India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హోలీ పండుగ వేళ అయోధ్యలోని బాల రాముడి ఫొటోలను మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫొటో వచ్చేసింది. మీ ఒక్క ఓటు కారణంగా రామ్‌లల్లా తన ఇంట్లో హోలీని ఘనంగా చేసుకుంటున్నారు. ఈ అలంకరణ, ఈ అందం ఈ ఆకర్షణీయమైన రూపం ప్రజల్లో వికసిస్తోంది. ఈ చారిత్రక బహుమతి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి థ్యాంక్స్’ అని ఆయన పేర్కొన్నారు.
‘ఇనిమేల్’ మ్యూజిక్ వీడియోతో అభిమానుల ముందుకు వచ్చిన హీరోయిన్ శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నాన్న అనే కారణంతోనే కమల్ హాసన్‌తో కలిసి పనిచేయడం లేదని శ్రుతి చెప్పారు. ఆయన కష్టపడి పనిచేస్తారని.. ఈ సాంగ్ కోసం పది రకాల లిరిక్స్ ఇచ్చారని తెలిపారు. ‘వాటిలో ఇదెలా ఉంది?.. అదెలా ఉంది? అని అడుగుతారే తప్ప.. ఇదే బాగుందని చెప్పరు’ అని పేర్కొన్నారు. అందుకే ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తానన్నారు.
AP: బీఈడీ కాలేజీల్లో స్పాట్, కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. యాజమాన్య కోటాలో మిగిలిన సీట్లను స్పాట్ కింద ఏప్రిల్ 12లోపు భర్తీ చేయాలని సూచించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు కౌన్సిలింగ్ నిర్వహించాలంది. EWS కోటా సీట్లను స్థానికులతోనే భర్తీ చేయాలని స్పష్టం చేసింది.
వెబ్‌సైట్: <
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన 2,253 పోస్టులకు దరఖాస్తు చేసేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ 1930, పర్సనల్ అసిస్టెంట్ 323 పోస్టులున్నాయి. బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయోపరిమితి, జీతభత్యాలు, పరీక్షా విధానం, ఇతర వివరాలకు https://upsc.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
విరాట్ కోహ్లీలో క్రికెట్ పట్ల ఆకలి ఏమాత్రం తగ్గలేదని ఆయన ఆర్సీబీ సహచరుడు డుప్లెసిస్ అన్నారు. ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నారని కితాబిచ్చారు. ‘పంజాబ్‌తో మ్యాచ్‌లో విరాట్ చాలా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈమధ్య కొన్ని నెలల విరామం తీసుకోవడంతో తాజాగా ఉన్నారు. బాగా ఆడాలనే తపన అతడిలో కనిపిస్తోంది’ అని వెల్లడించారు.
TG: ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌ను బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో 16 కేంద్రాల్లో 20 వేల మంది అధ్యాపకులు వాల్యూయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. నాణ్యమైన మూల్యాంకనం కోసం ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్లు మాత్రమే ఇస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. సామాజిక సమీకరణాలతోపాటు పార్టీకి చేటు తెచ్చేలా మాట్లాడిన వారిపై వేటు వేసింది. గత ఎన్నికల్లో 3 లక్షల నుంచి 6 లక్షల మెజార్టీతో గెలిచిన 39 మందిని పక్కనపెట్టింది. వారిలో సంజయ్ భాటియా(కర్నాల్), రంజనాబెన్(వడోదరా), పర్వేష్(పశ్చిమ ఢిల్లీ), హన్స్‌రాజ్(వాయవ్య ఢిల్లీ), అనంత కుమార్(ఉత్తర కన్నడ) ఉన్నారు.
ఐపీఎల్ 2024లో హోమ్ టీమ్‌లదే హవా నడుస్తోంది. ఆయా జట్లు సొంత వేదికల్లో విజయాలను నమోదు చేశాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచులు జరగగా వీటిలో ఆతిథ్య జట్లే గెలుపొందడం గమనార్హం. మరి ఇవాళ చెపాక్ వేదికగా చెన్నై, గుజరాత్ మ్యాచులో ఈ జోరుకు బ్రేక్ పడుతుందేమో వేచి చూడాలి.
ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు HCL హెల్త్ కేర్ తెలిపింది. దేశవ్యాప్తంగా 56వేల మందికి మెడికల్ టెస్టులు చేయగా, 77% మందికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. 22% మంది ఊబకాయం, 17% ప్రిడయాబెటిస్, 11% రక్తహీనతతో బాధపడుతున్నారని వెల్లడైంది. జంక్ ఫుడ్స్, గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం, సరైన డైట్ పాటించకపోవడం, నిద్రలేమి, ఆల్కహాల్, సిగరెట్ల వల్ల సంతానలేమి సమస్యా పెరుగుతోందట.
TG: నిన్న హోలీ పండుగ పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేర్వేరు ఘటనల్లో 17 మంది దుర్మరణం పాలయ్యారు. రంగులు చల్లుకున్న తర్వాత స్నానానికి నదులు, వాగులు, చెరువుల్లోకి దిగి 16 మంది మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడుగురు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఆరుగురు, రంగారెడ్డిలో ఇద్దరు, జగిత్యాలలో ఒకరు మృతి చెందారు. నారాయణపేటలో నీటి ట్యాంక్ కూలి ఓ చిన్నారి కన్నుమూసింది.
Sorry, no posts matched your criteria.