News March 27, 2024

18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విజృంభిస్తున్నారు. ముంబైతో మ్యాచ్‌లో సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతున్నారు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా కేవలం 18 బంతుల్లోనే 52* రన్స్ చేశారు. అందులో 2 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. SRH చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

News March 27, 2024

167 మంది అభ్యర్థులను ప్రకటించిన కూటమి

image

AP: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సిద్ధమవుతోంది. అందులో భాగంగా మొత్తం 175 స్థానాలకు గానూ 167 మంది అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ప్రకటించింది. టీడీపీ ఐదు స్థానాలు, జనసేన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

News March 27, 2024

సుప్రియ, ఘోష్‌కు EC నోటీసులు

image

కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనతే, బీజేపీ లీడర్ దిలీప్ ఘోష్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై ‘వేశ్య’ అని సుప్రియ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ‘ఎవరి కూతురో’ అనే అర్థం వచ్చేలా అభ్యంతరకరంగా మాట్లాడినందుకు బీజేపీ లీడర్ దిలీప్ ఘోష్‌కు సైతం EC నోటీసులిచ్చింది.

News March 27, 2024

నామినేషన్ వేసిన MP అభ్యర్థికి ED సమన్లు

image

శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ అభ్యర్థి అమోల్ కీర్తికర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కరోనా సమయంలో వలస కార్మికులకు ఆహారం పంపిణీకి సంబంధించి కాంట్రాక్టుల అప్పగింతలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. కాగా.. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే అతణ్ని భయపెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఈడీతో నోటీసులు పంపించినట్లు శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు.

News March 27, 2024

బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ నటి

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండు స్థానాలతో ఏడో జాబితాను విడుదల చేసింది. మహారాష్ట్రలోని అమరావతి నుంచి నటి నవనీత్ కౌర్ రాణా పోటీ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ గెలిచారు. తర్వాత BJPలో చేరారు. ఇక కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి గోవింద్ కర్జాల్ బరిలో నిలిచారు. హరియాణాలోని కర్నాల్ నుంచి ఆ రాష్ట్ర సీఎం నాయబ్ సింగ్ సైనీ పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది.

News March 27, 2024

నాపై యుద్ధానికి చెల్లెల్ని కూడా తీసుకొచ్చారు: జగన్

image

AP: ప్రత్యర్థులంతా ఒక్కటై తనపై యుద్ధం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ‘టీడీపీ, బీజేపీ, దత్తపుత్రుడు కలిసిపోయారు. చంద్రబాబుకి శవరాజకీయాలు, కుట్రలు అలవాటు. నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా చెల్లెల్ని కూడా తీసుకొచ్చారు. ఒంటరిగా వచ్చే ధైర్యం ఒక్కరికి కూడా లేదు. మోసాలు చేసే కూటమి మనకు ప్రత్యర్థిగా ఉంది. వారికి నైతిక విలువలు లేవు’ అని జగన్ మండిపడ్డారు.

News March 27, 2024

ఆస్ట్రేలియాలో భారత్-పాక్ సిరీస్?

image

భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ను నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ఆసక్తి చూపుతోంది. ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇందుకు BCCI, PCB అంగీకరిస్తే సిరీస్ నిర్వహిస్తామని తెలిపింది. భారత్-పాక్ జట్లు తమ దేశంలో పోటీ పడాలని ప్రపంచంలోని ప్రతీ దేశం కోరుకుంటుందని.. తాము కూడా అలాగే భావిస్తున్నామని పేర్కొంది.

News March 27, 2024

AP BJP ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల

image

ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఎచ్చెర్ల-ఈశ్వరరావు, విశాఖ నార్త్-విష్ణుకుమార్ రాజు, అరకు వ్యాలీ-రాజారావు, అనపర్తి-శివకృష్ణంరాజు, కైకలూరు-కామినేని శ్రీనివాస్, విజయవాడ వెస్ట్-సుజనా చౌదరి, బద్వేల్-బొజ్జ రోశన్న, జమ్మలమడుగు-ఆదినారాయణరెడ్డి, ఆదోని-పార్థసారథి, ధర్మవరం నుంచి వై.సత్యకుమార్ పోటీ చేయనున్నారు.

News March 27, 2024

విశాఖ డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం జగన్

image

AP: విశాఖ డ్రగ్స్ కేసుపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. ‘చంద్రబాబు వదినగారి చుట్టం కంపెనీలో డ్రైఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తుంటే సీబీఐ రైడ్స్ చేసింది. దీంతో ఎల్లో బ్రదర్స్ అంతా ఉలిక్కిపడ్డారు. తీరా చూస్తే సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి కొడుకు, వియ్యంకుడు ఆ కంపెనీకి డైరెక్టర్లు. వారు బాబు బంధువులు. నేరం చేసింది వారు.. తోసేది మన మీదికి’ అని జగన్ మండిపడ్డారు.

News March 27, 2024

హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన

image

TG: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాధే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా హైకోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల స్థలాన్ని, బడ్జెట్‌లో రూ.1000 కోట్లను కేటాయించింది.