News November 10, 2024

ఆ బోర్డు నాలుగు అక్షరాల క్రూరత్వం: కేంద్రమంత్రి

image

వక్ఫ్ బోర్డుపై కేంద్ర మంత్రి సురేశ్ గోపి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అది ఒక నాలుగు ఆంగ్ల అక్షరాల ‘క్రూరత్వం” అని అన్నారు. కేరళలోని మునంబామ్‌లో క్రిస్టియన్లకు చెందిన 400 ఎకరాలు తమకు చెందుతాయని వక్ఫ్ బోర్డు అనడాన్ని తప్పుబట్టారు. త్వరలో వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మండిపడింది. ప్రజలను విభజించి పాలించే ప్రకటనలు మానుకోవాలంది.

News November 10, 2024

అంగన్వాడీలను GOVT ఉద్యోగులుగా పరిగణించాలి.. గుజరాత్ హైకోర్టు

image

అంగన్వాడీ సిబ్బందిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. నాలుగో తరగతి కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ₹15K ఇస్తుంటే అంగన్వాడీలకు ₹5-10K గౌరవ వేతనమే ఇస్తున్నారని పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో వారిని GOVTసర్వీసులోకి తీసుకుని పే స్కేల్ గురించి పేర్కొనాలని ధర్మాసనం తీర్పుఇచ్చింది. ఇది అమలైతే దేశవ్యాప్తంగా ప్రభావం చూపనుంది.

News November 10, 2024

ప్రభాస్ ‘సలార్-2’లో కొరియన్ నటుడు?

image

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న ‘సలార్-2’లో కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ నటించనున్నట్లు సమాచారం. తాజాగా ఆయన ‘సలార్-2’ పోస్టర్‌ను ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టుకోవడంతో ఈ మూవీలో నటించనున్నారనే చర్చ మొదలైంది. ‘ది ఔట్‌లాస్’, ‘ది గ్యాంగ్ స్టర్’, ‘అన్‌స్టాపబుల్’, ‘ఛాంపియన్’ వంటి హాలీవుడ్, కొరియన్ చిత్రాల్లో ఆయన నటించారు. అంతకుముందు స్పిరిట్‌లోనూ డాన్ లీ నటిస్తారనే చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

News November 10, 2024

నీతులు వల్లించడం మీకే చెల్లింది: VSR

image

AP: వ్యక్తిత్వ హననం చేస్తూ నీతులు వల్లించడం మీకే చెల్లిందంటూ CM చంద్రబాబుపై YCP ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ‘ప్రధాని మోదీ సతీమణి గారిని బహిరంగంగానే నిందించింది ఎవరు? ప్రధాని తల్లిగారిని ప్రస్తావించింది ఎవరు? YSR కుమార్తెను వేధించేందుకు ఇంటి నుంచి వెబ్‌సైట్లు నడిపింది ఎవరు? వీటికన్నా ముందే సొంత మామను నగ్నంగా చిత్రీకరించింది(కార్టూన్స్‌ని ఉద్దేశించి) ఎవరు?’ అని నిలదీశారు.

News November 10, 2024

‘గేమ్ ఛేంజర్’ నుంచి రెండు ట్రైలర్లు?

image

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం నుంచి రెండు ట్రైలర్లు వస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో చరణ్ లుక్స్, తమన్ బీజీఎంకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వానీ, కీలక పాత్రలో అంజలి కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.

News November 10, 2024

SALT: 5 మ్యాచుల్లోనే 3 సెంచరీలు బాదేశాడు

image

ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ వెస్టిండీస్‌కు కొరకరాని కొయ్యగా మారారు. ఆ జట్టుపై ఆడిన 5 టీ20ల్లోనే ఏకంగా 3 సెంచరీలు బాదారు. అలాగే ఓ ఫిఫ్టీ కూడా సాధించారు. ఐదు మ్యాచుల్లో కలిపి సాల్ట్ 456 పరుగులు చేశారు. కాగా సాల్ట్ గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ తరఫున ఆడారు. ప్రస్తుతం అతడిని ఆ జట్టు మెగా వేలానికి వదిలేసింది. వేలంలో అతడు ఎంతకు అమ్ముడుపోవచ్చో కామెంట్ చేయండి.

News November 10, 2024

పాల బకాయిలు రూ.50 కోట్లు విడుదల.. త్వరలోనే అకౌంట్లోకి

image

TG: విజయ డెయిరీకి పాలు విక్రయించే రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఓ నెల పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం రూ.50.65 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించింది. మరో నెల బకాయిలనూ త్వరలోనే చెల్లిస్తామని తెలిపింది. పాడి రైతుల నుంచి రోజూ 4.40లక్షల లీటర్లను విజయ డెయిరీ కొనుగోలు చేస్తోంది. నిధుల కొరత కారణంగా కొన్ని నెలలుగా చెల్లింపుల్లో ఇబ్బందులు వస్తున్నాయి.

News November 10, 2024

TCS: ఆఫీసుకొస్తేనే అధిక బోనస్

image

ఉద్యోగులను ఆఫీస్‌కు రప్పించేందుకు TCS బోనస్‌తో లింక్ పెట్టింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కార్యాలయ హాజరు 85 శాతం పైన ఉన్నవారికి పూర్తి వేరియబుల్ పే అందుతుందని ప్రకటించింది. హాజరు 60-75 శాతం ఉంటే 50%, 75-85 శాతం ఉంటే 75% బోనస్ ఇస్తామని తెలిపింది. అదేసమయంలో సీనియర్ ఉద్యోగులు కొందరికి బోనస్‌లో 20-40%, మరికొందరికి 100% కోత విధించినట్లు సమాచారం.

News November 10, 2024

త్వరలో కలెక్టర్ల సదస్సు

image

AP: శాసనసభ సమావేశాల అనంతరం కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. తొలిసారి జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని ఇప్పటికే సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. కాగా రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్స్ 11 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.

News November 10, 2024

సజ్జల భార్గవ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

image

AP: వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ రెడ్డిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌తో పాటు వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రశ్నించడంతో తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే ఓ కేసులో వర్రా కోసం పోలీసులు గాలిస్తున్నారు.