India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడికి కారకులు మీరంటే మీరని ఉక్రెయిన్, రష్యా ఆరోపించుకుంటున్నాయి. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నామని.. అదే నిజమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా పేర్కొంది. మరోవైపు ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ చెబుతోంది. ప్రజలను రెచ్చగొట్టేందుకు ఆ దేశ అధ్యక్షుడు పుతినే ఈ పని చేయించి ఉంటారని ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పేర్కొనడం గమనార్హం.
స్టార్ ట్యాగ్ ప్రతి హీరోకు ఉంటుంది. అది ఫ్యాన్స్‌కి ఓ ఎమోషన్. అభిమాన నటుడిని ఆ ట్యాగ్‌తో పిలిచేందుకు ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. అయితే హీరో రేంజ్ పెరిగేకొద్దీ ఈ ట్యాగ్ పేర్లూ మారుతున్నాయి. ‘పుష్ప’కి ముందు అల్లు అర్జున్‌కి స్టైలిష్ స్టార్ అని ఉండగా తర్వాత ఐకాన్ స్టార్ అయ్యారు. RRR తర్వాత యంగ్ టైగర్ కాస్తా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌గా ట్యాగ్స్ మారాయి.
TS: జగిత్యాలలో టెన్త్ క్లాస్ అమ్మాయిలు <<12905092>>గంజాయికి<<>> బానిసలైన కేసులో ఎస్పీ సంచలన విషయాలు వెల్లడించారు. జగిత్యాల గంజాయికి విశాఖతో లింక్ ఉందని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశామని, వీరు చదువు మానేసి గంజాయి విక్రయిస్తున్నారని తెలిపారు. సీలేరు నుంచి గంజాయి తెచ్చి జగిత్యాలలో చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
TG: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పద్మారావుగౌడ్ గతంలో ఎక్సైజ్ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఈయన సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ బరిలో ఉన్నారు.
AP: పొత్తుల వల్ల అందరికీ సీట్లు ఇవ్వలేకపోయామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి అభ్యర్థి గెలవాలనేది మూడు పార్టీల లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సారి గెలవకపోతే రాష్ట్రం నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్డీయేకు దేశంలో 400కు పైగా, రాష్ట్రంలో 160కి పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ నేతలతో వర్క్‌షాప్‌లో CBN ఈ కామెంట్స్ చేశారు.
ఆర్సీబీతో మ్యాచ్‌లో చురుగ్గా కనిపించిన ఎంఎస్ ధోనీ ఈ ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చని మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ తెలిపారు. ‘ఈ సీజన్‌లో కెప్టెన్ కూల్ బహుశా అన్ని మ్యాచ్‌లు ఆడరు. టోర్నమెంట్ మధ్యలో స్వల్ప విరామం తీసుకోవచ్చు. అందుకే నాయకత్వ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించారు. అయినా ధోనీ బాగానే రాణిస్తారు. దీని గురించి చింతించకండి’ అని గేల్ తెలిపారు.
విపరీతమైన ఎండలో పనిచేసే గర్భిణులకు అబార్షన్లు జరగడం లేదా ప్రసవ సమయంలో బిడ్డ చనిపోవడం లాంటి ప్రమాదాలు రెట్టింపు అయినట్లు ఓ అధ్యయనంలో తేలింది. శీతల ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణప్రాంతాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడైంది. వ్యవసాయం, ఇటుక బట్టీలు, ఉప్పు తయారీకి వెళ్లేవారితోపాటు స్కూళ్లు, ఆస్పత్రుల్లో పనిచేసే మహిళలపై అధ్యయనం చేసినట్లు చెన్నైకి చెందిన SRIHER సంస్థ వెల్లడించింది.
TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తుక్కుగూడలో జరిగే ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 14కు పైగా ఎంపీ స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న హస్తం పార్టీ.. ఇప్పటివరకు 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. త్వరలోనే మిగతా 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పారదర్శక విచారణ చేపట్టాలన్న జర్మన్ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఢిల్లీలోని జర్మనీ రాయబారిని పిలిపించిన విదేశాంగ శాఖ.. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏంటని నిలదీసింది. దోషిగా తేలే వరకు నిందితుడిని నిర్దోషిగానే పరిగణించాలనేది చట్టంలోని ప్రాథమిక అంశమని, కేజ్రీవాల్‌కూ ఇది వర్తిస్తుందని జర్మనీ పేర్కొనడం దుమారం రేపింది.
రష్యా ఉగ్రవాది ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 93కు చేరింది. 107 మంది చికిత్స పొందుతుండగా వీరిలో 60 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కాల్పులకు తెగబడ్డ నలుగురు ఉగ్రవాదులతో పాటు 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఓ ఉగ్రవాది ఫొటో రిలీజ్ చేశారు.
Sorry, no posts matched your criteria.