India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన ‘రైతు హామీల సాధన దీక్ష’ కొనసాగుతోంది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు 24 గంటల దీక్ష చేస్తున్నారు. ‘అర్ధరాత్రి 2 దాటినా రైతు హామీల సాధన దీక్ష కొనసాగుతోంది. బీజేపీ ప్రతినిధులు దీక్షా శిబిరంలో సేద తీరుతున్నారు’ అని ఇందుకు సంబంధించిన ఫొటోలను టీ బీజేపీ Xలో పోస్ట్ చేసింది.

AP: వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొత్తం ₹602కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ₹588కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు CMకి తెలిపారు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అయి లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, వివరాలు సరిగా లేకపోవడంతో కొందరి అకౌంట్లలో నగదు జమ కాలేదని, బ్యాంక్‌కు వెళ్లి KYC పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించామన్నారు.

US వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నవారికి ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటీ గుడ్ న్యూస్ చెప్పారు. భారతీయుల కోసం అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్స్ కేటాయించినట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటికే 12 లక్షలకు పైగా ఇండియన్స్ US వెళ్లారు. అమెరికా గణాంకాల ప్రకారం.. 2023 అక్టోబరు నుంచి ఏడాది కాలంలో 6 లక్షల స్టూడెంట్ వీసాలను అమెరికా జారీ చేయగా వాటిలో ప్రతి నాలుగింటిలో ఒకటి భారత విద్యార్థిదే కావడం గమనార్హం.

ముకేశ్ ఖన్నా పోషించిన శక్తిమాన్ పాత్ర ఓ తరాన్ని కట్టిపడేసింది. ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా అదే శక్తిమాన్‌ను సినిమాగా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఖన్నా పెదవివిరిచారు. ‘రణ్‌వీర్ అద్భుతమైన నటుడు. తన ఎనర్జీ వేరే స్థాయిలో ఉంటుంది. కాదనను. కానీ తను శక్తిమాన్‌గా పనికిరాడు. ఓ మ్యాగజైన్‌కు నగ్నంగా ఫోజులిచ్చినప్పటి నుంచి అతడిపై నా అయిష్టం మొదలైంది’ అని పేర్కొన్నారు.

కార్ల తయారీ రంగంలో కాంపాక్ట్ SUV మాగ్నైట్‌తో నిసాన్ భారత మార్కెట్‌లో కొంతమేర భాగస్వామ్యం దక్కించుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఆ కారు ఫేస్‌లిఫ్ట్‌ను అక్టోబరు 4న తీసుకొస్తోంది. ప్రీలాంఛ్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయినట్లు సంస్థ ప్రకటించింది. మారుతీ ఫ్రాంక్స్, బ్రెజా, రెనాల్ట్ కైగర్, కియా సొనెట్ కార్లకు ఇది పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్స్‌షోరూమ్‌లో దీని ప్రారంభ ధర సుమారు రూ.6లక్షలు ఉండొచ్చని అంచనా.

TG: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఆదిలాబాద్(D) మేకలగండి వద్ద NH-44పై అర్ధరాత్రి డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడడంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సాయంత్రం సూర్యాపేట(D) సీతారామపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది.

తేది: అక్టోబర్ 1, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:25 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:05 గంటలకు
ఇష: రాత్రి 7.17 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

1862: విద్యావేత్త, సంఘసంస్కర్త రఘుపతి వేంకటరత్నం నాయుడు జననం
1922: హాస్య నటుడు అల్లు రామలింగయ్య జననం
1928: తమిళ సినీ నటుడు శివాజీ గణేశన్ జననం
1945: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జననం
1946: సినీ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం మరణం
1953: ఆంధ్ర రాష్ట్రం అవతరణ
1975: సినీ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మరణం
* జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. ముందస్తు చికిత్సలో భాగంగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆయన ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నాయి. ఆయనకు వైద్యులు గుండెకు సంబంధించిన టెస్టులు, చికిత్స చేయనున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.