News September 29, 2024

ఆ ఇద్దరి కోసం NASA, SpaceX కీలక ప్రయోగం

image

NASA-SpaceX శ‌నివారం రాత్రి 10.47 గంటలకి కీల‌క ప్ర‌యోగానికి సిద్ధమయ్యాయి. బోయింగ్ స్టార్‌లైన‌ర్‌లో సమస్య కార‌ణంగా ISSలోనే ఉండిపోయిన వ్యోమ‌గాములు సునీతా విలియ‌మ్స్‌, బుచ్ విల్మోర్‌ల‌ను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు క్ర్యూ-9 మిషన్‌ను ప్రయోగించనున్నాయి. అలాగే 5 నెలలపాటు పలు ప్రయోగాల నిమిత్తం ఇద్దరు వ్యోమగాములను ఈ ప్రయోగం ద్వారా ISSకి పంపనున్నారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగం జరుగుతుంది.

News September 29, 2024

ఆ ముగ్గురికీ బీసీసీఐ మొండిచేయి!

image

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు చోటు దొరకలేదు. దీనిపై వారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. బీసీసీఐ రాజకీయాల వల్ల వీరి కెరీర్ దెబ్బతింటోందని వాపోతున్నారు. సరైన కారణాలు లేకుండా కావాలనే వీరికి జట్టులో చోటు కల్పించట్లేదని ఆరోపిస్తున్నారు. జట్టులోకి రావాలంటే వారు ఇంకేం చేయాలని ప్రశ్నిస్తున్నారు.

News September 29, 2024

పురావస్తు శాఖపై ఢిల్లీ హైకోర్టు ఫైర్

image

ఢిల్లీలోని జామా మసీదును రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించకూడదన్న సంబంధిత ఫైల్‌ను సమర్పించడంలో పురావస్తు శాఖ విఫలమైందని ఢిల్లీ హైకోర్టు మండిపడింది. మసీదును ASI పరిధిలోకి తెస్తే ప్రభుత్వ పర్యవేక్షణ అధికమవుతుంది. దీంతో అలాంటి నిర్ణయం తీసుకోబోమని నాటి ప్రధాని మన్మోహన్ 2004లో షాహీ ఇమామ్‌కు హామీ ఇచ్చారు. దీన్ని ASI కూడా అంగీకరించింది. అయితే, సంబంధిత పత్రాలను సమర్పించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.

News September 29, 2024

హ‌స‌న్ న‌స్ర‌ల్లా మ‌ర‌ణం.. ఒక రోజు ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముఫ్తీ దూరం

image

పాలస్తీనా, లెబనాన్‌కు పీడీపీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీ సంఘీభావం ప్ర‌క‌టించారు. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా ఇత‌ర అమ‌ర‌వీరులకు ఆమె సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావంగా తాను జమ్మూకశ్మీర్‌లో ఒక‌రోజు ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా ఉండ‌నున్న‌ట్టు ఆమె ప్ర‌క‌టించారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో తాము పాల‌స్తీనా, లెబ‌నాన్‌ల‌కు అండ‌గా ఉంటామ‌ని పేర్కొన్నారు.

News September 29, 2024

నీరజ్ చోప్రా చెప్పిన సక్సెస్ సీక్రెట్ ఇదే

image

అథ్లెట్లు పాజిటివ్ మైండ్‌‌సెట్‌తో ఉండాలని ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా చెప్పారు. హరియాణా స్పోర్ట్స్ వర్సిటీ ఈవెంట్‌లో తన సక్సెస్ సీక్రెట్ తెలిపారు. ‘మనం చేయగలమని, ఫీల్డ్‌లో రాణిస్తామని బలంగా నమ్మితే అది జరుగుతుంది. శరీరం సహకరించకపోయినా ట్రైనింగ్ కొనసాగించాలి. బాడీ కంటే మైండ్ శక్తిమంతమైందని నేను భావిస్తా. నా ప్రణాళిక ప్రకారం ఎలాంటి పరిస్థితుల్లోనైనా శిక్షణ పూర్తిచేస్తా’ అని పేర్కొన్నారు.

News September 28, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

APలోని మన్యం, అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, ఉ.గో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, YSR, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంది. TGలోని HYD, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.

News September 28, 2024

Metaపై EU $100 మిలియన్ల భారీ జ‌రిమానా

image

ప్రైవ‌సీ బ్రీచ్ కార‌ణంగా Facebook మాతృ సంస్థ Metaపై యూరోపియన్ యూనియన్ $100 మిలియన్ల (రూ.837 కోట్లు) భారీ జ‌రిమానా విధించింది. EU యూజర్ల పాస్‌వ‌ర్డ్‌ల‌ను స‌రైన ఎన్‌క్రిప్ష‌న్ లేకుండా ప్లెయిన్ టెక్ట్స్ ఫార్మాట్‌లో స్టోర్ చేసిన‌ట్టు ద‌ర్యాప్తులో తేలింది. ఈ డేటాను ఎవ‌రైనా యాక్స్‌స్ చేయ‌గ‌లిగ‌తే యూజ‌ర్ల ప్రైవసీ ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే అని పేర్కొంది. 2019లోనే ఈ సమస్యను మెటా స్వయంగా అంగీకరించడం గమనార్హం.

News September 28, 2024

డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్

image

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎం పదవి వరించింది. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా ఉదయనిధి ప్రస్తుతం క్రీడా, యువజనశాఖతో పాటు చెన్నై మెట్రో రైల్ ఫేజ్-2 వంటి కార్యక్రమాలు కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు.

News September 28, 2024

ధూమ్-4లో విలన్‌గా రణ్‌బీర్ కపూర్?

image

ధూమ్‌-4లో ర‌ణ్‌బీర్ క‌పూర్ విల‌న్ రోల్ చేస్తున్న‌ట్టు బీటౌన్‌ టాక్. YRF బ్యాన‌ర్‌పై తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. గ‌త మూడు పార్ట్స్‌లో నటించిన యాక్టర్స్ ఎవ‌రూ ధూమ్‌-4 ఉండ‌కుండా నిర్మాత ఆదిత్య చోప్రా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌ని దృష్టిలో పెట్టుకొని రణ్‌బీర్‌ని విలన్ పాత్రకు ఒప్పించినట్లు తెలుస్తోంది. దీనిపై రణ్‌బీర్ కూడా ఆసక్తితో ఉన్నట్టు సమాచారం.

News September 28, 2024

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన

image

బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
జట్టు: సూర్య (C), అభిషేక్ శర్మ, శాంసన్, రింకూ సింగ్, హార్దిక్, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్
*అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో మూడు T20లు జరగనున్నాయి.