India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్లు క్వింటన్ డికాక్, అన్రిచ్ నోకియాకు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాక్ ఇచ్చింది. 2024-25 సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వీరిద్దరినీ తప్పించింది. తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు లిస్టులో వీరిద్దరి పేర్లను చేర్చలేదు. అలాగే బర్గర్, జార్జి తొలిసారి కాంట్రాక్టు దక్కించుకున్నారు. కాగా ఐపీఎల్‌లో LSGకి డికాక్, DCకి నోకియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ 13 వరకు గడువు ఉంది. ECE – 5, EEE – 7, మెకానికల్ – 13, CSE – 5 పోస్టులున్నాయి. జీతం రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక <
> SHARE
జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మండ్య పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీతో పొత్తులో భాగంగా తమ పార్టీ మండ్య, కోలార్, హాసన్ స్థానాల నుంచి పోటీ చేస్తుందని కుమారస్వామి స్పష్టం చేశారు. 28 ఎంపీ స్థానాలు ఉన్న కర్ణాటకలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాన్ ఈ నెల 24న భూమిని తాకింది. గత 6 ఏళ్లలో భూమిని తాకిన అతి బలమైన భూ అయస్కాంత తుఫాన్ ఇదేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దీని కారణంగా విద్యుత్ గ్రిడ్‌లు, నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్‌లలో చిన్న చిన్న అంతరాయాలు కలిగాయని NOAA స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ సమైక్యత కోసం సోనియా, రాహుల్ గాంధీ PM పీఠాన్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. 2004లో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన సోనియా.. మన్మోహన్‌ను ప్రధానిని చేశారని గుర్తు చేశారు. అప్పుడు MPలు, UPA కూటమిలోని పార్టీలన్నీ సోనియానే PM కావాలని కోరుకున్నాయని వెల్లడించారు. కానీ, ఓ ఆర్థికవేత్త కోసం ఆమె ప్రధాని పీఠం త్యాగం చేశారని అన్నారు.
ఫ్లోరిడా ప్రభుత్వం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ దేశంలో 14ఏళ్ల లోపు వారు సోషల్ మీడియా వాడటాన్ని నిషేధించింది. ఈమేరకు ఆ దేశ చట్ట సభలో ఆమోదించిన బిల్లుకు ఫ్లోరిడా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా.. ఇది పిల్లల వాక్ స్వాతంత్ర్యం, తల్లిదండ్రుల హక్కులను హరించే చర్య అని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు రికార్డు సృష్టించింది. వయాటినా-19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవీస్ అనే ఆవు రూ.40 కోట్లకు అమ్ముడై ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. అత్యంత నాణ్యమైన జన్యులక్షణాలు గల నెల్లూరు జాతి ఆవును సొంతం చేసుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈనగలగడం ఈ జాతి ఆవుల ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.
★ న్యూయార్క్- 119 మంది
★ లండన్- 97
★ ముంబై- 92
★ బీజింగ్- 91
★ షాంఘై- 87
★ షెన్జెన్- 84
★ హాంకాంగ్- 65
★ మాస్కో- 59
★ ఢిల్లీ- 57 ★ శాన్ ఫ్రాన్సిస్కో- 42
CSK: రుతురాజ్(C), రచిన్ రవీంద్ర, రహానే, మిచెల్, శివమ్ దూబే, జడేజా, రిజ్వీ, ధోనీ, దీపక్ చాహర్, తుషార్, ముస్తాఫిజుర్ రెహమాన్. (IMP: రషీద్, శాంట్నర్, పతిరణ, నిశాంత్ సింధు, శార్దూల్)
GT: సాహా, గిల్(C), అజ్మతుల్లా ఒమర్జాయ్, మిల్లర్, విజయ్ శంకర్, తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్. (IMP: సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, నూర్ అహ్మద్, మానవ్ సుతార్, శరత్)
TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉంటున్న BRS ఎమ్మెల్సీ కవితకు కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటి భోజనం, మంచం, పరుపులు, చెప్పులు, దుస్తులు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పెన్ను, పేపర్లు, నగదు, మందులు తీసుకెళ్లేందుకు అంగీకరించింది. కాగా ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
Sorry, no posts matched your criteria.