News September 24, 2024

కర్ణాటక CM సిద్దరామయ్యకు షాక్

image

ముడా కుంభకోణం వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. దర్యాప్తు కోసం గవర్నర్ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూ కేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా సిద్దరామయ్య కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై విచారణకు గవర్నర్ ఆదేశించారు.

News September 24, 2024

భారత్, చైనా ఫైట్‌లో సాండ్‌విచ్ అవ్వలేం: దిసనాయకే

image

జియో పొలిటికల్ రైవల్రీకి శ్రీలంకను దూరంగా ఉంచుతానని ప్రెసిడెంట్ దిసనాయకే అన్నారు. పొరుగు దేశాలతో సంబంధాల్లో సమతూకం పాటిస్తానని చెప్పారు. ‘ఆ ఫైట్‌కు మేం దూరంగా ఉంటాం. అలాగే ఏదో ఒక పక్షం వైపు ఉండం. ప్రత్యేకించి భారత్, చైనా మధ్య సాండ్‌విచ్ అవ్వలేం. ఆ 2 మాకు మిత్రదేశాలే. అవి మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాం. EU, మిడిల్ఈస్ట్, ఆఫ్రికాతో సంబంధాలు కొనసాగిస్తాం’ అని తన ఫారిన్ పాలసీ గురించి వివరించారు.

News September 24, 2024

మా బౌలర్లు అహంకారులు: పాక్ మాజీ పేసర్

image

తమ దేశ బౌలర్లు తామే గొప్ప అనే భావనలో ఉంటారని పాకిస్థాన్ మాజీ పేసర్ బాసిత్ అలీ అన్నారు. అందుకే మోర్నే మోర్కెల్‌ను చిన్న చూపు చూసి పక్కనపెట్టారని మండిపడ్డారు. ‘భారత్, పాక్ ఆటగాళ్ల మైండ్ సెట్ వేరు. పాక్‌ను వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌ను టీమ్ ఇండియా చిత్తు చేసింది. పాక్ ఒత్తిడికి గురైంది. భారత్ కాలేదు. మోర్కెల్ కోచింగ్‌ను టీమ్ ఇండియా బౌలర్లు ఆస్వాదిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

News September 24, 2024

BISలో 315 ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియాలో 315 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సీనియర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థులు SEP 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. విద్యార్హత, వయో పరిమితి, జీతభత్యాల వివరాల కోసం ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి.

News September 24, 2024

అణ్వాయుధాలు రష్యా వద్దే అధికం!

image

అణుబాంబు పేలితే జరిగే నష్టాన్ని ఎవరూ అంచనా వేయలేరు. దీని ప్రభావం కొన్ని కిలోమీటర్ల మేర ఉంటుంది. అలాంటి అణ్వాయుధాలను కలిగిన దేశాల జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉంది. రష్యా వద్ద 5,500 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని తాజా నివేదికలు వెల్లడించాయి. ఆ తర్వాతి స్థానాల్లో USA(5,044), చైనా(500), ఫ్రాన్స్‌(290), UK(225), ఇండియా(172) ఉన్నాయి. పాకిస్థాన్ వద్ద 150-160 వరకు అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా వేశాయి.

News September 24, 2024

మా యుద్ధం హెజ్‌బొల్లాతోనే.. మీతో కాదు: నెతన్యాహు

image

తమ యుద్ధం హెజ్‌బొల్లాతోనేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. హెజ్‌బొల్లాకు లెబనాన్ పౌరులు మానవ కవచాలుగా మారొద్దని సూచించారు. ‘కొన్నేళ్లుగా హెజ్‌బొల్లా మీ ఇళ్లలో రాకెట్లు, క్షిపణులు దాచిపెడుతోంది. వీటితో మా దేశ ప్రజలపైకి దాడులకు పాల్పడుతోంది. మా ప్రజలను రక్షించుకోవడం కోసం దాడులు చేయక తప్పడం లేదు. యుద్ధం ముగిసేవరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు దక్కించుకోండి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

News September 24, 2024

విజయ్ పాల్‌కు చుక్కెదురు

image

AP: టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజును ఇబ్బంది పెట్టారన్న కేసులో సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కాగా సీఐడీ కస్టడీలో తనను వేధించారని RRR గుంటూరు నగరం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 24, 2024

ఓవర్సీస్‌లో ‘దేవర’ సంచలనం సృష్టించనుందా?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా ఓవర్సీస్‌లో సంచలనం సృష్టించేలా కనిపిస్తోందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రీమియర్స్‌తో పాటు ఫస్డ్ డే కలెక్షన్లు కలిపి $5 మిలియన్లు క్రాస్ చేస్తుందని చెబుతున్నాయి. ప్రీమియర్స్ తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఇక $6M వరకు రావొచ్చని పేర్కొన్నాయి. ఏది ఏమైనా వీకెండ్ పూర్తయ్యేలోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేశాయి. ‘దేవర’ చూసేందుకు మీరూ వెళ్తున్నారా?

News September 24, 2024

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా చంద్రబాబు: YCP

image

AP:తిరుమల లడ్డూ విషయంలో TTD EO, CM మాటలకు పదేపదే తేడాలేంటని YCP ప్రశ్నించింది. ‘వెజిటబుల్ ఫ్యాట్స్ గుర్తించామని జులై 23న EO చెబితే, యానిమల్ ఫ్యాట్స్ అని CM అన్నారు. ఆ తర్వాత EO యానిమల్ ఫ్యాట్స్ అన్నారు. నాణ్యత లేదని 4 ట్యాంకర్ల నెయ్యి వాడలేదని EO చెప్పారు. CM 2-3 ట్యాంకర్లు ఆలయంలోకి వెళ్లాయన్నారు. లోకేశ్ నిన్న 4 ట్యాంకర్లు వెనక్కి పంపామన్నారు. దేవుడి విషయంలో ఎందుకిన్ని డ్రామాలు?’ అని నిలదీసింది.

News September 24, 2024

ఘోరం.. నర్సింగ్ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్

image

కోల్‌కతా లేడీ డాక్టర్‌పై హత్యాచార ఘటన మరవకముందే తమిళనాడులో మరో ఘోరం జరిగింది. దిండిగల్ జిల్లాలో స్వస్థలం తెని నుంచి బయలుదేరిన ఓ నర్సింగ్ స్టూడెంట్‌ను కొందరు దుండగులు అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని దిండిగల్ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లారు. పోలీసులు ఆమెను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.