News March 19, 2024

పలు జిల్లాల్లో వర్షం

image

TG: ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం HYDలోని దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్, చార్మినార్, కోఠి తదితర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మెదక్(D) కౌడిపల్లిలో ఈదురుగాలులు, వర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలి మూడేళ్ల చిన్నారి సంగీత చనిపోయింది.

News March 19, 2024

BREAKING: భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోల మృతి

image

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. మృతుల్లో డీవీసీ సభ్యులు వర్గీష్, మంగాతు, ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేశ్ ఉన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారు. వీరిపై రూ.36 లక్షల రివార్డు ఉంది. సంఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News March 19, 2024

BRSకు మల్లారెడ్డి గుడ్ బై?

image

TG: మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు కుదరకపోతే బీజేపీలోకి వెళ్లేందుకైనా ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

News March 19, 2024

నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

image

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ మరో జాబితా ప్రకటనపై కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో ఇవాళ ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి, పేర్లు ప్రకటించనుంది. తెలంగాణలోని 15 స్థానాలకు పేర్లు ప్రకటించగా.. మిగిలిన 2 స్థానాలు, పొత్తులో భాగంగా ఏపీలో పోటీ చేసే 6 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

News March 19, 2024

ఎమ్మెల్సీ కవిత, BRSపై సంచలన ఆరోపణలు

image

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. ‘లిక్కర్ కేసులో కవిత నేరం రుజువైంది. బూటకపు, రాజకీయ కేసులని ఆమె చేసిన వాదన అబద్ధమని తేలింది. నెయ్యి డబ్బాలంటూ ఆమె చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతుంది. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో BRS రూ.వేల కోట్లు దాచింది’ అని తీహార్ జైలు నుంచి లేఖ రాశాడు.

News March 19, 2024

రాష్ట్రంలో ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన

image

TG: ఎన్నికల రోడ్‌షోలకు సెలవు రోజుల్లోనే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఇతర సమయాల్లో నిషేధం లేకున్నా, ప్రజలకు ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఆస్పత్రులు, ట్రామాకేర్, బ్లడ్‌బ్యాంకులున్న ప్రాంతాల్లో రోడ్‌షోలు చేపట్టవద్దన్నారు. 85 ఏళ్లు పైబడిన, దివ్యాంగ ఓటర్లు 7.2 లక్షల మందికి నామినేషన్ల ఉపసంహరణ పూర్తైన 4 రోజుల తర్వాత హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు.

News March 19, 2024

‘పుష్ప 2’లో త్రిప్తి దిమ్రీ?

image

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీలో బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. పుష్పరాజ్ అనుచరుడిని ట్రాప్ చేయించి చంపించే పాత్రలో త్రిప్తి నటిస్తున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కానుంది.

News March 19, 2024

నేడు CWC సమావేశం

image

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఢిల్లీలో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో, రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలకు సంబంధించిన హామీలపై చర్చించే అవకాశం. ఇవాళ్టి భేటీలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉంది.

News March 19, 2024

బాపట్ల TDP MP అభ్యర్థిగా ఎంఎస్ రాజు

image

AP: బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఈయన అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. వైసీపీపై ఆయన సుదీర్ఘంగా పోరాటం చేస్తుండటంతో ఆ పార్టీ టికెట్ కేటాయించింది. మరోవైపు ఆలపాటి రాజాకు పెనమలూరు సీటు కేటాయించినట్లు సమాచారం. అలాగే గంటా శ్రీనివాసరావుకు ఆసక్తి లేకపోయినా చీపురుపల్లి స్థానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై TDP అధికారిక ప్రకటన చేయనుంది.

News March 19, 2024

విషాదం: గుండెపోటుతో టెన్త్ విద్యార్థిని మృతి

image

AP: వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొర్రపాడులో టెన్త్ విద్యార్థిని లిఖిత(15) గుండెపోటుతో మృతి చెందింది. నిన్న పరీక్ష రాసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడుతూ బాలిక కుప్పకూలింది. వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.