News September 28, 2024

డిగ్రీ పూర్తైన వారికి ALERT

image

AP: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ MLA ఎన్నికలకు SEP 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం-18లో పాస్‌పోర్ట్ ఫొటో, గెజిటెడ్ ఆఫీసర్‌తో ధృవీకరించిన డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్, ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు జతపరచాలి. 2021 జూన్‌లోపు డిగ్రీ పూర్తైనవారు దరఖాస్తుకు అర్హులు. 10+2+3 విధానంలో పాసైన వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవాలి. టెన్త్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివిన వారు అనర్హులు.

News September 28, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

News September 28, 2024

ఆరోగ్యంపై అవన్నీ అపోహలే: వైద్యులు

image

అధిక రక్తపోటు ఉన్నవారికి తలపోటు వస్తుందని, మెటికలు విరిస్తే కీళ్లవాతం తప్పదని, గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది భావిస్తారు. అవి అపోహలేనంటున్నారు వైద్యులు. ఎటువంటి లక్షణాలూ లేకపోయినా హైబీపీ ఉండొచ్చని, ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. మెటికలు విరిచినంత మాత్రాన కీళ్లవాతం రాదని, గుడ్డు తిన్నంత మాత్రాన కొవ్వు పెరగవని స్పష్టం చేశారు.

News September 28, 2024

మూసీ ప్రాంతంలో హైడ్రా ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు: రంగనాథ్

image

AP: హైడ్రా గురించి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి కూల్చివేతను హైడ్రాకు ఆపాదిస్తున్నారని అన్నారు. ‘మూసీ పరివాహక ప్రాంతంలో రేపు భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీకి సంబంధించి ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. అక్కడ మేం ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. కూకట్‌పల్లిలో మహిళ ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదు’ అని తెలిపారు.

News September 28, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: సెప్టెంబర్ 28, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:07 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:27 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:07 గంటలకు
✒ ఇష: రాత్రి 7.19 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 28, 2024

మంత్రి పొంగులేటి ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు

image

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌తో పాలు పొంగులేటికి చెందిన పలు ఆఫీసుల్లోనూ ఈడీ సోదాలు చేసింది. క్రిప్టో, హవాలా ద్వారా లగ్జరీ వాచ్‌లు కొనగోలు చేసినట్లు గుర్తించిన ఈడీ ఈ మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే కేసులో పొంగులేటి నివాసంలో చెన్నై కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారు.

News September 28, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

News September 28, 2024

రిటైర్మెంట్ ప్రకటించిన అంపైర్ అలీమ్ దార్

image

పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ అంపైరింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. పాక్‌లో ప్రస్తుత దేశవాళీ సీజన్ ముగిసిన అనంతరం తప్పుకొంటానని పేర్కొన్నారు. ఆయన దాదాపు 25 ఏళ్ల పాటు అంపైర్‌గా చేశారు. 2009-11 మధ్యకాలంలో మూడుసార్లు అంపైర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్నారు. మొత్తం 145 టెస్టులు, 231 ODIలు, 72 టీ20లు, 5 టీ20 కప్‌లు, 181 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 282 లిస్ట్-ఏ మ్యాచుల్లో దార్ అంపైర్‌గా నిల్చున్నారు.

News September 28, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: సెప్టెంబర్ 28, శనివారం
✒ఏకాదశి: మధ్యాహ్నం 02.50 గంటలకు
✒ అశ్లేష: రాత్రి 03.37 గంటలకు
✒ వర్జ్యం: మధ్యాహ్నం 03.21- 05.06 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 05.58 నుంచి 06.46 గంటల వరకు

News September 28, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* AP: అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే: CBN
* జగన్ చట్టాన్ని ఉల్లంఘించారు: చంద్రబాబు
* నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి: జగన్
* వైసీపీ పాలనలో అవినీతి పెరిగింది: పురందీశ్వరి
* TG: ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తాం: మంత్రి సీతక్క
* రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి
* ఎనుముల రేవంత్ ఎగవేతల రేవంత్‌గా మారారు: హరీశ్