చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయం. మూసీ నీళ్లతో కడిగినా నీ నోరు మురికి పోదు. నీ దొంగబుద్ధిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తాం. ప్రగల్భాలు మాని పరిపాలనపై దృష్టి పెట్టు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 8, 2024
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.33 కోట్లు
TG: రిటైర్డ్ కార్మికులు, అధికారులకు సింగరేణి సంస్థ శుభవార్త చెప్పింది. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 మధ్య పదవీ విరమణ చేసిన వారికి లాభాల్లో వాటాగా రూ.33 కోట్లను చెల్లిస్తామని ప్రకటించింది. ఈ నెల 12న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎండీ బలరామ్ తెలిపారు.
News December 8, 2024
భారత్ ఆలౌట్.. ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే..
డే నైట్ టెస్టులో తమకున్న తిరుగులేని రికార్డును ఆస్ట్రేలియా నిలబెట్టుకుంది. అడిలైడ్ టెస్టులో ఘనవిజయం దిశగా సాగుతోంది. 175 పరుగులకే భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. మరోసారి నితీశ్ కుమార్ రెడ్డి(42) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు, కమిన్స్ 5, బోలాండ్ 3 వికెట్లు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 19 పరుగులు.
News December 8, 2024
ప్రభుత్వం ఏడాదిలో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు: హరీశ్ రావు
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో ఇళ్లను కూల్చిందని, కానీ ఒక్క ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2,500 వంటి హామీలను అమలు చేయలేదని అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారని, కానీ బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.