News September 22, 2024

టెట్ హాల్‌టికెట్లు విడుదల

image

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్లను పొందొచ్చు.

News September 22, 2024

వంట పాత్రల కొనుగోలుకు నిధుల విడుదల

image

TG: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి అవసరమయ్యే వంట పాత్రల కొనుగోలుకు విద్యాశాఖ నిధులు విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి స్కూల్‌కి రూ.10వేల నుంచి రూ.25 వేలు కేటాయించింది. మొత్తంగా రూ.23.76 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పథకం నిర్వహణ కోసం 23 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకునేందుకు డీఈవోలకు అనుమతినిచ్చింది.

News September 22, 2024

OTTల్లో పొగాకు హెచ్చరికలు తప్పనిసరి!

image

పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలపై హెచ్చరిక ప్రకటన OTTలకు తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈమేరకు సవరించిన ప్రతిపాదనలను కేంద్రం విడుదల చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ స్టేటస్‌తో సంబంధం లేకుండా ప్రసారమయ్యే అన్ని సినిమాలకు ప్రారంభంలో, మధ్యలో కనీసం 30సెకన్ల పొగాకు వ్యతిరేక ప్రకటన ప్రసారం చేయాల్సి ఉంటుంది. సినిమాల్లోనూ పొగాకు ఉత్పత్తులను వాడే సన్నివేశాల సమయంలో హెచ్చరికలు ప్రదర్శించాల్సి ఉంటుంది.

News September 22, 2024

ముంపు నష్టం నమోదుకు నేడు, రేపు అవకాశం

image

AP: విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 2,740 మంది ఖాతాదారుల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రూ.148.22 కోట్ల రుణాలు రీషెడ్యూల్ చేశామని, కొత్తగా రూ.9.62 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. ముంపు నష్ట పరిహారం నమోదుకు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే నేడు, రేపు సచివాలయాలను సంప్రదించి ఎన్యూమరేషన్ చేయించుకోవాలని తెలిపారు. సోమవారం తుది జాబితా ప్రకటిస్తామన్నారు.

News September 22, 2024

అల్ప పీడనం.. భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాలను మళ్లీ భారీ వర్షాలు పలకరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడుతుందని, దీంతో APలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో 24, 25న భారీ వర్షాలు, 26న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

News September 22, 2024

24వ తేదీ వరకు ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం

image

AP: కన్వీనర్ కోటా కింద తొలి విడతలో MBBS సీటు పొందిన విద్యార్థులు ఎలాంటి నిబంధనలు లేకుండా సీటు వదులుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు NTR హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. గడువు దాటిన తర్వాత వచ్చిన అభ్యర్థనలు స్వీకరించబోమని పేర్కొంది. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటల్లోగా సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్‌కు లేఖ అందించాలంది. ఇటు కళాశాలల్లో చేరిన విద్యార్థులు 24వ తేదీలోగా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.

News September 22, 2024

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంలో రివ్యూ పిటిషన్: మాజీ ఎంపీ

image

AP: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఐకమత్యంగా ఉన్న జాతిని విడదీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడుతామని చెప్పారు.

News September 22, 2024

అన్న క్యాంటీన్లకు పసుపు రంగు వేయడాన్ని సవాల్ చేస్తూ పిల్

image

AP: అన్న క్యాంటీన్లు, ప్రభుత్వ భవనాలకు టీడీపీ రంగులు వేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భవనాలకు పసుపు రంగులు వేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని.. నోటిఫికేషన్ విడుదలైతే ఆ రంగులు తొలగించాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో ప్రజాధనం వృథా అవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

News September 22, 2024

త్వరలో కొత్త పాఠ్యపుస్తకాలు

image

TG: నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్(NCF) ప్రకారం కొత్త పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ దశలవారీగా రూపొందించనుంది. 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పుస్తకాల్లో మార్పులు చేశారు. అయితే 2023లో కేంద్రం విడుదల చేసిన ఎన్సీఎఫ్ ప్రకారమే కొత్త కరిక్యులం రూపొందించాల్సి ఉంది. తొలుత నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు, ఆ తర్వాత తెలుగు, హిందీ, ఉర్దూ వంటి భాషలకు కొత్త కరిక్యులాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

News September 22, 2024

హెజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

image

మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు చేపట్టిన క్షిపణి దాడుల్లో 38 మంది మృతి చెందారు. ఇందులో హెజ్బొల్లా నెం.2 ఇబ్రహీం అకీల్ ఉన్నారు. మొత్తంగా సంస్థకు చెందిన 16 మంది కీలక కమాండర్లను హతమార్చింది. సంస్థ చీఫ్ నస్రల్లాతో పాటు మరో ఇద్దరు కీలక కమాండర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. తమ పౌరులకు హాని కలిగించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది.